మనం ఇంట్లో లేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగిస్తుంటాం. అయితే అందులో ఒక్కోసారి ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు. అయితే ఏఐ వచ్చాక మొత్తం మారిపోయింది. ఇంట్లో ఏం జరిగిందనే దానిపై నిమిషాలతో సహా లెక్కలేసి చెబుతోంది. తాజాగా Bengaluru కు చెందిన ఓ టెకీ ఇంట్లో దొంగలను పట్టుకోవడానికి కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకున్నాడు. దీంతో వంటింట్లోని సీసీటీవీ ఫుటేజీ మొత్తం చూడనవసరం లేకుండానే వంట మనిషి చేసిన నిర్వాకాన్ని ఏఐ ద్వారా తెలుసుకున్నాడు.
కథలోకి వెళ్తే బెంగళూరులోని టెక్నాలజీ ప్రొఫెషనల్ పంకజ్ తన్‌వార్ తన వంట గదిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను అమర్చాడు. ఇది కేవలం వినోదానికి కాకుండా, వంటగదిలోని కార్యకలాపాలను వాస్తవంగా ట్రాక్ చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. పంకజ్ ఈ వ్యవస్థకు హాస్యంగా AI రూమ్మేట్ అని పేరు పెట్టాడు. ఈ కెమెరాను Claude Haiku 4.5 అనే ఏఐ టూల్‌కు టెకి అనుసంధానించాడు. ఈ టూల్ సీసీటీవీ ద్వారా పని మనిషి ప్రతి కదలికను విశ్లేషించి రాతపూర్వక నివేదికను యజమానికి పంపుతుంది.

పంకజ్ తన వంటర మనిషిపై అనుమానం వ్యక్తం చేసిన తర్వాత.. AI వ్యవస్థను అమర్చాడు. ఫలితంగా అతని ఫ్రిజ్‌లోని ఆపిల్, బ్లూబెర్రీ, అరటి వంటి పళ్ళు కొన్నిసార్లు దొంగిలిస్తున్నారని ఈ వ్యవస్థ వీడియో ద్వారా గుర్తించింది. AI కెమెరాలు, చాట్‌బాట్ విశ్లేషణలు ఉపయోగించి.. వంట మనిషి చేసిన ప్రతి చర్య, ఫ్రిజ్ తెరవడం, పళ్ళు తీసుకోవడం, చేతులు శుభ్రపరచడం, వంట గదిలోని ప్రవర్తనలు మొదలైన వాటిని ట్రాక్ చేసింది.
AI పర్యవేక్షణ మూడు సందర్భాల్లో వంట మనిషి పళ్ళు తీసుకోవడాన్ని నిర్ధారించింది. ఫలితంగా పంకజ్ తన్‌వార్ ఆ వంట మనిషిని ఉద్యోగం నుండి వెంటనే తొలగించారు. ఈ సంఘటన, AI వీడియోలు విశ్లేషణలతో సోషల్ మీడియాలో పంచబడింది. అయితే AI కేవలం దొంగతనాన్ని మాత్రమే పట్టలేదు. వంట మనిషి పనితీరు, వంటగది శుభ్రత, పని సమయం, అలవాట్లను కూడా మానిటర్ చేసింది.
ఏఐ ఏం చెప్పిందంటే.. వంట మనిషి చేతులు రెండు సార్లు శుభ్రపరచుకోలేదు. సాయంత్రం 7:12 గంటలకు వచ్చింది. రాగానే ఫ్రిడ్జ్ తెరిచింది. అందులో నుంచి రెండు యాపిల్స్ తీసి తన బ్యాగ్‌లో వేసుకుంది. అలాగే డస్ట్ బిన్ మూతను తాకింది. అనంతరం ముక్కు రుద్దుకుంది. ఆపై అదే చేతులతో చపాతీలు రుద్దింది. ఇక స్టవ్ వెనుక ఉన్న భాగాన్ని సోమవారం నుంచి ఆమె శుభ్రం చేయలేదని తెలిపింది.
వారానికి ఒకసారి ఆ ఏఐ పంపే రిపోర్ట్‌లో అతనికి షాకింగ్ విషయాలు తెలిసాయి. రోజుకు ఎన్ని యాపిల్స్, అరటిపండ్లు మాయమయ్యాయి. ఆమె ఎన్ని బ్లూబెర్రీలు తిన్నది. ఈ మొత్తం లెక్కలతో సహా అతని ముందు ఉంచింది ఏఐ. కాగా వంట మనిషికి రూ.4,800 జీతం ఇస్తున్నారని ఏఐ సిస్టమ్ యజమానికి గుర్తు చేసింది. ఈ నివేదికల ఆధారంగా ఆ టెక్కీ సదరు వంట మనిషిని పనిలో నుంచి తొలగించాడు.
ఈ కథను షేర్ చేసిన తర్వాత X (Twitter) లో విభిన్న అభిప్రాయాలు వచ్చాయి. కొందరు AIను ఉపయోగించి నిజమైన పరిస్థితిని గమనించడాన్ని సమర్థించారు. మరికొందరు పళ్ళ విషయంలో పెద్ద పని చేయడం అవసరం లేదని విమర్శించారు.మరొకరు రూ. 4,800 నెల వేతనం పొందే వారిని పర్యవేక్షించడానికి AI వాడడం అవసరం లేదు ఇది గొప్ప విషయం కాదని చెప్పారు.
ఈ సంఘటన వ్యక్తిగత ఇంట్లో AI పర్యవేక్షణ, ఉద్యోగి హక్కులు, గృహ సేవాదారుల గౌరవం వంటి నైతిక చర్చలకు దారి తీసింది. కొందరు నమ్మకం లేకుండా AI ఉపయోగించడం సరైనది కాదు అని అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇది మానవులపై విజ్ఞానాన్ని ఉపయోగించే కొత్త మార్గం అని భావించారు.మరికొందరు ఇంత నిశితంగా గమనిస్తే ఏ వంట మనిషీ మీ ఇంట్లో వారం కంటే ఎక్కువ ఉండదని చమత్కరించారు. ఇలాంటి టెక్నాలజీని ఏటీఎంలు, బస్సు స్టాపుల్లో వాడితే నేరాలను అరికట్టవచ్చని మరికొందరు సూచించారు.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

AI వల్లే కంపెనీ నుంచి వెళ్లిపోతున్నాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన దిగ్గజ కంపెనీల సీఈఓలు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications