For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ అప్ గృహ రుణం గురించి మీకు తెలియ‌ని నిజాలు

గృహ రుణం తీసుకున్న త‌ర్వాత ఇంట్లో పిల్ల‌లు ఏదైనా ప‌ర్య‌ట‌న‌కు తీసుకెళ్లమ‌ని అడిగినా స‌రిప‌డా న‌గ‌దు అందుబాటులో ఉండ‌దు. ఎలా ఉంటుంది అప్ప‌టికే గృహ‌రుణ ఈఎమ్ఐల రూపంలో ఎంతో కొంత పోతుంటుంది.

|

గృహ రుణం తీసుకున్నాక‌, నెల‌కు సంపాదించే దాంట్లో ఎక్కువ భాగం వాయిదాలు చెల్లించ‌డానికే స‌రిపోతుంది. గృహ‌రుణాలు దీర్ఘ‌కాల ఉద్దేశానికి తీసుకుంటాం కాబ‌ట్టి మ‌న పొదుపును గ‌ణ‌నీయంగా త‌గ్గించేస్తుంది.
ఇలాంట‌ప్పుడే ఏదైనా అత్య‌వ‌స‌రం ఏర్ప‌డితే లేదా ఏదైనా వైద్య చికిత్స‌ల‌కు ఎక్కువ మొత్తంలో డ‌బ్బు అవ‌స‌ర‌మ‌వుతుంది. ఇంట్లో పిల్ల‌లు ఏదైనా ప‌ర్య‌ట‌న‌కు తీసుకెళ్లమ‌ని అడిగినా స‌రిప‌డా న‌గ‌దు అందుబాటులో ఉండ‌దు. ఎలా ఉంటుంది అప్ప‌టికే గృహ‌రుణ ఈఎమ్ఐల రూపంలో ఎంతో కొంత పోతుంటుంది.

1. మ‌రింత రుణం పొందేలా...

1. మ‌రింత రుణం పొందేలా...

గృహ‌రుణ గ్ర‌హీత‌ల‌కు చ‌క్క‌ని శుభ‌వార్త‌లా మ‌రింత రుణం పొందే ఒక సౌల‌భ్యం ఉంద‌నేది చాలా మందికి తెలియ‌దు. అదే టాప్ అప్ లోన్‌. ఇది గృహ‌రుణానికి అద‌నం. త‌మ గృహ‌రుణ గ్ర‌హీత వినియోగ‌దారుల‌కు ఈ టాప్ అప్ లోన్స్ ను బ్యాంకులు అందిస్తాయి. అది వారి వ్య‌క్తిగ‌త‌, వృత్తి ల‌క్ష్యాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఉంటుంద‌ని రుణ‌దాత‌ల విశ్వాసం.

వ్య‌క్తిగ‌త రుణం, క్రెడిట్ కార్డుల‌ను ఏ అవ‌స‌రానికైనా వాడుకున్న‌ట్టుగానే ఈ టాప్ అప్ లోన్‌ను కూడా దేనికైనా వాడుకోవ‌చ్చు. ఇంటి మ‌ర‌మ్మ‌తుకు, కొత్త కారు కొనుగోలుకు, ప‌ర్యాట‌క ప్రాంతాలను సంద‌ర్శించేందుకు, పిల్ల‌ల చ‌దువులు, పెళ్లి లాంటి అవ‌స‌రాల‌కు ఆర్థికంగా వినిమ‌య‌మ‌వుతుంది.

అయితే, క్రెడిట్ కార్డులు, వ్య‌క్తిగత రుణాల‌తో పోలిస్తే ఇవి కాస్త భిన్న‌మైన‌వి.. అదెలాగో తెలుసుకుందాం.

2. రుణ అర్హ‌త‌

2. రుణ అర్హ‌త‌

ఇది వ‌ర‌కే గృహ‌రుణ పొందిన‌వారు మాత్ర‌మే టాప్ లోన్ తీసుకునేందుకు అర్హులు. అందులోనూ క‌నీసం కొన్ని వాయిదాలైనా చెల్లించిన వారికి ఈ అవ‌కాశం ల‌భిస్తుంది. కొన్ని రుణ సంస్థ‌లు ఇంటిని పూర్తిగా నిర్మించుకొని వాయిదాలు చెల్లించేవారికే టాప్ లోన్స్ ను మంజూరు చేస్తాయి.

3. ఎంత పొందొచ్చు...

3. ఎంత పొందొచ్చు...

