For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కంలో స‌బ్సిడీ రుణం కోసం ద‌ర‌ఖాస్తు ఎలా?

అంద‌రూ పెద్ద‌మొత్తంలో డ‌బ్బు వెచ్చించి ఇంటి రుణ వాయిదాలు క‌ట్ట‌లేరు. అదే దానిని తగ్గించే మార్గం ఉంటే? ప్రస్తుతం ప్ర‌భుత్వం అలాంటి అవకాశాన్ని కల్పించింది. అది ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కంలోని క్రె

|

ఇల్లు కొనేందుకు, కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు మ‌ధ్య త‌ర‌గ‌తికి అంత స్తోమ‌త ఉండ‌దు. అందుకోస‌మే బ్యాంకులు ఇంటి కొనుగోలు కోసం రుణాల‌ను చౌక‌గా అందిస్తున్నాయి. సొమ్ము సర్దుబాటుకు అందుబాటులో ఉన్న చ‌క్క‌టి మార్గం గృహ రుణం. ఇంటి రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులు.. అత్యవసర వ్యయాలు పోను మిగిలిన సొమ్మును కంతుల(ఈఎంఐ) రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా అంద‌రూ పెద్ద‌మొత్తంలో డ‌బ్బు వెచ్చించి గృహ‌ రుణ వాయిదాలు క‌ట్ట‌లేరు. అదే దానిని తగ్గించే మార్గం ఉంటే? ప్రస్తుతం ప్ర‌భుత్వం అలాంటి అవకాశాన్నే కల్పించింది. అది ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కంలోని క్రెడిట్ లింక్‌డ్ స‌బ్సిడీ ప‌థ‌కం ద్వారా. దాని ద్వారా స‌బ్సిడీ రుణం కోసం ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలో తెలుసుకుందాం.

ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌

ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌

20 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధికి ఇంటి రుణం తీసుకునే వారు ఈ ప‌థ‌కానికి అర్హులు. ఇందుకోసం ప్ర‌భుత్వ వెబ్‌సైట్ http://pmaymis.gov.in/లోకి వెళ్లాలి. మ‌న అర్హ‌త‌ల‌ను ప‌రిశీలించి త‌ర్వాత ద‌ర‌ఖాస్తు చేయాలి. ప్ర‌భుత్వ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి.

వెబ్‌సైట్లో ఎక్క‌డ అర్హ‌త‌ను చెక్ చేసుకోవాలి?

వెబ్‌సైట్లో ఎక్క‌డ అర్హ‌త‌ను చెక్ చేసుకోవాలి?

త‌ర్వాత సిటిజ‌న్ అసెస్‌మెంట్ ట్యాబ్‌లో మీ కేట‌గిరీని ఎంచుకోవాలి. మురికివాడ‌ల‌ను నిర్మూలించి అక్క‌డ ప‌క్కా గృహాల‌ను నిర్మించేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కృషిచేస్తున్నాయి. మీరు అక్క‌డ నివ‌సిస్తున్న‌ట్ల‌యితే స్ల‌మ్ డ్వెల్ల‌ర్స్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. ప‌ట్ట‌ణాల‌కు సంబంధించి మ‌ధ్య త‌ర‌గ‌తివారు, ఏ ఇత‌ర కేట‌గిరీ వార‌యినా రెండో ఆప్ష‌న్‌(బెనిఫిట్ అండ‌ర్ అద‌ర్ 3 కాంపోనెంట్స్)ను ఎంచుకోవాలి.

 ద‌ర‌ఖాస్తు ఫారం

ద‌ర‌ఖాస్తు ఫారం

అక్క‌డ లింక్‌పైన క్లిక్ చేసిన త‌ర్వాత ఆధార్ సంఖ్య‌ను న‌మోదు చేయాలి. త‌ర్వాత అప్లికేష‌న్ ఫారం లింక్ వ‌స్తుంది. అక్క‌డ రాష్ట్రం, జిల్లా, న‌గ‌రం, ప‌థ‌కానికి సంబంధించిన ర‌కాన్ని ఎంచుకోవాలి.ఆ న‌గ‌రం లేదా ప‌ట్ట‌ణంలో ఎన్నేళ్ల నుంచి నివ‌సిస్తున్నారో వంటి వివ‌రాల‌ను, మీరు ప్ర‌స్తుతం నివ‌సిస్తున్న ఇంటి వివ‌రాల‌ను నింపాలి. వివ‌రాల‌న్నీ పూర్తిచేసిన త‌ర్వాత ఒక‌టికి రెండు సార్లు స‌రిచూసుకుని సేవ్ ఆప్ష‌న్ నొక్కాలి.

