For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియా-కొత్త ఉత్పత్తులపై సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?

|

వాషింగ్టన్: భారతీయ మార్కెట్లు కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసేలా సహకరిస్తాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. భారత్‌లో అభివృద్ధి చేసినవాటిని అంతర్జాతీయస్థాయికి తీసుకు వెళ్లవచ్చునని చెప్పారు. ఆయన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సెల్‌.. ఇండియా ఐడియాస్ సదస్సులో మాట్లాడారు. పరిమాణంపరంగా భారత్ మార్కెట్ చాలా పెద్దదని, దీంతో ఇక్కడ ప్రయోగాలు గూగుల్‌కు సాధ్యమవుతోందని చెప్పారు. పాలనని, సామాజిక, ఆర్థికపరిస్థితుల్ని మెరుగుపర్చుకునేందుకు భారత ప్రభుత్వం టెక్నాలజీని అద్భుతంగా వినియోగిస్తోందన్నారు. ఇందులో తాము భాగస్వాములం కావడం సంతోషమన్నారు.

గత మూడు నాలుగేళ్లుగా ఆసక్తికర ట్రెండ్ ఉందని, భారత్ క్రమంగా డిజిటల్ చెల్లింపులవైపు మళ్లుతోందని, దీంతో చెల్లింపుల సాధనాలను ప్రవేశ పెట్టేందుకు భారత్ సరైన మార్కెట్ అని తాము భావించామని, ఇది మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. భారత మార్కెట్ కోసం రూపొందించిన సాధనాన్ని ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించామన్నారు. ఫోన్ల ధరలు తగ్గించి మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ కృషి చేస్తోందన్నారు.

eSIMతో ఇక పోర్టబులిటీ ఎంతో సులభం: ఏమిటిది, ఎవరికి ఇబ్బందులు?eSIMతో ఇక పోర్టబులిటీ ఎంతో సులభం: ఏమిటిది, ఎవరికి ఇబ్బందులు?

Sundar Pichai says India, US can lead on standardising privacy frameworks

అమెరికా - భారత్ దేశాలు కలిసి వ్యక్తిగత గోప్యతకు సరైన ప్రమాణాలను తీసుకు రాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. డేటా ప్రైవసీని కాపాడేందుకు కావాల్సిన ప్రమాణాల రూపకల్పనలో ఈ రెండు దేశాలు కీలకపాత్ర పోషించగలవని అన్నారు. చాలా రోజుల నుంచి గూగుల్ భారత్‌లో ఉండటంతో ఒక విషయాన్ని గమనించానని, ఉత్పత్తిదారులు చాలా పరికరాల్ని దేశీయంగా తయారు చేస్తున్నారని సుందర్ పిచాయ్ అన్నారు.

2004లో ఫోన్లకు సంబంధించిన పరికరాలను తయారు చేసే సంస్థలు కేవలం రెండే ఉన్నాయని, ఇప్పుడు 200 దాటిందని చెప్పారు. 15 ఏళ్లలో భారత్ మార్కెట్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. భారత మార్కెట్లో పోటీని తట్టుకొనేలా తాము తయారు చేసే ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో ఉంటాయన్నారు. భారత్‌ను ఒక అవకాశంగా తాము చూడటం లేదని, భారత్‌ను నిర్మిస్తే ప్రపంచానికి సేవ చేయవచ్చునని భావిస్తున్నామని చెప్పారు.

గత ఏడాదిలో గూగుల్ మూడు లక్ష్యాలను నిర్దేశించుకుందని, ఇందులో ఇంటర్నెట్ ఎక్కువ మందికి దరి చేర్చడం, భారతీయులకు అవసరమయ్యే విధంగా గూగుల్ ఉత్పత్తులు రూపొందించడం, భారత్‌లో తమ అత్యుత్తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందించడం అన్నారు. కాగా, ఈ సదస్సులో సుందర్ పిచాయ్‌కు, నాస్దక్ అధ్యక్షుడు ఆడేనా ఫ్రైడ్‌మాన్‌కు గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డులను అందించారు.

English summary

ఇండియా-కొత్త ఉత్పత్తులపై సుందర్ పిచాయ్ ఏమన్నారంటే? | Sundar Pichai says India, US can lead on standardising privacy frameworks

The scale of India's market has allowed Google to develop new products in the country and take it to a global level, the internet giant’s Indian-American CEO Sundar Pichai has said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X