టాప్ అప్ లోన్ కింద రూ.5ల‌క్ష‌ల నుంచి రూ.50ల‌క్ష‌లు పొందొచ్చు. ఇది గృహ‌రుణ మొత్తం, ప్ర‌స్తుతం ఉన్న వాయిదాలు, స్థిరాస్తి విలువ‌ను బ‌ట్టి అద‌నంగా ఎంత రుణం ఇవ్వాల్సిందీ నిర్ణ‌యిస్తారు.

క్రెడిట్ కార్డుల‌నేవి ముంద‌స్తుగా ఆమోదం తెలిపిన రుణాల లాంటివ‌న్న విష‌యం తెలిసిందే. క్రెడిట్ కార్డు ర‌కం, బిల్లు చెల్లింపులు, తిరిగి చెల్లించిన తీరును బ‌ట్టి క్రెడిట్ రుణ ప‌రిమితి ఉంటుంది. వ్య‌క్తిగ‌త రుణ‌మ‌నేది క్రెడిట్ స్కోరు, నెల‌వారీ ఆదాయం, ఇత‌ర అంశాల‌ను బ‌ట్టి ఇస్తారు.

రూ.50వేలు మొద‌లుకొని రూ.15ల‌క్ష‌ల వ‌ర‌కు వ్య‌క్తిగ‌త రుణాల‌ను పొందే వీలుంది. అది కూడా మీ నెల‌వారీ ఆదాయం, ప్ర‌స్తుతం ఇత‌ర రుణాల‌కు చెల్లిస్తున్న వాయిదాలు, రుణ‌కాలవ్య‌వ‌ధి, ప‌ని చేసే సంస్థ‌ను బ‌ట్టి ఇచ్చే రుణాన్ని నిర్ణ‌యిస్తారు.

4. దానికి ప‌రిమితి ఉంది...

4. దానికి ప‌రిమితి ఉంది...

క్రెడిట్ కార్డుపై ప్రీ అప్రూవ్డ్ రుణం ఇస్తారు కాబ‌ట్టి కార్డు జారీచేసే సంస్థే దానికి ప‌రిమితినీ విధిస్తారు.

క్రెడిట్ కార్డు లిమిట్‌కు మించి ఎక్కువ రుణాన్ని బ్యాంకులు ఇవ్వ‌వు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక క్రెడిట్ కార్డును అప్ప‌టికే రూ.50వేలు వాడుకున్నారు. క్రెడిట్ కార్డు ప‌రిమితి రూ.2ల‌క్ష‌లు. గ‌రిష్టంగా రూ.1.5ల‌క్ష‌ల దాకే రుణాన్ని అందుకోగలుగుతాం.

5. కాల‌వ్య‌వ‌ధి

5. కాల‌వ్య‌వ‌ధి

టాప్ అప్ హోమ్ లోన్స్ విష‌యంలో కాల‌వ్య‌వ‌ధి గరిష్టంగా 20ఏళ్ల దాకా ఉంటుంది. అయితే అస‌లైన గృహ‌రుణ వ్య‌వ‌ధిని మించి ఇది ఉండ‌దు. టాప్ అప్ లోన్ రుణ కాల్య‌వ‌వ‌ధి ప్ర‌స్తుతం కొన‌సాగిస్తున్న వాయిదాలు, నెల‌వారీ ఆదాయంపైనా ఆధార‌ప‌డి ఉంటుంది.ఆధార్ అనుసంధానానికి సంబంధించి నాలుగు ముఖ్య డెడ్‌లైన్లు

6. వ‌డ్డీరేట్లు

6. వ‌డ్డీరేట్లు

వ్య‌క్తిగ‌త రుణాలు, క్రెడిట్‌కార్డు రుణాల కాల‌వ్య‌వ‌ధి సాధార‌ణంగా 1 నుంచి 5ఏళ్ల దాకా ఉంటుంది. అరుదుగా కొంద‌రు క్రెడిట్ కార్డు జారీదారులు కేవ‌లం 3 నెల‌ల స‌మ‌యాన్ని మాత్ర‌మే ఇస్తారు. వార్షికంగా ఇలాంటి రుణాల‌పై వ‌డ్డీ 11.5శాతం నుంచి మొద‌ల‌వుతాయి. వ్య‌క్తిగ‌త రుణాల‌పై వ‌డ్డీ మాత్రం వార్షికంగా 10.99శాతం నుంచి 24శాతం మ‌ధ్య‌లో ఉంటుంది.

