పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పసిడి ప్రియుల కొంపలు ముంచుతున్నాయి. ఇరాన్ పై అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ చేసిన దాడులతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులతో విరుచుకుపడింది. అయితే ఈ దాడులతో అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు అలర్ట్ అయ్యారు. పెట్టుబడునులను రిస్క్ ఆస్తుల నుంచి సేఫ్ హెవెన్ ఆస్తుల వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారం వారికి మంచి రక్షణ కవచంలా మారింది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం మీదకు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు.

అమెరికా- ఇజ్రాయెల్ ఇరాన్‌పై సైనిక ఒత్తిడిని పెంచుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర తరం అయ్యాయి. దీనికి తోడు టెహ్రాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడం గ్లోబల్ మార్కెట్లలో మరింత ఆందోళన నెలకొంది. ఈ పరిణామాల ప్రభావంతో పెట్టుబడిదారుల మనస్తత్వం పూర్తిగా రిస్క్-ఆఫ్ మోడ్ కు మారింది. ఫలితంగా ఈక్విటీల నుంచి నిధులు బయటకు వచ్చి, బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మళ్లుతున్నాయి.

gold prices today silver prices today gold silver price crash gold price fall forecast silver price fall forecast gold silver correction precious metals outlook gold silver volatility US Iran war impact Middle East conflict impact geopolitical tensions market impact safe haven assets gold silver investment risk commodity market volatility gold price prediction silver price prediction gold silver downside risk expert warning on gold prices gold silver market news bullion market update

ఫిబ్రవరి నెలలో ఎక్కువ కాలం స్థిరంగా కదలని బంగారం, వెండి ధరలు తాజాగా యుద్ధ భయాల కారణంగా వేగంగా పెరిగాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న అనిశ్చితి, దీర్ఘకాలిక ప్రాంతీయ యుద్ధం జరిగే అవకాశం ఉన్నదన్న ఆందోళనలు ఈ లోహాలపై డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా బంగారం, వెండి ధరలు బహుళ వారాల గరిష్ట స్థాయిలను తాకాయి.

సోమవారం అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు కీలకమైన స్థాయిని దాటి లాభాలు నమోదు చేశాయి. తరువాత కొంత లాభాల స్వీకరణ కనిపించినప్పటికీ, స్పాట్ Gold ధరలు రోజంతా లాభాల్లోనే ముగిశాయి. దేశీయంగా చూస్తే, MCXలో బంగారం ధరలు చారిత్రక గరిష్ట స్థాయిలకు చేరి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. వెండి ధరలు కూడా ఇదే ధోరణిని అనుసరిస్తూ, అంతర్జాతీయంగా నాలుగు వారాల గరిష్టాల వద్ద ట్రేడయ్యాయి.

అయితే, ఇప్పుడు మార్కెట్లను వెంటాడుతున్న ప్రధాన ప్రశ్న ఒకటే. అది ఏంటంటే.. ఈ పెరుగుదల తాత్కాలికమా లేక దీర్ఘకాలిక దిశ మార్పుకి సంకేతమా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధానికి స్పష్టమైన కాలపరిమితి లేదని పేర్కొనగా.. రక్షణ శాఖ మాత్రం దీన్ని అంతులేని యుద్ధంగా మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో అమెరికా నుంచి ఇంకా తీవ్ర దాడులు రావచ్చని ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యలు మార్కెట్ అనిశ్చితిని కొనసాగిస్తున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భౌగోళిక రాజకీయ ప్రమాదాలు కొనసాగినంతకాలం బులియన్ ధరలు బలంగా ఉండే అవకాశం ఉంది. అయితే దౌత్యపరమైన పరిష్కారానికి దారి తీసే సంకేతాలు కనిపిస్తే, లాభాల బుకింగ్ ప్రారంభమై తాత్కాలిక దిద్దుబాటు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంలో బంగారం ధరలు 3-5 శాతం వరకు, వెండి ధరలు దాని అధిక అస్థిరత కారణంగా 5-8 శాతం వరకు పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే, ఈ యుద్ధమే బంగారం, వెండి ర్యాలీకి ఏకైక కారణం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డీ-డాలరైజేషన్ ధోరణులు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఆర్థిక విస్తరణ, అలాగే కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ విభేదాలు వంటి బలమైన అంతర్లీన అంశాలు బులియన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. యుద్ధం ఈ ధోరణులను వేగవంతం చేసే ఒక ఉత్ప్రేరకంగా మాత్రమే పనిచేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.

రిస్క్-ఆఫ్ సెంటిమెంట్ కారణంగా పెట్టుబడిదారులు ఈక్విటీల నుంచి విలువైన లోహాల వైపు మళ్లడం వల్లే ఇటీవలి ర్యాలీకి బలమైన మద్దతు లభించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బలమైన అమెరికా డాలర్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతల అంచనాలు తగ్గినప్పటికీ, సురక్షిత పెట్టుబడులపై ఉన్న డిమాండ్ ఈ ప్రతికూల అంశాలను మించిపోయింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+