ప్ర‌పంచంలో10 ఐటీ దిగ్గ‌జాల్లో ఇండియా నుంచి ఇన్ఫీ, టీసీఎస్‌

నేడు ప్రపంచంలోని దాదాపు అన్ని వ్యాపారాల‌ను ఐటీ రంగం(సాఫ్ట్‌వేర్‌) శాసిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దేశంలో ఉపాధి క‌ల్పిస్తున్న రంగాల్లో ఐటీ కంపెనీలు చెప్పుకోద‌గ్గ పురోగతి సాధించాయి. అందుకే మ‌న తెలుగు రాష్

నేడు ప్రపంచంలోని దాదాపు అన్ని వ్యాపారాల‌ను ఐటీ రంగం(సాఫ్ట్‌వేర్‌) శాసిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దేశంలో ఉపాధి క‌ల్పిస్తున్న రంగాల్లో ఐటీ కంపెనీలు చెప్పుకోద‌గ్గ పురోగతి సాధించాయి. అందుకే మ‌న తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఐటీ కంపెనీల‌పై అంత మోజు పెంచుకున్నారు. ఈకంపెనీలు వృత్తి నిపుణుల ద్వారా వేల కోట్లు గ‌డిస్తుంటే, యువ‌త‌కేమో ఉపాధి దొరుకుతోంది. కంపెనీల ఆదాయ‌, లాభాల ఆధారంగా ప్ర‌పంచంలో టాప్ 10 ఐటీ కంపెనీల జాబితాను రూపొందించింది ఓ సంస్థ‌. ఈ జాబితాలో మ‌న భార‌తీయ కంపెనీలైన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌లు ఉండ‌డం జాతి గ‌ర్వించ‌ద‌గ్గ అంశం.
ఈ ఐటీ సంస్థ‌లు టాప్ 10 జాబితాలోకి చేర‌డానికి అంచెలంచెలుగా ఎలా ఎదిగాయో తెలుసుకుందాం. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న‌వారికి ఈ క‌థ‌నం చాలా ఆస‌క్తిదాయకం అని అనుకుంటున్నాం.

10. ఇన్ఫోసిస్‌

10. ఇన్ఫోసిస్‌

ప్ర‌పంచ ఉత్త‌మ 10 ఐటీ కంపెనీల్లో భార‌త్ నుంచి స్థానం ద‌క్కించుకున్న రెండు సంస్థ‌ల్లో ఇన్ఫోసిస్ ఒక‌టి. భార‌త్‌లో సేవ‌ల‌ను ప్రారంభించిన ఈ సంస్థ‌ దేశ‌విదేశాల్లో స్థిర‌మైన స్థానం పొంది వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎన్‌.ఆర్. నారాయ‌ణ‌మూర్తి, మ‌రో ఆరు మంది ఇంజ‌నీర్లు క‌లిసి పుణెలో కేవ‌లం 250 డాలర్ల పెట్టుబ‌డితో దీన్ని ప్రారంభించారు. 6ఏళ్ల త‌ర్వాత అమెరికాలోని బోస్ట‌న్‌లో తొలి అంత‌ర్జాతీయ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచి అంచెలంచెలుగా సంస్థ‌ ఎదుగుతూ వ‌చ్చింది.

ఇన్ఫోసిస్

ఇన్ఫోసిస్

'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా' పేరు తెచ్చుకున్న బెంగ‌ళూరులో సంస్థ‌ ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. 2016లో ఏకంగా 10 బిలియ‌న్ డాల‌ర్ల రెవెన్యూ ఆర్జించే సంస్థ‌గా ఎదిగింది. 'న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో' గ్లోబ‌ల్ క‌న్స‌ల్టింగ్ అండ్ ఐటీ సేవ‌ల సంస్థ‌గా లిస్ట్ అయ్యింది. ప్ర‌స్తుతం 2ల‌క్ష‌ల మంది ఈ సంస్థ కోసం ప‌నిచేస్తున్నారు. సృజ‌నాత్మ‌క‌త‌కు, ఆటోమేష‌న్‌కు సంస్థ‌లో ఎప్పుడూ తొలి ప్రాధాన్య‌ముంటుంది. ఇందుకోసం కొత్త‌గా 'ఇన్ఫోసిస్ మ‌న' అనే

ప్ర‌పంచ ఉత్త‌మ 10 ఐటీ కంపెనీల్లో భార‌త్ నుంచి స్థానం ద‌క్కించుకున్న రెండు సంస్థ‌ల్లో ఇన్ఫోసిస్ ఒక‌టి. భార‌త్‌లో సేవ‌ల‌ను ప్రారంభించిన ఈ సంస్థ‌ దేశ‌విదేశాల్లో స్థిర‌మైన స్థానం పొంది వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎన్‌.ఆర్. నారాయ‌ణ‌మూర్తి, మ‌రో ఆరు మంది ఇంజ‌నీర్లు క‌లిసి పుణెలో కేవ‌లం 250 డాలర్ల పెట్టుబ‌డితో దీన్ని ప్రారంభించారు. 6ఏళ్ల త‌ర్వాత అమెరికాలోని బోస్ట‌న్‌లో తొలి అంత‌ర్జాతీయ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచి అంచెలంచెలుగా సంస్థ‌ ఎదుగుతూ వ‌చ్చింది.

9. క్యాప్‌జెమిని

9. క్యాప్‌జెమిని

క్యాప్‌జెమిని యూర‌ప్‌న‌కు చెందిన ఐటీ క‌న్స‌ల్‌టెన్సీ సంస్థ‌. ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్‌లో ప్ర‌ధాన కార్య‌ల‌యం. 1967లో సెర్జ్ క్యామ్ఫ్ ఈ సంస్థ‌ను స్థాపించారు. 45 దేశాల్లో ఈ సంస్థ త‌న సేవ‌ల‌ను అందిస్తోంది. దాదాపు 2 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ఇందులో ప‌నిచేస్తున్నారు. ప్రారంభించిన నాటి నుంచి 25 చిన్నా చిత‌కా కంపెనీల‌ను త‌న‌లో క‌లుపుకొని వేగంగా అభివృద్ధి చెందుతోంది.

విద్యుత్‌, ఇంధ‌న‌, మౌలిక‌, రసాయ‌న‌, ఉత్ప‌త్తి, రిటైల్‌, పంపిణీ, ఆర్థిక‌, బీమా, జీవ శాస్త్ర విభాగాల్లో సంస్థ‌ విస్తృత సేవ‌ల‌ను అందిస్తుంది.

 క్యాప్‌జెమిని

క్యాప్‌జెమిని

భార‌త్‌లో ఉన్న అపార మేథో వ‌న‌రుల‌ను గుర్తించి ఇక్క‌డ సంస్థ త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేందుకు ఆస‌క్తి చూపించింది. దాదాపు ల‌క్ష‌కు పైగా ఇక్క‌డివారి నైపుణ్యాల‌ను మెరుగుప‌ర్చి సంస్థ‌లో భాగం చేసుకున్నారు. దీంతో కంపెనీకి ఆసియాలో పెద్ద మార్కెట్ ఏర్ప‌డిన‌ట్ట‌య్యింది.

యాప్‌ల అభివృద్ధి, వ్యాపార సేవ‌లు, క‌న్స‌ల్టింగ్‌, మౌలిక వ‌స‌తుల నిర్వ‌హ‌ణ‌, మొబిలిటీ, క్లౌడ్ లాంటి వివిధ ఐటీ సేవ‌ల‌ను సంస్థ అందిస్తుంది.

ఆదాయం : 13312 మిలియ‌న్ డాల‌ర్లు

లాభం : 977 మిలియ‌న్ డాల‌ర్లు

8.కాగ్నిజెంట్‌

8.కాగ్నిజెంట్‌

1996లో డ‌న్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ అనే సంస్థ‌కు ఓ టెక్నిక‌ల్ యూనిట్‌గా ప్రారంభ‌మైంది. అప్ప‌ట్లో చెన్నైలో కుమార్ మ‌హ‌దేవ అనే వ్య‌క్తి దీన్ని ప్రారంభించారు.

ఆ త‌ర్వాత ఏమైందో తెలీదు .. డ‌న్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ సంస్థ అనుబంధ సంస్థ‌ల‌ను వ‌దిలేసుకొని అమెరికాలోని న్యూజెర్సీలో కాగ్నిజెంట్ అనే పేరుతో తిరిగి ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచి ఇత‌ర క్ల‌యింట్ల‌కు సేవ‌ల‌ను అందించ‌డం ప్రారంభించింది. 2000 ద‌శ‌కంలో సంస్థ‌ వేగంగా అభివృద్ధి చెందింది. 2011లో ఫార్చున్ 500 సంస్థ‌ల్లో స్థానం సంపాదించుకుంది. ప్ర‌పంచంలో ఎక్కువ ప్ర‌శంస‌లు పొందిన ఐటీ సంస్థ‌గా పేరుతెచ్చుకుంది.

ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, సెక్యూరిటీ, క‌న్స‌ల్టింగ్‌, ఐటీ, బీపీవో సేవ‌ల‌ను ప్ర‌ధానంగా అందిస్తుంది. దీంతోపాటు బిజినెస్ అండ్ టెక్నాల‌జీ క‌న్స‌ల్టింగ్‌, సిస్ట‌మ్స్ ఇంటిగ్రేష‌న్‌, అప్లికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ మెయిన్‌టెనెన్స్‌, ఐటీ ఇన్‌ఫ్రా సేవ‌లు, అన‌లిటిక్స్ త‌దిత‌ర విభాగాల్లోనూ సంస్థ‌ సేవ‌లు అమోఘం.

కాగ్నిజెంట్‌

కాగ్నిజెంట్‌

సంస్థ ప్రారంభించిన తొలి నాళ్ల‌లో రెండు ముఖ్య‌మైన సేవ‌ల విభాగాల‌ను నడిపించేది. 'నెల్స‌న్ మీడియా రీసెర్చ్' ఒక‌టి. మ‌రొక‌టి 'ఐఎమ్ఎస్ హెల్త్‌'. అయితే ఆ త‌ర్వాత ఐఎమ్ఎస్ హెల్త్ ప్ర‌భుత్వ అధీనంలోనికి వెళ్లిపోయింది. 2003లో కాగ్నిజెంట్ త‌న అనుబంధ సంస్థ‌లోని అన్ని షేర్ల‌ను విక్ర‌యించేసింది. ఐటీ నుంచి క్ర‌మంగా ఔట్‌సోర్సింగ్‌, బిజినెస్ క‌న్స‌ల్టింగ్‌లోనూ త‌న‌ సేవ‌ల‌ను విస్తృత‌ప‌రిచింది. సంస్థ అన‌తికాలంలోనే వేగంగా అభివృద్ధి చెందుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే త‌న అమెరికా క్ల‌యింట్ల‌ను పెంచుకుంటూ వ‌చ్చి చాలా విభాగాల్లో త‌న సేవ‌ల‌ను విస్త‌రించింది. ఇప్పుడు సంస్థ‌లో సుమారు 1.5ల‌క్ష‌ల ఉద్యోగులున్నారు. వీళ్లంతా దేశ‌విదేశాల్లో ప‌నిచేస్తూ సంస్థ‌కు 2017లో 13,487 మిలియ‌న్ డాల‌ర్ల ఆదాయాన్ని స‌మ‌కూర్చారు. 2017లో టాప్ 10 ఐటీ కంపెనీలో సంస్థ‌కు 8వ స్థానం ద‌క్క‌డం విశేషం.

ఆదాయం: 13487 మిలియ‌న్ డాల‌ర్లు

లాభం : 1553 మిలియ‌న్ డాల‌ర్లు

7. టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్‌

7. టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్‌

టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్‌) భార‌త్‌కు చెందిన బ‌హుళ జాతి సంస్థ‌(మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీ). ప్ర‌ధానంగా ఐటీ, వ్యాపార సేవ‌ల‌ను అందిస్తుంది. టాటా గ్రూప్‌లో టీసీఎస్‌ ఒక అనుబంధ సంస్థ‌.

1968లో జే.ఆర్‌.డి. టాటా, ఎఫ్‌.సి.కోహ్లిలు క‌లిసి ముంబ‌యిలో ఈ సంస్థ‌ను ప్రారంభించారు. 1995లో స్వ‌తంత్ర సంస్థ‌గా మారింది. టాటా అతి పెద్ద గ్రూప్ సంస్థ‌ కాబ‌ట్టి ఎదిగేందుకు అట్టే స‌మ‌యం తీసుకోలేదు. 46 దేశాల్లో సంస్థ‌కు క్ల‌యింట్లు ఉన్నాయి. ప్ర‌పంచంలోని 4 అధిక విలువున్న ఐటీ సంస్థ‌ల్లో ఇదీ ఒక‌టి.

భార‌త్‌లో ఇ-గ‌వ‌ర్నెన్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవ‌లు, టెలిక‌మ్యూనికేష‌న్స్‌, విద్య‌, ఆరోగ్య సంబంధిత విభాగాల్లో ఐటీ సేవ‌ల‌ను అందించ‌డంలో పేరెన్నిక‌గ‌న్న‌ది. ఇటీవ‌ల అధిక లాభాల‌ను ఇచ్చే భార‌తీయ కంపెనీల్లో రిల‌య‌న్స్‌ను దాటేసింది. భార‌త్‌కు చెందిన ప్ర‌భుత్వ వెబ్‌సైట్లలో ముఖ్యంగా ఐఆర్‌సీటీసీ, పాస్‌పోర్ట్ సేవా కేంద్ర‌ల‌ను ఈ సంస్థే చూసుకుంటుంది.

టీసీఎస్‌

టీసీఎస్‌

తొలుత ఎల‌క్ట్రానిక్ డిపాజిట‌రీ, ట్రేడింగ్ సిస్ట‌మ్ ప్రొవైడ‌ర్‌గా ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత 1975లో సాఫ్ట్‌వేర్ ప‌రిశోధ‌నాభివృద్ధిలో తొలి SECOMను రూపొందించింది. ఆ త‌ర్వాత ERP సిస్ట‌మ్స్‌ను అభివృద్ధి ప‌రిచి దాన్ని భార‌తీయ రైల్వేల‌కు త‌గ్గ‌ట్టుగా మ‌లిచింది.

బ‌యోఇన్‌ఫ‌ర్‌మెటిక్స్‌లో ప్ర‌వేశించిన తొలి ఐటీ సంస్థ ఇదే కావ‌డం విశేషం. ఫార్మా, బ‌యోమెడిక‌ల్‌, బ‌యోటెక్నాల‌జీ కంపెనీల‌కు సాఫ్ట్‌వేర్ రూపొందించే ప‌నిని చేప‌ట్టింది. వివిధ బ‌యోటెక్ సంస్థ‌లు చేప‌ట్టే జీనోమిక్స్‌, ప్రొటియోమిక్స్ ప‌రిశోధ‌న‌ల‌కు సాంకేతిక సహాయం అందించే దిశ‌గా అభివృద్ధి చెందింది. దాదాపు 67 అనుబంధ సంస్థ‌ల‌తో అత్యంత లాభ‌దాయ‌క‌మైన ఐటీ సంస్థ‌గా ఎదిగింది.

ఆదాయం: 17330 మిలియ‌న్ డాల‌ర్లు

లాభం: 4003 మిలియ‌న్ డాల‌ర్లు

6. శ్యాప్‌

6. శ్యాప్‌

ఎంట‌ర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్‌(ఈఆర్‌పీ)ని రూపొందించే అతిపెద్ద సంస్థ‌ల్లో శ్యాప్ ఒక‌టి. జ‌ర్మ‌నీకి చెందిన ఈ బ‌హుళ జాతి సంస్థ ప్ర‌ధానంగా డేటా ప్రాసెసింగ్ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌ర్తిస్తుంది.

సిస్ట‌మ్స్‌, అప్లికేష‌న్స్‌, ప్రొడ‌క్ట్స్‌కు సంక్షిప్త నామ‌మే శ్యాప్‌. 1972లో స్థాపిత‌మైన ఈ కంపెనీ ప్ర‌స్తుతం దాదాపు 3ల‌క్ష‌ల మంది వినియోగ‌దారుల‌కు సేవ‌ల‌ను అందిస్తుంది. 180దేశాల్లో త‌న సేవ‌ల‌ను విస్తృత ప‌రిచింది. ఈ సంస్థ సేవ‌లందుకుంటున్న వాటిలో ఎక్కువ‌గా చిన్న‌, మ‌ధ్య‌స్థాయివే ఉన్నాయి.

శ్యాప్ రియ‌ల్ టైమ్ సాఫ్ట్‌వేర్ సిస్ట‌మ్స్‌ను అందిస్తుంది. ఈఆర్‌పీ సిరీస్ సాఫ్ట్‌వేర్‌ల రూప‌క‌ల్ప‌న చేస్తుంది. తాజాగా ఈఆర్‌సీ 6.0 ను రూపొందించింది. శ్యాప్‌ సిస్ట‌మ్స్ ఒక ఇంటిగ్రేటెడ్ వ్య‌వ‌స్థ‌లో ప‌నిచేస్తాయి. డేటాను ఎంట‌ర్ చేసే అవ‌సరం లేకుండా ఒక దాన్నుంచి ఇంకో దానికి చేరేలా ప్రాసెస్ రూప‌క‌ల్ప‌న ఉంటుంది.

ఇప్పుడు 75శాతం ప్ర‌పంచ వ్యాపారాలు శ్యాప్ సిస్ట‌మ్‌నే అనుస‌రిస్తున్నాయి. 2016లో రూపొందించిన అతి పెద్ద సాఫ్ట్ వేర్, ప్రోగ్రామింగ్ కంపెనీల జాబితాలో శ్యాప్‌కు మూడో స్థానం ల‌భించింది. తొలి రెండు స్థానాల్లో మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌లు ఉన్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌లోనూ సంస్థ దృష్టిపెట్టింది. చిన్న చిత‌కా క్లౌడ్ ఉత్ప‌త్తుల‌ను సొంతం చేసుకుంది.

ఆదాయం: 22062 మిలియ‌న్ డాల‌ర్లు

లాభం : 3634 మిలియ‌న్ డాల‌ర్లు

5. అసెంచ‌ర్‌

5. అసెంచ‌ర్‌

ఈ ఏడాది జాబితాలో 5వ స్థానాన్ని అసెంచ‌ర్ ఆక్రమించుకుంది. ఆండ‌ర్‌స‌న్ క‌న్స‌ల్టింగ్ సంస్థ‌గా 1989లో స్థాపిత‌మైంది. ఐర్లాండ్‌లోని డ‌బ్లిన్ ప్ర‌ధాన కార్యాల‌యం. టెక్ సేవ‌ల‌ను అందించే ఈ సంస్థ 120 దేశాల్లో వ్యాప్తిచెందింది. ఎక్కువ మంది ఉద్యోగులు భార‌త్‌కు చెందిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. తొలుత అండ‌ర్‌స‌న్ క‌న్స‌ల్టింగ్‌కు బిజినెస్ క‌న్స‌ల్టింగ్ డివిజన్‌గా ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత 2001లో మాతృ సంస్థ నుంచి విడిపోయి అసెంచ‌ర్ పేరుతో సొంత‌గా కార్య‌క‌లాపాలు ప్రారంభించింది. అసెంచ‌ర్ స్ట్రాటెజీ, అసెంచ‌ర్ క‌న్స‌ల్టింగ్‌, అసెంచ‌ర్ డిజిట‌ల్ లాంటి వివిధ పేర్ల‌తో సేవ‌ల‌ను, కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తుంది.

అసెంచ‌ర్

అసెంచ‌ర్

అసెంచ‌ర్ స్ట్రాటెజీ బిజినెస్ సొల్యూష‌న్స్‌, టెక్ స‌పోర్ట్‌, ఆప‌రేష‌న్స్ స్ట్రాటెజీ సేవ‌ల‌ను అందిస్తుండ‌గా... అసెంచ‌ర్ డిజిట‌ల్ మాత్రం డిజిట‌ల్ మార్కెటింగ్‌, మొబిలిటీ సేవ‌ల‌కు త‌న సేవ‌ల‌ను ప‌రిమితం చేసుకుంది.

అవ‌నాడ్ అనేది దీని అనుబంధ సంస్థ‌. ఇది ఐటీ క‌న్స‌ల్టెన్సీ సేవ‌ల‌ను అందిస్తుంది. ప్ర‌ధానంగా మైక్రోసాఫ్ట్ ప్లాట్‌ఫార‌మ్‌పైన దృష్టి పెడుతుంది.

డిజిట‌ల్‌, క్లౌడ్‌, భ‌ద్ర‌తాప‌ర‌మైన సేవ‌ల‌ను సంస్థ‌ అందిస్తుండ‌గా 40శాతం ఆదాయం వీటి నుంచే వస్తుంది.

అతిపెద్ద, అత్యంత వేగంగా డిజిట‌ల్ మార్కెటింగ్ సేవ‌ల‌ను అందిస్తున్న అసెంచ‌ర్ ఇంట‌రాక్టివ్ బీఎమ్‌డ‌బ్ల్యూ, ఇంజీ లాంటి పెద్ద సంస్థ‌లు దీనికి క్ల‌యింట్లు.

అసెంచ‌ర్ మొబిలిటీ ఎన్నో మొబైల్ అప్లికేష‌న్ల‌ను అభివృద్ధి చేస్తుంది. దాదాపు 2800 యాప్‌ల‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, విండోస్ ప్లాట్‌ఫారంల‌లో విడుద‌ల చేసింది.

ఆదాయం: 32883 మిలియ‌న్ డాల‌ర్లు

లాభం: 4350 మిలియ‌న్ డాల‌ర్లు

4. ఒరాకిల్‌

4. ఒరాకిల్‌

డేటాబేస్ సాప్ట్‌వేర్‌ల రూప‌క‌ల్ప‌న‌కు పెట్టింది పేరు 'ఒరాకిల్‌'. కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్‌లో దీని ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. 1977లో 'సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ల్యాబొరేట‌రీస్' పేరుతో సంస్థ‌ను స్థాపించారు. అప్ప‌ట్లో వాణిజ్య అవ‌స‌రాల‌కు డేటాబేస్ సేవ‌ల‌ను అందుబాటులోనికి తీసుకొచ్చింది ఈ సంస్థే కావ‌డం విశేషం. రిలేష‌న‌ల్ డేటా బేస్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌(ఆర్‌డీబీఎమ్ఎస్‌) తొలి వాణిజ్య డేటాబేస్‌. ఆ త‌ర్వాత దాన్ని 'ఒరాకిల్ డేటాబేస్‌'గా పేరు మార్చారు. అప్ప‌టి నుంచి సంస్థ పేరు కూడా 'ఒరాకిల్'గా ప్ర‌సిద్ధి చెందింది.

ఒరాకిల్ డేటాబేస్ చాలా ప్ర‌ముఖ‌మైన‌ది. ఐబీఎమ్ సంస్థ‌కు చెందిన 'డీబీ2'తో గ‌ట్టి పోటీనిస్తుంది. గ‌త కొన్నేళ్లుగా ఒరాకిల్ డేటా బేస్‌ల‌లో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల‌ను తీసుకొచ్చింది. ఒరాకిల్ ఆధారిత యూనిక్స్ అప్లికేష‌న్‌తో పాటు PQ/ SQL లాంగ్వేజ్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఘ‌న‌త సంస్థ‌దే. ఇటీవ‌ల ఒరాకిల్ 12c ని విడుద‌ల చేసింది. C క్లౌడ్ కంప్యూటింగ్‌ను సూచిస్తుంది. క్లౌడ్ సేవ‌లుగా డేటాబేస్‌ల నిర్వ‌హ‌ణ‌ను స‌మీకృతం చేసేందుకు ఒరాకిల్ కృషిని కొనియాడ‌వ‌చ్చు.

ఒరాకిల్

ఒరాకిల్

ఒరాకిల్ 'ఫ్యూజ‌న్ మిడిల్ వేర్' ఉత్ప‌త్తి ని తీసుకొచ్చింది. దీంతో అప్లికేష‌న్ స‌ర్వ‌ర్‌, సిస్ట‌మ్ ఇంటిగ్రేష‌న్ చేప‌ట్ట‌వ‌చ్చు. ఒరాకిల్ 'ఇ-బిజినెస్ సూట్‌'లో ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. దీంతో ఈఆర్‌పీ సంబంధిత ప‌నిని చేప‌ట్ట‌వ‌చ్చు. ఆర్థిక‌, ఉత్పాద‌క‌త‌, వినియోగ‌దారుల అనుబంధ నిర్వ‌హ‌ణ‌, హెచ్ఆర్ మేనేజ్‌మెంట్ త‌దిత‌ర వాటిలో సాఫ్ట్‌వేర్ స‌హాయాన్ని తీసుకోవ‌చ్చు.

ఆదాయం: 37047 మిలియ‌న్ డాల‌ర్లు

లాభం: 8901 మిలియ‌న్ డాల‌ర్లు

Tending articles in Telugu Goodreturns

 3. హెచ్‌పీ ఎంట‌ర్‌ప్రైజ్‌

3. హెచ్‌పీ ఎంట‌ర్‌ప్రైజ్‌

ఆదాయ‌, లాభాల‌ప‌రంగా టాప్ 10 జాబితాలో హెచ్‌పీఈ మూడో స్థానం ద‌క్కించుకుంది. హెచ్‌పీఈ లేదా హెవ్లెట్ పెకార్డ్ ఎంట‌ర్‌ప్రైజ్ సంస్థ అన్నింటిలోకెల్లా చాలా కొత్త‌ది. 2015లో హెచ్‌పీతో విడిపోయి ఈ సంస్థ అవ‌త‌రించింది. అమెరికాకు చెందిన బ‌హుళజాతి ఐటీ సంస్థ‌. దీని ప్ర‌ధాన కార్యాల‌యం కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో ఉంది.

స‌ర్వ‌ర్లు, నెట్‌వ‌ర్కింగ్‌, సాఫ్ట్‌వేర్ సేవ‌ల‌ను హెచ్‌పీఈ ప్ర‌ధానంగా అందిస్తుంటుంది. 2008లో హెచ్‌పీ... ఎల‌క్ట్రానిక్ డేటా సిస్ట‌మ్స్ అనే ఒక ఐటీ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఆ త‌ర్వాత ఆ కంపెనీని సొంతం చేసుకొని హెచ్‌పీ బిజినెస్ యూనిట్‌గా అవ‌త‌రించింది. ఆ త‌ర్వాతే హెచ్‌పీఈగా పేరు మార్పుతో సంస్థ నుంచి విడిపోయింది.

