మరికొన్ని రోజుల్లో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియబోతుంది. మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) లేదా సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి ప్రభుత్వ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నట్టయితే ఈ నెలాఖరు లోపు మీరు మీ ఖాతాలో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ ఖాతాలు ఇనాక్టివ్ గా (Inactive) మారిపోయే ప్రమాదం ఉంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఈ పథకాల్లో ప్రతి ఏటా కొంత కనీస మొత్తాన్ని ఖచ్చితంగా జమ చేయాలి. ఒకవేళ ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా ఈ కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే.. ఆ ఖాతా 'డిఫాల్ట్' అయినట్లు పరిగణించబడుతుంది. ఇలాంటి ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలంటే.. బాకీ ఉన్న మొత్తంతో పాటు పెనాల్టీని కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంత జమ చేయాలి? పెనాల్టీ ఎంత?
- సుకన్య సమృద్ధి యోజన (SSY): ఈ పథకంలో ఖాతా యాక్టివ్‌గా ఉండాలంటే ఏడాదికి కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. ఒకవేళ చేయకపోతే ప్రతి ఏడాదికి రూ.50 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 8.2% గరిష్ట వడ్డీని అందిస్తోంది.
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): ఈ ఖాతాను కాపాడుకోవడానికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 జమ చేయడం తప్పనిసరి. గడువులోపు డిపాజిట్ చేయని పక్షంలో ఏడాదికి రూ.50 జరిమానా విధిస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాదారులకు 7.1% వడ్డీ లభిస్తోంది.
ఒకవేళ మీరు ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమ చేయకపోతే.. వెంటనే కనీసం పైన పేర్కొన్న మొత్తాలను మీ ఖాతాలో వేయండి. లేదంటే వచ్చే ఏడాది నుండి మీకు వడ్డీ రాకపోవడమే కాకుండా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కోల్పోతారు.
పన్ను ఆదా చేసుకునే సువర్ణావకాశం
సుకన్య సమృద్ధి యోజన (SSY) , పీపీఎఫ్ (PPF)లలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఆదాయపు పన్ను మినహాయింపు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే మీ మొత్తం వార్షిక ఆదాయం నుండి ఈ మొత్తాన్ని తగ్గించుకోవడం ద్వారా మీరు చెల్లించాల్సిన పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పథకాల ద్వారా వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం కూడా పూర్తిగా పన్ను రహితం కావడం విశేషం.
చివరి నిమిషం వరకు వేచి చూడకండి!
చాలామంది మార్చి 31 వరకు వేచి చూస్తుంటారు. కానీ, చివరి రోజుల్లో బ్యాంకు సెలవులు ఉండవచ్చు లేదా సర్వర్ సమస్యలు (Technical Issues) తలెత్తవచ్చు. దీనివల్ల మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే అనవసరంగా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ముందస్తుగానే మీ డిపాజిట్లను పూర్తి చేసి, మీ ఖాతాను యాక్టివ్ గా ఉంచుకోండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ చిన్న పొదుపు.. రేపు వారికి పెద్ద ఆసరాగా నిలుస్తుంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications