English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

రేషన్, పాన్,ఆధార్ కార్డు పోయిందా?: మళ్లీ పొందడం ఎలా?

Written By:
Subscribe to GoodReturns Telugu

ఎప్పుడు అయితే నోట్ల ర‌ద్దు జ‌రిగిందో అప్ప‌టి నుంచి ప్ర‌జ‌ల్లో వాలెట్లు, కార్డుల వాడ‌కం ఎక్కువైపోయింది. ఏటీఎమ్ కార్డులు మొద‌లుకొని పాన్,ఆధార్ కార్డుల వ‌ర‌కూ ఇవ‌న్నీ రోజువారీ జీవితంలో భాగ‌మ‌య్యాయి. అందుకే వీటిని చాలా జాగ్ర‌త్త‌గా ఉంచుకోవాలి. ఒక్కోసారి మ‌న నిర్ల‌క్ష్యం కార‌ణంగానో, దుర‌దృష్టం కొద్దో ప‌ర్సు పోగొట్టుకుపోయినా, దొంగ‌త‌నానికి గురైనా ఓరిజిన‌ల్ కార్డులు కోల్పోతుంటారు. అవి పోతే మ‌నం ప‌డే ఆత్రం అంతా ఇంతా కాదు. వాటిని మ‌ళ్లీ ఎలా తెచ్చుకోవాలో అని కంగారుప‌డ‌తాం. కానీ కార్డులు పోగొట్టుకున్న‌ప్పుడు ఎలాంటి ఆందోళ‌న అవ‌స‌రం లేదు. కొంత స‌మ‌యం తీసుకున్నా వాటిని త‌క్కువ ఖ‌ర్చుతోనే మ‌ళ్లీ మ‌న చిరునామాకే తెప్పించుకోవ‌చ్చు. ఆ ప‌ద్ద‌తులేంటో తెలుసుకుందాం.

రేష‌న్ కార్డు విష‌యంలో

రేష‌న్ కార్డు విష‌యంలో

కుటుంబ అవ‌స‌రాల‌కు ఈ రోజుల్లో రేష‌న్ కార్డు కీల‌కం.ఏపీ ఆన్‌లైన్, టీజీ మీసేవ వెబ్‌సైట్ల‌లో రేష‌న్ కార్డు సంబంధిత సేవ‌లు ల‌భ్య‌మవుతున్నాయి.

తెలంగాణ వాసులు రేషన్ కార్డుని డౌన్ లోడ్ చేసుకోవడానికి Epds.telangana.gov.in అనే వెబ్ సైట్ ని ఓపెన్ చేసి అందులో పైన వీడియోలో చూపిన విధంగా వివరాలు అందించి రేషన్ కార్డుని పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్ చెందిన వారు రేషన్ కార్డుని డౌన్ లోడ్ చేసుకోవడానికి Epds.ap.gov.in అనే వెబ్ సైట్ ని ఓపెన్ చేసి అందులో పైన వీడియోలో చూపిన విధంగా వివరాలు అందించి రేషన్ కార్డుని పొందవచ్చు.

ఆన్‌లైన్ మార్గం కాకుండా రేష‌న్ కార్డు నంబ‌రుతో స్థానిక త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో సంప్ర‌దిస్తే వారు దాన్ని ప‌రిశీల‌న జ‌రిపి www.icfs2.ap.gov.in వెబ్‌సైట్లో లాగిన్ అయి కూడా ఆయా వివ‌రాలు నింపి జిరాక్స్ కాపీ పొంద‌వ‌చ్చు.

 పాన్ కార్డు పోతే కొత్త‌ది తెచ్చుకోవ‌డం ఎలా?

పాన్ కార్డు పోతే కొత్త‌ది తెచ్చుకోవ‌డం ఎలా?

ప్ర‌స్తుతం చాలా ఆర్థిక లావాదేవీల్లో పాన్ కార్డు చాలా కీల‌కం అయింది. ఆదాయపు ప‌న్ను శాఖ అంద‌జేసే ప‌ర్మినెంట్ అకౌంట్ నంబ‌రు(పాన్) కార్డు పోగొట్టుకుంటే ఇన్‌క‌మ్ ట్యాక్స్ సంబంధిత కార్యాల‌యాల్లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుతో పాటు పాత పాన్ కార్డు జిరాక్స్, రెండు క‌ల‌ర్ ఫోటోలు, నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. పాన్ ఆధార్ అనుసంధానం మాన్యువ‌ల్‌గా ఎలా?

కొత్త కార్డు కోసం www.onlineservices.nsdl.com వెబ్‌సైట్‌ను సంప్ర‌దించండి.

ఓటరు గుర్తింపు కార్డు :

ఓటరు గుర్తింపు కార్డు :

ఓటరు గుర్తింపు కార్డు పోతే పోలింగ్‌బూత్, కార్డు నెంబర్‌తో రూ.10 రుసుం చెల్లించి మీ సేవా కేంద్రాల్లో మళ్లీ ఓటరు గుర్తింపు కార్డు పొందవచ్చు. లేదా కార్డు నెంబర్ గుర్తుంటే, దాని ఆధారంగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా ఇస్తారు. మరింత సమాచారం కోసం http://eci.nic.in/eci/eci.html వెబ్‌సైట్‌ని సంప్రదించండి.

ఆధార్ కార్డు పోతే...

ఆధార్ కార్డు పోతే...