ఇది వ‌ర‌కే ద‌ర‌ఖాస్తు చేసిన‌వారు ల‌బ్దిదారుల జాబితాలో త‌మ పేరుందో లేదో తెలుసుకునేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి

క్రెడిట్ లింక్‌డ్ స‌బ్సిడీ గురించి మ‌రింత స‌మాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

రుణ‌-ఈఎంఐ స‌మ‌చారం

రుణ‌-ఈఎంఐ స‌మ‌చారం

సాధార‌ణంగా ఒక‌ర‌క‌మైన ఇల్లు క‌ట్టుకునేందుకు క‌నీసం 10 ల‌క్ష‌ల ఖ‌ర్చ‌వుతోంది. ఉదాహ‌ర‌ణ‌కు వ‌రంగల్‌, క‌రీంన‌గ‌ర్‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి లాంటి చోట మీకు 80 నుంచి 150 చ‌.మీ స్థ‌లం ఉంద‌నుకుందాం. మీ వ‌ద్ద 4 నుంచి 5 ల‌క్ష‌ల న‌గ‌దు ఉంద‌నుకుంటే మిగిలిన సొమ్మును బ్యాంకు నుంచి గృహ రుణం కింద తీసుకోవ‌చ్చు. వ‌డ్డీపై నిక‌రంగా రూ. 2ల‌క్ష‌ల 30 వేల నుంచి మొద‌లుకొని రూ. 2.45 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఆదా అయ్యే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు ఈఎంఐలో క‌నీసం రూ. 2వేల త‌గ్గుద‌ల ఉండొచ్చు.

కేంద్ర స‌బ్సిడీ ద్వారా ఈఎంఐలో 2200 ఆదా

కేంద్ర స‌బ్సిడీ ద్వారా ఈఎంఐలో 2200 ఆదా

మొదటిసారి రుణం తీసుకుని ఇల్లు కొనుక్కునే వారికి, కట్టించుకునే వారికికేంద్రం చేయూత‌నిస్తోంది. వార్షికాదాయం రూ.18 లక్షల వరకూ ఉన్నా సరే.. వారు ఇంటికోసం తీసుకునే రుణంలో కొత్త మొత్తానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ సబ్సిడీ ఇవ్వనుంది. 20 ఏళ్లకు గృహ రుణం తీసుకుంటే వారు చెల్లించే వడ్డీలో దాదాపు రూ.2.4 లక్షల మొత్తాన్ని కేంద్రం సబ్సిడీగా చెల్లిస్తుంది. ఈ మేరకు నెలసరి వాయిదాలు సుమారు రూ.2,200 మేర తగ్గడం ఇందులోని ప్రయోజనం.

కార్పెట్ ఏరియా:

కార్పెట్ ఏరియా:

ఇంటి కొనుగోలు సమయంలో ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లలో కార్పెట్‌ ఏరియా, బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియా పదాలు వినిపిస్తుంటాయి. కార్పెట్‌ ఏరియా ఇంట్లో గదుల్లోని లోప‌ల‌ విస్తరించిన ప్రాంతాన్ని కార్పెట్‌ ఏరియాగా పరిగణిస్తారు. గోడలను మినహాయించి లెక్కిస్తారు. ఉమ్మడి స్థలం మెట్లు, లిఫ్ట్‌, లాబీ, ఆట స్థలం వంటివి ఇందులోకి రావు. కాబట్టి కొనేటప్పుడు కార్పెట్‌ ఏరియా ఎంత అనేది తెలిస్తే వంటగది, హాలు, పడకగది, పిల్లల గది ఏ విస్తీర్ణంలో రాబోతుందనేది అవగాహనకు రావొచ్చు. చాలామంది బిల్డర్లు కార్పెట్‌ ఏరియాను వారి బ్రోచర్లలో స్పష్టం చేయరు. బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియాపైనే ధర వసూలు చేస్తారు. సాధారణంగా బిల్టప్‌ ఏరియాలో 70 శాతం వరకు కార్పెట్‌ ఏరియా ఉంటుంది.

