For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెక్కీలకు గుడ్‌న్యూస్: గోల్డ్‌మాన్ శాక్స్‌లో ఉద్యోగాలు, గ్లోబల్‌హబ్‌గా బెంగళూరు ఆఫీస్

|

గోల్డ్‌మాన్ శాక్స్ తన బెంగళూరు కార్యాలయంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనుంది. ఈ కంపెనీ 2004లో 290 మంది ఉద్యోగులతో ఇక్కడ ప్రారంభించింది. ఇప్పుడు 5వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రానున్న రోజుల్లో మరింతమందిని పెంచుకోవాలని భావిస్తోంది. ఇది టెక్కీలకు శుభవార్త. ఇప్పటికే పలు సాఫ్టువేర్ కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తీసుకుంటున్నాయి. ఇప్పుడు మల్టీ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయిన గోల్డ్‌మాన్ శాక్స్ కూడా ఇంజినీరింగ్ హెడ్‌కౌంట్‌ను పెంచుకోవాలని భావిస్తోంది.

భారత్‌లో 110 నగరాలకు అమెజాన్ ప్యాంట్రీ సేవలుభారత్‌లో 110 నగరాలకు అమెజాన్ ప్యాంట్రీ సేవలు

విస్తరిస్తున్న కంపెనీ

విస్తరిస్తున్న కంపెనీ

తమ సంస్థ భారత్‌లో ఏటికేడు విస్తరిస్తోందని, గత అయిదేళ్లలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ 20 శాతం పెరిగాయని కంపెనీ ఇండియా హెడ్ గుంజన్ సంతాని తెలిపారు. బిజినెస్ డెవలప్‌మెంట్‌కు అనుగుణంగా తాము ఉద్యోగ నియామక ప్రక్రియలు చేపడతామన్నారు. బెంగళూరు సెంటర్ తమకు కీలకమని, ఇక్కడ ఇంజినీరింగ్ కాకుండా ఆటోమేషన్, డిజిటలైజేషన్ బిజినెస్ కూడా అందిస్తున్నామన్నారు. కంపెనీ వృద్ధి ఏటా 24 శాతం పెరుగుతోందన్నారు.

గోల్డ్‌మాన్ శాక్స్

గోల్డ్‌మాన్ శాక్స్

గోల్డ్‌మాన్ శాక్స్ న్యూయార్క్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. బెంగళూరును తమ ప్రపంచ గ్లోబల్ వర్క్ ప్లేస్‌గా మార్చే ప్లాన్‌లో భాగంగా 250 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ మొత్తంతో బెంగళూరు శివారు ప్రాంతంలో నిర్మించిన తన కొత్త కార్యాలయాన్ని గోల్డ్‌మాన్ శాక్స్ గురువారం ప్రారంభించింది. 7,300 నుంచి 9,000 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఆఫీస్. 22.5 ఎకరాల్లో ఉన్న ఈ బిల్డింగ్ ఆఫీస్ స్పేస్ 1.2 మిలియన్ చ.గజాలు. పది అంతస్తులు కలిగిన 3 భవంతులు ఉన్నాయి.

గ్లోబల్ సెంటర్

గ్లోబల్ సెంటర్

బెంగళూరులోని తమ కార్యాలయం గ్లోబల్ సెంటర్‌గా ఉండాలని భావిస్తోంది. ఇక్కడ వరల్డ్ క్లాస్ చైల్డ్ కేర్, హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ఫెసిలిటీస్, ఇండోర్ వినోద కేంద్రాలు, ఆవిష్కరణల కోసం ఇక్కడ స్పేస్ కేటాయించారు. 2014లో ఈ భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ కంపెనీకి బెంగళూరు ఇన్నోవేషన్ సెంటర్. ఇంజినీరింగ్‌లోనే కాకుండా ఆటోమేషన్, డిజిటైజేషన్ ద్వారా బిజినెస్‌ను పెంచుకుంటోంది.

English summary

టెక్కీలకు గుడ్‌న్యూస్: గోల్డ్‌మాన్ శాక్స్‌లో ఉద్యోగాలు, గ్లోబల్‌హబ్‌గా బెంగళూరు ఆఫీస్ | Goldman Sachs to increase India engineering headcount in Bengaluru

Goldman Sachs is planning to increase India engineering headcount in Bengaluru, as the multinational investment bank looks to make the country a major hub for clients globally.
Story first published: Friday, May 31, 2019, 15:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X