ఆధార్ కార్డు పోతే టోల్ ఫ్రీ నంబ‌రు 1800 1801947 నంబ‌రుకు ఫోన్ చేసి పూర్తి వివ‌రాల‌తో ఫిర్యాదు చేయాలి.

రుసుము, చెల్లించాల్సిన అవ‌స‌రం లేకుండానే కొత్త కార్డు మ‌ళ్లీ పోస్టులో మీ చిరునామాకు పంపిస్తారు.

ఇంకా help@uidai.gov.in అనే చిరునామాకు మెయిల్ పంప‌డం ద్వారా కూడా మీకు కావాల్సిన సేవ‌ను పొంద‌వ‌చ్చు.

ఆధార్ అనుసంధానానికి సంబంధించి 4 ముఖ్య డెడ్‌లైన్లు ఇవే...

పాస్ పోర్టు పోగొట్టుకుంటే...

పాస్ పోర్టు పోగొట్టుకుంటే...

పాస్ పోర్టు పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేయాలి. వారు విచారించి నాన్ ట్రేస్‌డ్ ధ్రువ‌ప‌త్రం జారీ చేస్తారు. అనంతరం పాస్ పోర్టు అధికారి, హైద‌రాబాద్ పేరిట రూ.1000 డీడీ తీయాలి. ఈ రెండింటిని జ‌త‌ప‌రిచి ద‌ర‌ఖాస్తు చేయాలి.

ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచార‌ణ చేసి కార్యాల‌యానికి స‌మాచారం అందిస్తారు. మూడు నెల‌ల త‌ర్వాత డూప్లికేట్ పాస్ పోర్టు జారీ చేస్తారు. త‌త్కాల్ పాస్ పోర్టు అయినట్లైతే నేరుగా జిల్లా ఎస్పీని సంప్ర‌దించాల్సి ఉంటుంది. వివ‌రాల‌కు www.passportindia.gov.inను సంప్రదించటం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

డ్రైవింగ్ లైసెన్సు

డ్రైవింగ్ లైసెన్సు

డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్న వెంట‌నే సంబంధిత పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేయాలి. వారు అందించే నాన్ ట్రేస్‌డ్ స‌ర్టిఫికెట్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ప్ర‌తిని ప్రాంతీయ ఆర్టీఏ కార్యాల‌యంలో అందించాలి. సాధార‌ణంగా డ్రైవింగ్ లైసెన్సు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుని త‌గినంత రుసుము చెల్లిస్తే అదే రోజు కొత్త‌ది జారీ చేస్తారు. దీనికి ద‌ళారుల‌ను ఆశ్ర‌యించాల్సిన ప‌నిలేదు. వెంట‌నే ప‌ని పూర్త‌వుతుంది.

డెబిట్ ... క్రెడిట్ కార్డు

డెబిట్ ... క్రెడిట్ కార్డు

న‌గ‌దు సంబంధిత డెబిట్‌, క్రెడిట్ కార్డులు వ్య‌క్తి జీవితంల విడ‌దీయ‌లేనంత ప్రాముఖ్య‌త సంత‌రించుకున్నాయి.

ఏటీఎమ్ లేదా డెబిట్ కార్డు పోయింద‌ని తెలిసిన వెంట‌నే సంబంధిత బ్యాంకు వినియోగ‌దారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు స‌మ‌యంలో వారు అడిగిన స‌మ‌చారం అందించి వెంట‌నే కార్డును బ్లాక్ చేయించాలి. త‌ర్వాత బ్యాంకు మేనేజ‌ర్‌కు ఫిర్యాదు సంఖ్య‌ను తెలియ‌జేయాలి. సాధార‌ణంగా ఫోన్ ఫిర్యాదు అందిన వెంట‌నే అర గంట‌లోపు కార్డు ద్వారా జ‌రిగే లావాదేవీల‌ను నిలువ‌రిస్తారు. మ‌రుస‌టి రోజు బ్యాంకుకు వెళ్లి మరొక కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే వారం నుంచి 10 రోజుల్లోపు కొత్త కార్డు జారీ చేస్తారు. క్రెడిట్ కార్డు-వివిధ రుసుములు

పర్సులో ఎక్కువ‌గా కార్డులుండే వారికి సూచ‌న‌లు

పర్సులో ఎక్కువ‌గా కార్డులుండే వారికి సూచ‌న‌లు

ఏ కార్డ‌యినా స‌రే స్కాన్ చేయించి ఈ-మెయిల్ అడ్ర‌స్‌కు పంపించుకుని స్టోర్ చేసుకోవ‌డం మంచిది. ప్ర‌ధాన కార్డుల‌ను డూప్లికేట్ త‌యారుచేయించి వాటిని జేబులో పెట్టుకుని తిర‌గ‌డం సూచ‌నీయం. ముఖ్య‌మైన కార్డుల కోసం ప్ర‌త్యేక వాలెట్ పెట్టుకుంటే మంచిది.ఏటీఎమ్‌ల్లోనే దొంగ నోట్లు వ‌స్తే ఏం చేయాలి?

ఆధార్ అనుసంధానానికి సంబంధించి నాలుగు ముఖ్య డెడ్‌లైన్లు

Read more about: pan card, voter card, aadhaar
English summary

Lost your card No need to be panic here is the way how to get them

How to get identification card in india, Lost your pan card how to get new one, How to get new ration card in telugu, New pan card application online telugu
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns