For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

YES Bank crisis: కస్టమర్లకు యస్ బ్యాంకు మరో శుభవార్త, రుణాల చెల్లింపులు ఇలా చేయొచ్చు

|

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకు తన కస్టమర్లకు మరో శుభవార్త తెలిపింది. డెబిట్ కార్డు ఉన్నవారు డబ్బులను ఏ బ్యాంకు ఏటీఎం నుండి అయినా విత్ డ్రా చేసుకోవచ్చునని రెండు రోజుల క్రితం ఊరట కల్పించింది. తాజాగా మంగళవారం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఖాతాదారులు నెఫ్ట్‌తో పాటు ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా చెల్లింపులు జరుపుకోచవచ్చునని తెలిపింది.

యస్ బ్యాంకు సంక్షోభం, మరిన్ని కథనాలు

నెఫ్ట్, ఐఎంపీఎస్ ఉపయోగించుకోవచ్చు

కస్టమర్లు NEFTతో పాటు IMPS ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులు, రుణ బకాయిలు, బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను, ఇతర చెల్లింపులు జరుపుకోవచ్చునని యస్ బ్యాంకు ట్వీట్ చేసింది. యస్ బ్యాంక్‌ బోర్డును ఆర్బీఐ ఇటీవల రద్దు చేసి, బ్యాంకు నుంచి విత్‌డ్రాకు పరిమితులు విధించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ మారటోరియం విధించడంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.

ఎస్బీఐ చైర్మన్ మాటే.. ప్రశాంత్ నోటి నుండి..

ఎస్బీఐ చైర్మన్ మాటే.. ప్రశాంత్ నోటి నుండి..

అంతకుముందు యస్ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ వారాంతంలోగా బ్యాంకుపై విధించిన మారటోరియం ఎత్తివేయవచ్చునని తెలిపారు. అంతకుముందు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది కూడా ఖాతాదారులకు, ఇన్వెస్టర్లకు శుభవార్త.

ఎస్బీఐ రంగంలోకి దిగడంతో..

ఎస్బీఐ రంగంలోకి దిగడంతో..

యస్ బ్యాంకులో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎస్బీఐ ముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యస్ ట్రాన్సాక్షన్లపై నియంత్రణలు సడలించే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ అరెస్టయ్యారు. ఆయన కుటుంబం దేశం దాటి వెళ్లకుండా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.

English summary

YES Bank crisis: కస్టమర్లకు యస్ బ్యాంకు మరో శుభవార్త, రుణాల చెల్లింపులు ఇలా చేయొచ్చు | YES Bank resumes inward NEFT, IMPS services, Customers can now pay dues

Troubled lender YES Bank enabled its inward IMPS/NEFT services. Customers can now make payments towards YES Bank credit card dues and loan obligations on other accounts. Earlier, the new YES Bank administrator Prashant Kumar said that the moratorium imposed by the Reserve Bank of India could be lifted before the end of this week.
Story first published: Tuesday, March 10, 2020, 16:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X