 హెచ్‌పీఈ

హెచ్‌పీఈ

2009 నాటికే దాదాపు 60 దేశాల్లో 2వేల క్ల‌యింట్ల‌కు సంబంధించిన 3,80,000 స‌ర్వ‌ర్లను హెచ్‌పీఈ నిర్వ‌హించేది.

2015లో హెచ్‌పీ నుంచి విడిపోయి స్వ‌తంత్ర మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీగా ప‌ని ప్రారంభించింది. హెచ్‌పీఈ ఇప్పుడు అప్లికేష‌న్ సాఫ్ట్‌వేర్‌ల అభివృద్ధి, ఇంటిగ్రేష‌న్‌, ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను చేప‌డుతుంది. అది కాకుండా మౌలిక ప‌ర టెక్నాల‌జీ ఔట్‌సోర్సింగ్‌.. ఇంకా అప్లికేష‌న్స్ అండ్ బ‌జినెస్ స‌ర్వీసెస్‌(ఏబీఎస్‌) ల‌ను అందిస్తుంది. అరుబా అనే నెట్‌వ‌ర్కింగ్ ఎంట‌ర్‌ప్రైజ్ హెచ్‌పీఈ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేస్తుంది. హిటాచీతో క‌లిసి హెచ్‌పీఈ ఎక్స్‌పీ అనే కొత్త కంప్యూట‌ర్ డేటా స్టోరేజీ అరే ని కూడా ప్రారంభించింది.

ఆదాయం : 50123 మిలియ‌న్ డాల‌ర్లు

లాభం: 3161 మిలియ‌న్ డాల‌ర్లు

2. మైక్రోసాఫ్ట్‌

2. మైక్రోసాఫ్ట్‌

కంప్యూట‌ర్ టెక్నాల‌జీ విభాగంలో సంచ‌ల‌నం మైక్రోసాఫ్ట్‌. అతి పెద్ద సాఫ్ట్‌వేర్ రూప‌క‌ర్త‌గా ప్ర‌పంచంలో పేరుతెచ్చుకుంది. మైక్రోకంప్యూట‌ర్‌, సాఫ్ట్‌వేర్ అనే రెండు మాట‌ల్లోని తొలి ప‌దాల‌ను క‌లిపి మైక్రోసాఫ్ట్ అని నామ‌క‌ర‌ణం చేశారు.

విండోస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్ ద‌గ్గ‌ర నుంచి స‌ర్ఫేస్ టాబ్లెట్ల దాకా మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్ కు సంబంధించిన ప్ర‌తి విభాగంలోనూ త‌న‌దైన ముద్ర వేసుకుంది. 1975లో పాల్ అలెన్‌, బిల్ గేట్స్ క‌లిసి సంయుక్తంగా ఈ సంస్థ‌ను నెల‌కొల్పారు. ప్ర‌ధాన కార్యాల‌యం వాషింగ్ట‌న్‌లోని రెడ్‌మండ్‌లో ఉంది. ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల రూప‌క‌ల్ప‌న‌లో మైక్రోసాఫ్ట్‌కు సుదీర్ఘ చ‌రిత్ర ఉంది. డాస్ అనే ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ రూపొందించింది మైక్రోసాఫ్ట్‌. దీన్ని ఐబీఎమ్ కంప్యూట‌ర్లో వాడేవారు.

మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఉత్ప‌త్తుల్లో ఎంఎస్ ఆఫీస్ దాదాపు అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఇది కాకుండా స‌ర్వ‌ర్లు, డిజిట‌ల్ సేవ‌ల మార్కెట్‌, మొబైల్ ఫోన్ల‌లో విండోస్ ఓఎస్ లాంటివెన్నో ఈ సంస్థ రూపొందించింది.

ఐబీఎమ్‌కు ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ త‌యారు చేయ‌డంలో స‌హ‌క‌రిస్తూనే మైక్రోసాఫ్ట్ సంస్థ త‌న సొంత ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అయిన మైక్రోసాఫ్ట్ విండోస్ ను అభివృద్ధి చేసుకుంది. ఇది ఎంత ప్రాచుర్యం పొందిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

