For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార‌త‌దేశంలో అతి పెద్ద ఆర్థిక మోసాలు

ఆర్థిక మోసాలు భార‌త‌దేశంలో చాలా సాధార‌ణ‌మైపోయాయి. అనైతికంగా లేదా అక్ర‌మ మార్గంలో పెద్ద ఎత్తున డ‌బ్బు సంపాదించి మోసం చేయ‌డం కుంభ‌కోణం అవుతుంది. ఇందులో ప్ర‌జ‌లు న‌ష్ట‌పోతారు. ప్ర‌భుత్వాన్ని నేర‌గాళ్లు మ

|

ఆర్థిక మోసాలు భార‌త‌దేశంలో చాలా సాధార‌ణ‌మైపోయాయి. అనైతికంగా లేదా అక్ర‌మ మార్గంలో పెద్ద ఎత్తున డ‌బ్బు సంపాదించి మోసం చేయ‌డం కుంభ‌కోణం అవుతుంది. ఇందులో ప్ర‌జ‌లు న‌ష్ట‌పోతారు. ప్ర‌భుత్వాన్ని నేర‌గాళ్లు మోసం చేసి ఉండ‌వ‌చ్చు. స్టాక్ మార్కెట్‌లో చిన్న చిన్న లోపాల‌ను సాకుగా చూపి మోసం చేయ‌కుండా సెబీ ఎప్ప‌టిక‌ప్పుడు నిబంధ‌న‌ల‌ను క‌ఠిన త‌రం చేస్తూనే ఉంది. అయిన‌ప్ప‌టికీ నేర‌గాళ్లు త‌మ ప్ర‌తాపం చూపిస్తూనే ఉన్నారు. కేవ‌లం పెట్టుబ‌డుల‌కు సంబంధించే కాకుండా వివిధ మార్గాల్లో పెద్ద ఆర్థిక మోసాల‌ను ఇక్క‌డ చూద్దాం.

 1. హ‌వాలా కుంభ‌కోణం

1. హ‌వాలా కుంభ‌కోణం

దేశంలోనే ఒక సంచ‌ల‌నంగా ఉన్న స్కాండ‌ల్ ఇది. 1996లో బ‌య‌ట‌ప‌డిన ఈ కుంభ‌కోణంలో చాలా మంది బ‌డా నాయ‌కుల‌కు ప్ర‌మేయం ఉన్న‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. రాజ‌కీయ నాయ‌కులు, ఇత‌ర అధికారులు ఇందులో ప‌ట్టుబ‌డ్డారు. కాశ్మీర్‌లో హిజ్బుల్‌ తీవ్ర‌వాదుల‌కు సైతం హ‌వాలా రూపంలో డ‌బ్బులు వెళ్లాయ‌నేది ఆరోప‌ణ‌.

2. హ‌ర్ష‌ద్ మెహ‌తా స్టాక్ మార్కెట్ మోసం

2. హ‌ర్ష‌ద్ మెహ‌తా స్టాక్ మార్కెట్ మోసం

మోసాలు, కుంభ‌కోణాల గురించి మాట్లాడితే హ‌ర్ష‌ద్ మెహ‌తా గురించి మాట్లాడుకోవాల్సిందే. వ్య‌వ‌స్థ‌లో లోపాల‌ను ఆస‌రాగా చేసుకుని అత‌డు పెట్టుబ‌డిదారుల‌ను వేల‌కోట్ల రూపాయ‌ల మేర మోసం చేశాడు. హ‌ర్ష‌ద్ మెహతా అవినీతి కేసు దాదాపు రూ. 4000 కోట్ల మేర ఉంటే కేత‌న్ ప‌రేఖ్ కుంభ‌కోణం సుమారు రూ. 1000 కోట్ల మేర ఉంది. ఆ స‌మ‌యంలో మార్కెట్ ఒక్క‌సారిగా ఒడిదుడుకుల‌కు గురైన కార‌ణంగా షేరుహోల్డ‌ర్లు బాగా న‌ష్ట‌పోయారు.

