For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌కు 'ప్రత్యేక' హోదా లేకుంటే మనకే నష్టం: అమెరికా సభ్యులు

|

భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా (GSP-జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్)ను పునరుద్ధరించాలని అమెరికా చట్ట సభలకు చెందిన 44 మంది ప్రతినిధులు డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ట్రంప్ ప్రభుత్వంలోని వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ హైజర్‌కు లేఖను అందించారు. గత జూన్ నెలలో జీఎస్పీ జాబితా నుంచి భారత్‌ను తొలగిస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

డెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు చాలా భద్రం, ఎందుకో తెలుసాడెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు చాలా భద్రం, ఎందుకో తెలుసా

డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మద్దతు

డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మద్దతు

ఈ మేరకు హౌస్ మెంబర్స్ మంగళవారం యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రాబర్డ్‌కు లేఖ రాశారు. కాంగ్రెస్‌మెన్ జిమ్ హైమ్స్, రాన్ ఎస్టెస్ నేతృత్వంలోని సభ్యులు సంతకాలు చేసి ఈ లేఖను అందించారు. ఈ లేఖపై 26 మంది డెమోక్రాట్లు, 18 మంది రిపబ్లికన్లు సంతకం చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ప్రయోజనాలను విస్తరించే ఉద్దేశ్యం ఇందులో కనిపిస్తోంది.

దిగుమతులు పెరిగాయి..

దిగుమతులు పెరిగాయి..

అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల మద్దతు భారత్‌కు జీఎస్పీ హోదా కల్పించడానికి మద్దతు ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. భారత్‌కు జీఎస్పీ హోదా తొలగించడం ద్వారా ఆర్థికంగనే కాకుండా ఉద్యోగాల పరంగాను అమెరికా నష్టపోతోందని ఈ ప్రతినిధులు చెబుతున్నారు. జీఎస్పీ హోదా తొలగింపుతో ఎక్కువ ట్యాక్స్ వేసినప్పటికీ జూన్ - జూలై నెల్లో భారత్ నుంచి 40 శాతం దిగుమతులు పెరిగినట్లు చెబుతున్నారు.

జీఎస్పీ రద్దుతో అమెరికాకే నష్టం

జీఎస్పీ రద్దుతో అమెరికాకే నష్టం

ఇవన్నీ గతంలో జీఎస్పీ అర్హత కలిగిన ఉత్పత్తులేనని చెబుతున్నారు. చైనాతో వాణిజ్య విభేదాల నేపథ్యంలో భారత్‌కు కంపెనీలు తరలడమే దిగుమతుల పెరుగుదలకు కారణమై ఉంటుందని చెబుతున్నారు. పెరిగిన ట్యాక్స్ కారణంగా అమెరికన్ బిజినెస్‌మెన్ ఒక మిలియన్ డాలర్ల మేర భారత ఎక్సపోర్టర్స్‌కు బిల్లులు బకాయిపడ్డట్లు చెప్పారు. కేవలం జూలై నెలలోనే 30 మిలియన్ డాలర్లు చెల్లించవలసి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు జీఎస్పీ హోదా రద్దు చేయడం ద్వారా అమెరికా భారీగా నష్టపోతుందన్నారు.

English summary

భారత్‌కు 'ప్రత్యేక' హోదా లేకుంటే మనకే నష్టం: అమెరికా సభ్యులు | US Congress backs India's demand for restoration of GSP scheme

The Donald Trump administration has been urged by a group of 44 influential lawmakers to reinstate India as a beneficiary of the duty-free import scheme for developing nations.
Story first published: Wednesday, September 18, 2019, 17:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X