తాజా విండోస్ 10 వెర్ష‌న్‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా 400 మిలియ‌న్ డివైజ్‌ల‌లో ఇన్‌స్టాల్ చేసి వాడుతున్నారు. అత్యంత వేగంగా ఇలా ఒక సాఫ్ట్‌వేర్ వెర్ష‌న్ తీసుకోవ‌డంతో రికార్డుకెక్కింది. 1990ల‌లో ఆఫీస్ సూట్‌ను విడుద‌ల చేసిన‌ప్పుడు కార్యాల‌యాల్లో ప‌నిచేసే విధాన‌మే పూర్తిగా మారిపోయింది. 2016 నాటికి మైక్రోసాఫ్ట్ వ‌ర్డ్‌, ఎక్సెల్‌కు 840 బ‌లియ‌న్ యూజ‌ర్లు ఉన్నారు. 2000 సంవ‌త్స‌రంలో ఎక్స్ బాక్స్ అనే వీడియోగేమ్‌ను రిలీజ్ చేసింది సంస్థ‌. దానికి విప‌రీతంగా క్రేజ్ పెరిగింది. గ‌తేడాది 33శాతం అద‌న‌పు యూజ‌ర్లు గేమ్‌న‌కు చేరారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్‌, టాబ్లెట్ల ఉత్ప‌త్తిని కూడా చేస్తుంది.

ఆదాయం: 51529 మిలియ‌న్ డాల‌ర్లు

లాభం:16వేల మిలియ‌న్ డాల‌ర్లు

1. ఐబీఎమ్‌

1. ఐబీఎమ్‌

ఐబీఎమ్ ఈ యేటి మేటి ఐటీ కంపెనీగా నిలిచింది. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎదిగింది. దాదాపు 4ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ఇందులో ప‌నిచేస్తున్నారు. దీని ప్ర‌ధాన కార్యాల‌యం న్యూయార్క్‌లోని అర్‌మాంక్‌లో ఉంది.

1911లో కంప్యూటింగ్ ట్యాబులేటింగ్ అండ్ రికార్డింగ్ కంపెనీ(సీటీఆర్‌)గా సేవ‌ల‌ను ప్రారంభించింది. ఇప్పుడు దాదాపు 175 దేశాల్లో త‌న కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తోంది. ఇన్నేళ్ల‌లో వినూత్న‌మైన ఆవిష్క‌ర‌ణ‌లెన్నో చేసింది. అమెరికాలోనే 26వేల పేటెంట్ల‌ను సొంతం చేసుకుందంటే దాని ఘ‌న‌త ఏ పాటితో అర్థం చేసుకోవ‌చ్చు. 5 సార్లు నోబెల్ బ‌హుమ‌తి అందుకోవ‌డం అంటే బ‌హుశా ఏ సంస్థకు ఇంత‌టి గౌర‌వం ద‌క్కి ఉండ‌క‌పోవ‌చ్చు.

తొలి ట్యాబులేట‌ర్‌, ప్రింట‌ర్‌, హార్డ్ డిస్క్ డ్రైవ్‌, ఫ్లాపీ డిస్క్ ఇలా అన్నీ మొట్ట‌మొద‌టి సారి త‌యారుచేసింది ఈ సంస్థే కావ‌డం విశేషం. 19వ శ‌తాబ్దంలో ఈ రంగంలో ఒక ఊపు ఊపింది. 1970ల్లో ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్లు, ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌ను రూపొందించింది.

ఐబీఎం ఆదాయ‌, లాభ వివ‌రాలు

ఐబీఎం ఆదాయ‌, లాభ వివ‌రాలు

2000 నాటికి త‌న ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ విభాగాన్ని లెనోవోకు అమ్మేసింది. సొంతంగా సాఫ్ట్‌వేర్, క‌న్స‌ల్టెన్సీ సేవ‌ల‌ను ప్రారంభించింది.

ఆన్‌లైన్ లావాదేవీల కోసం ఈనాడు దాదాపు 97శాతం బ్యాంకులు ఐబీఎమ్ పైనే ఆధార‌ప‌డ‌తాయంటే అతిశ‌యోక్తి కాదు.

క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలోనూ ప్ర‌వేశించింది. క‌న్స‌ల్టెన్సీ, రీసెర్చ్‌కు విడివిడిగా గ్లోబ‌ల్ బిజినెస్ స‌ర్వీస్‌, గ్లోబ‌ల్ టెక్నాల‌జీ స‌ర్వీస్ అనే రెండు స్ట్రీమ్స్ ఉండ‌డం మూలాన ఐటీ విభాగంలో అత్యున్న‌త స్థానంలో నిల‌వ‌గ‌లిగింది. భ‌విష్య‌త్‌లో త‌న స్థానాన్ని సంస్థ ప‌దిల‌ప‌ర్చుకుంటుందేమో వేచిచూడాలి.

ఆదాయం: 79919 మిలియ‌న్ డాల‌ర్లు

లాభం : 11872 డాల‌ర్లు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+