3. స‌త్యం కుంభ‌కోణం

3. స‌త్యం కుంభ‌కోణం

కంపెనీ మాజీ ఛైర్మ‌న్ స‌త్యం రామ‌లింగ‌రాజు ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి త‌మ సంస్థ రెవెన్యూ గ‌ణాంకాల‌ను, లాభాల వివ‌రాల‌ను మార్చుకుంటూ వ‌స్తూ అంద‌రినీ మోస‌పుచ్చాడ‌నేది స‌త్యం కుంభ‌కోణంలో ప్ర‌ధానమైన విష‌యం. ఏప్రిల్ 9,2015 నాడు రామ‌లింగ‌రాజుతో స‌హా మ‌రో తొమ్మిది మందిపై నేరారోప‌ణ రుజువ‌య్యింది. ఏకంగా రూ. 14 వేల కోట్ల ఆర్థిక లావాదేవీల‌ను త‌ప్పుగా చూపార‌నేది ఇందులో సంచ‌లనం.టాప్ అప్ గృహ రుణం గురించి మీకు తెలియ‌ని నిజాలు

4. రూప్ భ‌న్సాలీ స్కామ్‌

4. రూప్ భ‌న్సాలీ స్కామ్‌

సీఆర్ బన్సాలి సీఆర్‌బీ పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకును స్థాపించారు. పెట్టుబ‌డిదారుల నుంచి మ్యూచువ‌ల్ ఫండ్లు, ఎఫ్‌డీలు, డిబెంచ‌ర్ల రూపంలో డ‌బ్బును సేక‌రించారు. ఊరూ పేరూ లేని కంపెనీల పేరిట డ‌బ్బు తీసుకున్నారు. దాని త‌ర్వాత అక్క‌డ నుంచి అత‌డి ఇత‌ర కంపెనీల‌కు డ‌బ్బు మ‌ళ్లించారు.

5. సుబ్ర‌తా రాయ్ స‌హారా

5. సుబ్ర‌తా రాయ్ స‌హారా

స‌హారా హౌసింగ్ బాండ్స్ పేరిట పెట్టుబ‌డిదారుల‌కు బాండ్లు ఇవ్వ‌డం ద్వారా డ‌బ్బు సేక‌రించారు. ఈ క్ర‌మంలో సెబీ నిబంధ‌న‌లు పాటించలేద‌నేది నియంత్ర‌ణ సంస్థ చెబుతున్న వాద‌న‌.

6. శార‌దా చిట్‌ఫండ్ కుంభ‌కోణం

6. శార‌దా చిట్‌ఫండ్ కుంభ‌కోణం

చిట్‌ఫండ్ సంస్థ శార‌దా గ్రూప్ చిట్టీలు క‌ట్టించుకోవ‌డం ద్వారా మోసం చేసింది. సంస్థ ఛైర్మ‌న్ సుదీప్తా సేన్ చాలా ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌ల నుంచి విప‌రీతంగా డ‌బ్బు సేక‌రించారు. ఇందులో ప‌శ్చిమ‌బెంగాల్‌, ఒడిశా రాష్ట్ర ప్ర‌జ‌లు చ‌లా మోస‌పోయారు.ప్ర‌పంచంలో10 ఐటీ దిగ్గ‌జాల్లో ఇండియా నుంచి ఇన్ఫీ, టీసీఎస్‌

7. తెల్గీ స్కామ్‌

7. తెల్గీ స్కామ్‌

అనైతికంగా డ‌బ్బు సంపాదించేందుకు విభిన్న మార్గాల‌ను ఎంచుకోవ‌డానికి ఇది స‌రైన ఉదాహ‌ర‌ణ‌. డూప్లికేట్ స్టాంప్ పేప‌ర్ల‌ను ప్రింట్ చేసి ఫోర్జ‌రీ చేయ‌డంలో అబ్దుల్ క‌రీమ్ తెల్గీ ఆరితేరి ఉన్నారు. ఈ విధంగా ముద్రించిన న‌కిలీ స్టాంప్ పేప‌ర్లు 12 రాష్ట్రాల‌కు వెళ్లాయంట‌. ఆ విధంగా రూ. 20 వేల కోట్ల ఆర్జ‌న జ‌రిగి ఉండొచ్చ‌ని అంచ‌నా. ఎంతో పెద్ద ఎత్తున ర‌క్ష‌ణ ఉండే స్టాంప్ పేప‌ర్ల కుంభ‌కోణం జ‌రిగేందుకు ప్ర‌భుత్వ శాఖ‌ల నుంచి ఎంతో కొంత ప్రోత్సాహం ఉంటుంద‌నేది చాలా మంది అంటున్న మాట‌.