గృహ రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు ముఖ్య‌ కారణాలుగృహ రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌ర‌ణ‌కు ముఖ్య‌ కారణాలు

7. త‌క్కువ వ‌డ్డీరేటు ప్ర‌యోజ‌నం

7. త‌క్కువ వ‌డ్డీరేటు ప్ర‌యోజ‌నం

ఇక టాప్ అప్ లోన్స్ విష‌యానికొస్తే... సాధార‌ణంగా రుణ‌దాత‌లు గృహ‌రుణ రేటు కంటే 1శాతం ఎక్కువ వ‌డ్డీనే వ‌డ్డిస్తారు. మ‌రి కొంత మంది గృహ‌రుణ రేటు వ‌డ్డీనే కొన‌సాగిస్తారు. ఇది ప్ర‌స్తుతానికి 8.35శాతం నుంచి మొద‌ల‌వుతుంది. అందుకే ఇది వ‌ర‌కే గృహ‌రుణం తీసుకున్న‌వారికి త‌క్కువ వ‌డ్డీకే రుణం ల‌భించ‌డం అత్యంత ప్ర‌యోజ‌న‌దాయ‌కం. టాప్ 10 ఐటీ కంపెనీలు- ప్ర‌పంచ‌వ్యాప్తంగా-ఇండియా నుంచి ఆ జాబితాలో రెండు

8. పన్ను ఆదా ప్ర‌యోజ‌నాలు

8. పన్ను ఆదా ప్ర‌యోజ‌నాలు

ఇవి కాకుండా టాప్ అప్ లోన్ లో వ‌డ్డీ భాగంలో చెల్లించే ఈఎమ్ఐ కు సెక్ష‌న్ 24బి కింద ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. అయితే ఈ రుణాన్ని నివాస స‌ముదాయ‌ మ‌ర‌మ్మ‌తుకు ఉప‌యోగించిన‌ప్పుడే ప‌న్ను ఆదా పొంద‌వ‌చ్చు. సాధార‌ణంగా గృహ నిర్మాణానికి లేదా కొనుగోలుకు తీసుకునే రుణం లో ప్రిన్సిపాల్ అమౌంట్ సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నం పొందితే, వ‌డ్డ భాగం సెక్ష‌న్ 24 కింద ప‌న్నుఆదాను క్లెయిం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వ్య‌క్తిగ‌త లేదా క్రెడిట్ కార్డు రుణాల‌పై ఇలాంటి ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఉండ‌వు.భార‌త‌దేశంలో 10 అతి పెద్ద ఆర్థిక మోసాలు

9. రుణ మంజూరు ఇన్ని రోజుల్లో...

9. రుణ మంజూరు ఇన్ని రోజుల్లో...

క్రెడిట్ కార్డుపై రుణాలు అదే రోజు వచ్చేస్తాయి. వ్య‌క్తిగ‌త రుణాలకు 2 నుంచి 7రోజుల స‌మ‌యం ప‌డుతుంది. టాప్ అప్ హోమ్ లోన్స్ మంజూర‌య్యేందుకు మాత్రం 7 నుంచి 10రోజుల స‌మ‌యం ప‌డుతుంది.

10. త‌క్ష‌ణ రుణానికైతే..

10. త‌క్ష‌ణ రుణానికైతే..

ప్ర‌స్తుతం మీరు ఏదో ఒక గృహ‌రుణ గ్ర‌హీత‌లైతే, మ‌రింత ఎక్కువ సొమ్మును రుణంగా పొందాల‌ని చూస్తున్న‌వారైతే టాప్ అప్ హోమ్ లోన్‌ను ప‌రిశీలించ‌డం మంచిది. వీటిపై వ‌డ్డీ రేట్లు త‌క్క‌వ మాత్ర‌మే కాదు రుణం తీర్చేందుకు ఎక్కువ స‌మ‌యం ఉంటుంది. ఇంటిని మ‌ర‌మ్మ‌తు చేయ‌ద‌ల్చుకొని ఇలాంటి రుణాన్ని తీసుకుంటే ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొందొచ్చు.

ఈ రుణాన్ని పొందేందుకు మాత్రం క‌నీసం వారం రోజులు వేచిచూడాల్సి ఉంటుంది. త‌క్ష‌ణ రుణం కావాల‌న్నా, త‌క్కువ వ్య‌వ‌ధిలో తీర్చేయ‌గ‌ల‌వి పొందాల‌న్నా క్రెడిట్ కార్డు రుణ‌మో, వ్య‌క్తిగ‌త రుణ‌మో తీసుకోవ‌డం మేలు.

Read more about: home loan interest rates
English summary

టాప్ అప్ గృహ రుణం గురించి మీకు తెలియ‌ని నిజాలు | Top Up home loans-features and advantages

Once you are sanctioned a home loan, a significant part of your monthly income goes towards servicing the EMIs. And since home loans are usually taken for the long term, it reduces your ability to save and invest.In this scenario, a financial emergency like a medical exigency or an unavoidable lifestyle expenditure like a foreign trip leaves you opting for other loans, like personal loans or one against credit card
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X