For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేతనం, నైపుణ్యానికి 'అమెరికా' పట్టం: అమెరికా, చైనా వాళ్లే ఎక్కువ

|

వాషింగ్టన్: H1B వీసాల ఎంపిక విధానంలో కొత్త సవరణలు తీసుకురానుంది అమెరికా ప్రభుత్వం. ఇందుకు వీలుగా నిబంధనల్లో తుది సవరణలు చేపట్టనుంది. తద్వారా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు హెచ్1బీ జారీకి ఇప్పటి వరకు అనుసరిస్తున్న లాటరీ విధానానికి స్వస్తీ చెప్పే యోచనలో ఉన్నట్లు తెలిపింది. వీసాల జారీ కోసం వేతనాలు, నైపుణ్యస్థాయిల ఆధారంగా వీసాలు జారీ చేసేలా కొత్త ప్రామాణికాలను అమలు చేయాలని అధికారంలోకి రానున్న జోబైడెన్ భావిస్తున్నారు. హెచ్1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో మార్పులు తీసుకు వస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురువారం తెలిపింది.

ట్రంప్‌కు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ షాక్, ఆ 3 చైనా కంపెనీలకు భారీ ఊరటట్రంప్‌కు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ షాక్, ఆ 3 చైనా కంపెనీలకు భారీ ఊరట

భారత్, చైనా ఉద్యోగులే ఎక్కువ

భారత్, చైనా ఉద్యోగులే ఎక్కువ

అమెరికా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు కేవలం ఎంతో నైపుణ్యం ఉన్న విదేశీ వర్కర్లే ఈ వీసాల వల్ల ప్రయోజనం పొందే ఉద్దేశ్యంతో ఈ మార్పులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నేడు ఇందుకు సంబంధించిన తుది నిబంధనను ఫెడరల్ రిజిస్టర్‌లో పబ్లిష్ చేస్తారు. అనంతరం 60 రోజులకు ఇది అమలులోకి వస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి మళ్లీ హెచ్1బీ వీసా ఫైలింగ్ సీజన్ ప్రారంభమవుతుంది.

హెచ్1బీ వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. అమెరికా కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది మంది విదేశీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి. ముఖ్యంగా ఇండియా, చైనా నుండి ఏటా వేలాది హెచ్1బీ వీసాలు జారీ అవుతాయి. వీసా జారీ ప్రక్రియ మార్పు వల్ల కంపెనీలు మరింత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను భారీగా వేతనాలు చెల్లించి తీసుకోవాల్సి వస్తుంది.

విదేశీ విద్యార్థులకు లబ్ధి

విదేశీ విద్యార్థులకు లబ్ధి

ప్రతి ఏడాది జారీ చేసే హెచ్1బీ వీసాల‌పై అమెరికా పరిమితి విధించింది. యూఎస్‌సీఐఎస్ ఏడాదికి గ‌రిష్ఠంగా 65 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ STEM స‌బ్జెక్టుల్లో అమెరికా యూనివ‌ర్సిటీలో ఉన్నత చ‌దువులు పూర్తి చేసిన విదేశీ విద్యార్థుల‌కు అద‌నంగా 20 వేల హెచ్1బీ వీసాల‌ను జారీ చేస్తారు. హెచ్1బీ వీసాలో తాజా మార్పుల ద్వారా ఉద్యోగులకు ఆర్థికపరమైన రక్షణ కల్పించేందుకు వీలు చిక్కనుంది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

మెరుగైన సేవలు

మెరుగైన సేవలు

భారత్, చైనా తదితర దేశాల నుండి ఐటీ నిపుణులను ఎంపిక చేసుకోవడం ద్వారా మరింత మెరుగైన సర్వీసులను అందించేందుకు అమెరికా కంపెనీలు ప్రయత్నిస్తాయి. అధిక వేతనాలు ఇచ్చే కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రస్తుత లాటరీ విధానం ద్వారా నైపుణ్యం కలిగిన ఉద్యోగుల ఎంపికలో కంపెనీలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పుడు అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఎంపిక చేసుకోవచ్చు.

English summary

వేతనం, నైపుణ్యానికి 'అమెరికా' పట్టం: అమెరికా, చైనా వాళ్లే ఎక్కువ | US to modify H1B visa selection process, to give priority to wages, skill level

The US Department of Homeland Security has published a final rule in the Federal Register to make changes to the H-1B visa process, a move that will impact how the visa lottery is carried out in March this year.
Story first published: Friday, January 8, 2021, 14:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X