ఆధార సంవ‌త్స‌రం 2001 నాటికి మార్పు

ఆధార సంవ‌త్స‌రం 2001 నాటికి మార్పు

ఇప్పటివరకు 1980 కంటే ముందుకొన్న ఫ్లాట్, ప్లాట్‌ ఏదైనా స్థిర, చరాస్తులను ఎప్పుడు విక్రయించినా సరే 1981 ఏప్రిల్‌ 1 నాటి మార్కెట్‌ రేటు ఆధారంగా మూలధన లాభాలు (క్యాపిటల్‌ గెయిన్‌) విలువలను లెక్కగట్టేవారు. కానీ, తాజా బడ్జెట్‌లో విలువ లెక్కింపు సంవత్సరాన్ని 2001 ఏప్రిల్‌ 1కి మార్చారు. దీంతో విక్రయదారుడికి సరైన మార్కెట్‌ రేటు వస్తుంది. గతంలో మూడేళ్లుగా ఉన్న దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్‌ పన్ను ప్రయోజనాలను 2 ఏళ్లకు కుదించారు. మూడేళ్ల కంటే ఎక్కువున్న స్థిరాస్తుల దీర్ఘకాలిక మూలధన లాభాలు 20 శాతం చెల్లించాలి.

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో ప్ర‌యోజ‌నాలుప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో ప్ర‌యోజ‌నాలు

ప‌క‌డ్బందీగా నిబంధ‌న‌లు

ప‌క‌డ్బందీగా నిబంధ‌న‌లు

2022 నాటికి అందరికీ సొంతిల్లు కల్పించాలనేది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ఉద్దేశం. అందుకే ప్రభుత్వం వడ్డీపై రాయితీలను అందిస్తోంది. అనర్హుల‌ను ద‌రిచేర‌నీయ‌కుండా మొదటి సారి ఇల్లు సమకూర్చుకుంటున్నవారికే వీటిని పరిమితం చేసింది. దీనికి దరఖాస్తు చేసుకుంటున్న వారి పేరిట, వారి కుటుంబ సభ్యుల పేరిట ఇదివ‌ర‌కే ఇల్లు ఉండరాదు. కుటుంబ సభ్యులు అంటే భార్యా, భర్త, వివాహం కాని పిల్లలు అని అర్థం. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్ హెచ్ బీ), హడ్కోలకు నోడల్ ఏజెన్సీలుగా సబ్సిడీ పథకాల అమలు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి కోసం లేదా ఉన్న ఇల్లు విస్తరణ కోసం రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్నవారు కూడా వడ్డీలో 3 శాతం రాయితీని ప్రభుత్వం నుంచి పొందవచ్చు.

మ‌న దేశంలో అత్యధిక‌ వేత‌నాలిచ్చే ఉద్యోగాలివే... చేరిపోతారా?

మ‌న దేశంలో అత్యధిక‌ వేత‌నాలిచ్చే ఉద్యోగాలివే... చేరిపోతారా?

 దేశంలో అత్య‌ధిక వేత‌నాలు ల‌భించే ఉద్యోగాలు, వృత్తులు దేశంలో అత్య‌ధిక వేత‌నాలు ల‌భించే ఉద్యోగాలు, వృత్తులు

 బీమా పాల‌సీలు-ఏజెంట్లు దాచిపెట్టే విష‌యాలు

బీమా పాల‌సీలు-ఏజెంట్లు దాచిపెట్టే విష‌యాలు

సంప్ర‌దాయ పాల‌సీలు: బీమా ఏజెంట్లు చెప్ప‌ని 7 ముఖ్య‌మైన అంశాలివే!సంప్ర‌దాయ పాల‌సీలు: బీమా ఏజెంట్లు చెప్ప‌ని 7 ముఖ్య‌మైన అంశాలివే!

English summary

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కంలో స‌బ్సిడీ రుణం కోసం ద‌ర‌ఖాస్తు ఎలా? | how to apply for pm awas yojana subsidy loan

Interest subsidy will be credited upfront to the loan account of beneficiaries through Primary Lending Institutions resulting in reduced effective housing loan and Equated Monthly Instalment (EMI). The Net Present Value (NPV) of the interest subsidy will be calculated at a discount rate of 9%. Beneficiaries of Economically Weaker section (EWS) and Low Income Group (LIG) seeking housing loans from Banks, Housing Finance Companies and other such institutions would be eligible for an interest subsidy at the rate of 6.5% for a tenure of 20* years or during tenure of loan whichever is lower.CLSS for MIG will support acquisition/ construction of house (including re-purchase) of 90 square meters and 110 square meters carpet area as per income eligibility.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X