For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టపోయాం.. మోడీతో మాట్లాడండి: భారత్ దెబ్బతో అమెరికా సాగుదార్లకు షాక్

|

వాషింగ్టన్: అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరువైపుల టారిఫ్‌లు పెంచుకోవడం, భారత్‌కు GSP హోదాను తొలగించడం చర్చనీయాంశంగా మారాయి. పెద్దన్నకు ధీటుగా మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అమెరికా నుంచి యాపిల్స్, బాదాం, వాల్‌నట్ భారత్‌కు పెద్ద ఎత్తున దిగుమతు అవుతాయి. వీటిపై భారత్ అధిక టారిఫ్ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు.

భారత్ అధిక టారిఫ్‌లపై మరిన్ని చర్యలు: అమెరికా హెచ్చరికభారత్ అధిక టారిఫ్‌లపై మరిన్ని చర్యలు: అమెరికా హెచ్చరిక

ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి

ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి

భారత్‌కు తమ ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు అవకాశాలు సన్నగిల్లాయని, టారిఫ్ తగ్గించాలని మోడీ ప్రభుత్వాన్ని కోరాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో భారత్ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా యాపిల్స్, బాదాం, వాల్‌నట్ తదితర అంశాలను ప్రస్తావించాలని, టారిఫ్ తగ్గేలా చర్యలు తీసుకోవాలని అమెరికాన్ చట్టసభ ప్రతినిధులు మైక్ పాంపియోను కోరారు. ముఖ్యంగా బాదాం (అల్మాండ్) టారిఫ్ గురించి మాట్లాడారన్నారు.

మోడీతో బాదాం వంటి ఉత్పత్తులపై మాట్లాడండి

మోడీతో బాదాం వంటి ఉత్పత్తులపై మాట్లాడండి

భారత్ అధిక టారిఫ్ విధిస్తోందని ట్రంప్, అమెరికా ప్రభుత్వం పదేపదే విమర్శించింది. GSP హోదాను తొలగించింది. స్టీల్, అల్యూమినియం వంటి భారత్ వస్తువులపై టారిఫ్ విధించారు. దీంతో అమెరికా నుంచి దుగుమతి చేసుకునే యాపిల్స్, బాదాం, ఆక్రోట్, వైన్ సహా 28 ఉత్పత్తులపై ఈ నెల 16వ తేదీ నుంచి భారత్ భారీగా టారిఫ్ పెంచింది. భారత్ టారిఫ్ పెంచడంతో అమెరికా ఆందోళన చెందుతోంది. కాంగ్రెస్‌మ్యాన్ జోష్ హార్డర్ తాజాగా మైక్ పాంపియోకు లేఖ రాశారు. మోడీతో భేటీ సందర్భంగా బాదాం టారిఫ్ గురించి మాట్లాడాలని కోరారు.

ఎక్కువ అల్మాండ్స్ పై అధిక టారిఫ్ ఇబ్బందికరం

ఎక్కువ అల్మాండ్స్ పై అధిక టారిఫ్ ఇబ్బందికరం

అల్మాండ్స్ ఎక్కువగా పండించే డిస్ట్రిక్ట్‌లలో జోష్ హార్డర్ ప్రాతినిథ్యం వహిస్తున్న డిస్ట్రిక్ట్ కూడా ఉంది. దేశంలోనే ఎక్కువ ఇక్కడే పండుతుంది. అలాగే, ఇక్కడి నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకునేది భారత్. ఈ నేపథ్యంలో జోష్ హార్డర్ లేఖ రాశారు. అమెరికా ప్రయోజనాలపై పాంపియో దృష్టి సారించాలని, ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, అల్మాండ్స్ పైన అధిక టారిఫ్ తమ లోకల్ ఎకానమీకి ఎంతో ఇబ్బందికర అంశమని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఇది మాకు దెబ్బ..

ఇది మాకు దెబ్బ..

అల్మాండ్ అలయెన్స్ ఆఫ్ కాలిఫోర్నియా ఎలైన్ ట్రెవినో మాట్లాడుతూ... కాలిఫోర్నియా అల్మాండ్స్‌కు భారత్ పెద్ద దిగుమతిదారు అని, చైనాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో భారత్‌కు మరింత ఎగుమతులు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో టారిఫ్ తమకు ఇబ్బందికరమని, ఇరుదేశాధినేతల భేటీలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌కు GSP హోదా తీసివేసినందుకు కౌంటర్‌గా భారత్ బాదం వంటి వాటిపై అధిక టారిఫ్ విధించిందని, అల్మాండ్స్‌ను భారీగా పండించే డిస్ట్రిక్ట్‌లలో తమది కూడా ఒకటని, ట్రంప్ GSP తొలగించినందుకు, ఇండియా విధించిన టారిఫ్ తమకు నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. మైక్ పాంపియో జూన్ 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత ఒకాసోలో జరగనున్న G20 సమ్మిట్‌లో 28-29 తేదీల్లో ట్రంప్ - మోడీ సమావేశం కానున్నారు.

భారత్ దెబ్బ.. తగ్గుతున్న దిగుమతులు

భారత్ దెబ్బ.. తగ్గుతున్న దిగుమతులు

అమెరికా యాపిల్స్‌కు భారత్ చాలా ఏళ్లపాటు అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. కానీ భారత్ టారిఫ్ పెంచడంతో ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది టాప్ 3కి పడిపోయింది. ఏటా సగటున 10 కోట్ల డాలర్ల విలువైన 50 లక్షల పెట్టెల యాపిల్స్‌ మన దేశంలోకి దిగుమతి అవుతున్నాయి. గత ఏడాదిలో అమెరికా నుంచి 15.6 కోట్ల డాలర్ల విలువైన యాపిల్స్‌ను భారత్‌ కొనుగోలు చేసింది. ఈ జూన్‌ 15 నాటికి 26 లక్షల పెట్టెల యాపిల్స్‌‌ను దిగుమతి చేసుకుంది. గత ఏడాది ఇదే సమయానికి 78 లక్షల పెట్టెలను దిగుమతి చేసుకుంది భారత్. అలాగే, కాలిఫోర్నియా అల్మాండ్‌కు భారత్ నెంబర్ వన్ మార్కెట్. అంతకుముందే, స్టీల్, అల్యూమినియం పైన అమెరికా టారిఫ్ పెంచడంతో 35 శాతం ఎగుమతులు తగ్గాయి.

English summary

నష్టపోయాం.. మోడీతో మాట్లాడండి: భారత్ దెబ్బతో అమెరికా సాగుదార్లకు షాక్ | US to raise almond tariff issue with India

Ahead of Secretary of State Mike Pompeo's visit to India next week, an influential American lawmaker has asked him to take up the issue of increased tariff on almonds during his meeting with Prime Minster Narendra Modi.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X