 8. ఎన్ఎస్ఈఎల్ స్కామ్‌

8. ఎన్ఎస్ఈఎల్ స్కామ్‌

చాలా క‌మొడిటీల కొనుగోలు, అమ్మ‌కాల‌ను పేప‌ర్ల మీదే జ‌రిపి ఇన్వెస్ట‌ర్ల డ‌బ్బును తీసుకుని మోసం చేశారు. ఫైనాన్సియ‌ల్ టెక్నాల‌జీస్ ఇండియా లిమిటెడ్, ఎన్ఏఎఫ్ఈ ప్ర‌మోట‌ర్లుగా క‌లిగిన సంస్థ ఎన్ఎస్ఈఎల్. ఆనంద్ రాఠీ క‌మొడిటీస్‌కు చెందిన అమిత్ రాఠీ, జియోజిత్ కాంట్రేడ్‌కు చెందిన సీపీ కృష్ణ‌న్, ఇండియా ఇన్ఫోలైన్‌కు చెందిన చింత‌న్ మోడీల అవ‌క‌త‌వ‌క‌ల వ‌ల్ల ఎన్ఎస్ఈఎల్ సంస్థ ప‌త‌నం అయింద‌ని అధికారులు తెలిపారు. ఎన్ఎస్ఈఎల్ గ‌ణాంకాల ప్రకారం కొంత‌మంది బ్రోక‌ర్లు ట్రేడింగ్ వ్య‌వ‌స్థ‌ను ఓ ఆట ఆడుకున్నారు. క్ల‌యింట్ల కోడ్ల‌ను దాదాపు 3 ల‌క్ష‌ల సార్లు అన‌ధికారంగా మార్చారు. నిజానికి అత్య‌వ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్ర‌మే క్ల‌యింట్ల కోడ్ల‌ను మార్చే వీలుంది. దీన్ని ఆస‌రాగా చేసుకుని వీరు ల‌క్ష‌ల సంఖ్య‌లో త‌ప్పుడు లావాదేవీల‌ను జ‌రిపారు.

 9. కామ‌న్ వెల్త్ కుంభ‌కోణం

9. కామ‌న్ వెల్త్ కుంభ‌కోణం

దేశ చ‌రిత్ర‌లో మ‌రో అతిపెద్ద కుంభ‌కోణం కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌కు సంబంధించింది. దాదాపు రూ. 70 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఈ ఆట‌ల నిర్వ‌హ‌ణ‌కు ఖ‌ర్చు చేసి ఉంటార‌ని అంచ‌నా. నిజానికి స‌గం డ‌బ్బును మాత్ర‌మే క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు, క్రీడాకారుల కోసం వినియోగించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల ప్రాజెక్టుల‌కు సంబంధించి వివిధ ప్రాజెక్టుల‌ను సీవీసీ(కేంద్ర విజిలెన్స్ క‌మీష‌న్‌) విచారించింది. ఇందులో నిధుల వినియోగాన్ని నియంత్ర‌ణ సంస్థ‌లు బ‌య‌ట‌పెట్టాయి.

 10. బొగ్గు కుంభ‌కోణం

10. బొగ్గు కుంభ‌కోణం

యూపీఏ హయాంలో బొగ్గు గ‌నుల కేటాయింపుల‌కు సంబంధించిన కుంభ‌కోణం ఇది. దీన్ని రాజ‌కీయ నాయ‌కులు కోల్గేట్ స్కామ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ లేకుండా ఉద్దేశ‌పూర్వ‌కంగా కొన్ని సంస్థ‌ల‌కే కేటాయింపుల‌ను జ‌రిపార‌ని అప్ప‌ట్లో కాగ్ త‌ప్పు ప‌ట్టింది.రేషన్, పాన్,ఆధార్ కార్డు పోయిందా?: మళ్లీ పొందడం ఎలా?

 11. 2జీ స్పెక్ట్ర‌మ్ కుంభ‌కోణం

11. 2జీ స్పెక్ట్ర‌మ్ కుంభ‌కోణం

టెలికాం రంగంలో జ‌రిగిన అతిపెద్ద రాజకీయ కుంభ‌కోణం 2జీ స్పెక్ట్రం కేటాయింపు. దీని ద్వారా టెలికాం కంపెనీలు అనుచిత ల‌బ్ది పొందాయ‌ని కాగ్ బ‌య‌ట‌పెట్టింది. కాగ్ వాద‌న ప్ర‌కారం అప్ప‌టి టెలికాం మంత్రి ఏ రాజా చాలా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారు.ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కంలో స‌బ్సిడీ రుణం కోసం ద‌ర‌ఖాస్తు ఎలా?

Read more about: coal scam chit fund scam fraud
English summary

భార‌త‌దేశంలో అతి పెద్ద ఆర్థిక మోసాలు | 10 Big financial scams in India

Financial Scams have not been uncommon in India. A scam is a means of getting money by deception or in an illicit way with a fake identity or documents, India, has now and then seen many scams in the financial world which has shaken Dalal Street.The Securities Exchange Board of India has been reviving rules and regulation in a aim to plug the loop holes in the securities market.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X