For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాక్: అమెరికాలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఉడిపోయే అవకాశముందంటే? ఇండియన్స్ ఏమంటున్నారు?

|

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెంబర్ వన్ అమెరికా, నెంబర్ 2 చైనాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. చైనా జీడీపీ ఈ ఏడాది దారుణంగా పడిపోతుందని ఆర్థిక నిపుణుల అంచనా. ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున కోల్పోనున్నారని చెబుతున్నారు. కరోనాపై వెంటనే జాగ్రత్తపడని అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమేనని అంటున్నారు. ఉద్యోగాల కోత లేదా వేతన కోత ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Covid 19: ఇదీ చైనా ఆర్థిక దుస్థితి, 44 ఏళ్లలో ఇలా జరగలేదు! డ్రాగన్‌కు 2 సవాళ్లు

చాలామంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం

చాలామంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం

ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 47వేల మందికి పైగా మృతి చెందగా, ఇందులో అమెరికాలోనే 5వేలకు పైగా మృత్యవాత పడ్డారు. దీంతో మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు అమెరికాతో పాటు భారత్ ఐటీ పరిశ్రమ, ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. న్యూయార్క్ కరోనాకు విలవిల్లాడుతోంది. ఇప్పటికే వివిధ కంపెనీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముంది.

వారికి గడువు పొడిగించలేదు

వారికి గడువు పొడిగించలేదు

న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లోనే కేసులు భారీగా ఉన్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా న్యూయార్క్‌లో అన్ని వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు నిలిచాయి. ఈ రాష్ట్రాలకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయట. మార్చి నెలాఖరుతో కాంట్రాక్ట్ గడువు పూర్తయిన నలభై వేల మందికి గడువు పొడిగించలేదని తెలుస్తోంది.

హెచ్1బీ వీసాదారుల్లో ఆందోళన

హెచ్1బీ వీసాదారుల్లో ఆందోళన

ఓ వైపు కరోనా కారణంగా బయటకు వెళ్లవద్దనే ఆంక్షలు, మరోవైపు మీ కాంటాక్ట్ గడువు ముగిసిందని కంపెనీల నుండి లేఖలు కలవరం కలిగిస్తున్నాయి. ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో భారత్ సహా వివిధ దేశాల వారు ఉన్నారు. ఈ క్రమంలో అమెరికాలోని హెచ్1బీ వీసాదారుల్లోను ఆందోళన మొదలైంది. వివిధ కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగాల కోత వైపు దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

గడువు పెంచాలని..

గడువు పెంచాలని..

అమెరికాలోనే నివాసం ఉండేందుకు గడువు నిబంధనల్లో సవరణలు చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న 60 రోజుల గడువును 180 రోజులకు పెంచాలని కోరుతున్నారు. హెచ్1బీ వీసాదారుల్లో ఎక్కువమంది భారతీయులే. తమ విజ్ఞప్తిని మన్నించాలని ట్రంప్‌ను కోరనున్నారు.

47 మిలియన్ల ఉద్యోగాలు పోవచ్చు

47 మిలియన్ల ఉద్యోగాలు పోవచ్చు

అమెరికాలో ఆంక్షల నేపథ్యంలో గత రెండు వారాల్లో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. హెచ్1బీ వీసాదారులపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. కరోనా కారణంగా అమెరికాలో 47 మిలియన్ల (4.7 కోట్లు) మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఇటీవల ఓ స్టడీలో వెల్లడైంది. దీంతో నిరుద్యోగిత రేటు 32 శాతానికి చేరుకోవచ్చునని సెయింట్ లూయీస్ ఫెడ్ అంచనా వేసింది.

వారికి ప్రమాదమే..

వారికి ప్రమాదమే..

ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలోని పలు కంపెనీల్లో పని చేస్తోన్న ఫుల్ టైమ్ ఉద్యోగులకు కూడా భద్రత ఉండకపోవచ్చుననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, ఆఫిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు మాత్రం ఉద్యోగుల తొలగింపు ఉండదని స్పష్టం చేశాయి. భారతీయుల్లో కొంతమంది అమెరికా నుండి బయటపడితే చాలనుకుంటున్నారు. ఇంకొంతమంది గడువు పొడిగించాలని కోరుతున్నారు. మరికొంతమంది ఉద్యోగాలు పోయినా గడువు పెంచాలని అంటున్నారు.

English summary

Will more US jobs be lost as coronavirus spreads?

More than 3 million Americans had filed a claim for unemployment benefits the previous week, investors have turned their focus to Friday, when the US unemployment report for March is set to be released.
Story first published: Thursday, April 2, 2020, 15:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X