ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా బెంగళూరు (Bengaluru)ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కర్ణాటక ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసింది. ఐటీ హబ్ గా పేరుగాంచిన ఈ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, ప్రజా రవాణాను బలోపేతం చేసేందుకు 'నమ్మ మెట్రో' (Namma Metro) , రోడ్డు నెట్‌వర్క్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

నమ్మ మెట్రో: దేశంలోనే రెండో అతిపెద్ద నెట్‌వర్క్
ప్రస్తుతం బెంగళూరులో నమ్మ మెట్రో 96 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీని ద్వారా ప్రతిరోజూ సుమారు 10 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ఈ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) లో అదనంగా మరో 41 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విస్తరణ పూర్తయితే ప్రతిరోజూ 15 లక్షల మంది ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ మెట్రో ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఖర్చు చేసిన రూ. 67,460 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏకంగా 88 శాతం (రూ. 59,376 కోట్లు) కాగా.. కేంద్రం వాటా కేవలం 12 శాతమే ఉండటం గమనార్హం.
మౌలిక వసతులు, ట్రాఫిక్ పరిష్కారాలు
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం 'బిజినెస్ కారిడార్' ప్రాజెక్టును వేగవంతం చేసింది. తుమకూరు రోడ్డు నుండి హోసూర్ రోడ్డు వరకు 73 కిలోమీటర్ల పొడవైన 'బెంగళూరు బిజినెస్ కారిడార్ ఫేజ్-1' నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రైతులు, భూ యజమానులకు ప్రాధాన్యత క్రమంలో పరిహారం అందజేస్తున్నారు. ఈ రోడ్డును వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పాటు, 158 కిలోమీటర్ల మేర రోడ్లకు రూ. 1,700 కోట్లతో 'వైట్ టాపింగ్' (White-topping) పనులు చేపట్టారు.
గ్లోబల్ స్టాండర్డ్ కారిడార్, పాదచారుల సౌకర్యాలు
సిల్క్ బోర్డ్ జంక్షన్ నుండి కె.ఆర్. పురం మెట్రో స్టేషన్ వరకు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును (ORR) రూ. 450 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో మెట్రో వయాడక్ట్ వెంట 9 కిలోమీటర్ల పొడవైన పాదచారుల నడక దారిని (Pedestrian Walkway) నిర్మించనున్నారు. రూ. 160 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు ఔటర్ రింగ్ రోడ్డు కంపెనీల అసోసియేషన్ (ORRCA) స్పాన్సర్‌షిప్ అందిస్తోంది. ఇది మెట్రో స్టేషన్లకు చేరుకునే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
విద్యార్థుల కోసం 'విద్యార్థి ఇందిరా క్యాంటీన్లు'
ఉన్నత చదువులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో రెండు, ధార్వాడ్‌లో నాలుగు 'విద్యార్థి ఇందిరా క్యాంటీన్లను' ప్రారంభించనున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించడం ఈ పథకం ఉద్దేశ్యం. అలాగే, వర్ష కాలంలో వరద ముప్పును తప్పించడానికి రూ. 2,000 కోట్లతో మురుగునీటి కాల్వల (Storm Water Drains) అభివృద్ధి పనులను కూడా ప్రభుత్వం చేపడుతోంది. ఈ భారీ ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. బెంగళూరు (Bengaluru) నగరం ఒక స్మార్ట్ , గ్లోబల్ సిటీగా మారి ప్రయాణికులకు, నివాసితులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications