పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడుల తర్వాత ప్రపంచమంతా ఉలిక్కిపడింది. అయితే ప్రపంచ దేశాలు ఈ దాడులపై రియాక్ట్ అవుతుంటే చైనా మాత్రం సంయమనాన్ని పాటిస్తోంది. దాడులను ఖండిస్తూ కాల్పుల విరమణ పిలుపునిస్తోంది. దీని వెనుక అనేక ప్రధాన కారణాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా చమురు సరఫరా చైనాకు చాలా అవసరం. అది లేకుంటే చైనాలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయే ప్రమాదం ఉంది.
యుద్ధ వాతావరణంలో చైనా-ఇరాన్ మధ్య ఉన్న లోతైన ఇంధన సంబంధాలు ఒక్కసారిగా అంతర్జాతీయ చర్చకు కేంద్రంగా మారాయి. ఈ పరిణామాలు చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన చమురు సరఫరా మార్గాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అందుకే ఈ సంక్షోభం బీజింగ్‌కు దూరమైనది కాకుండా..ప్రత్యక్ష ఆర్థిక ప్రభావాలను కలిగించే అంశంగా మారింది. ఈ పరిస్థితుల మధ్య బీజింగ్ అధికారికంగా ఈ దాడులను ఖండిస్తూ, తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది.

అయితే, ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తూ ఇంధన ప్రవాహాలను ప్రమాదంలో పడేసే ఆర్థిక లేదా రాజకీయ ప్రతీకార చర్యలకు మాత్రం చైనా దూరంగా ఉంది. ఈ నిశ్శబ్దం వెనుక గల వ్యూహాత్మక లెక్కలే ఇప్పుడు విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఫిబ్రవరి 28న తెల్లవారుజామునకు ముందు.. అమెరికా - ఇజ్రాయెల్ కలిసి టెహ్రాన్, ఇస్ఫహాన్, కోమ్ ప్రాంతాల్లోని ఇరానియన్ అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, కీలక నాయకత్వ స్థావరాలపై సమన్వయ దాడులు చేపట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్‌ను "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ"గా పేర్కొంటూ.. దీన్ని నిర్ణయాత్మక దెబ్బగా అభివర్ణించారు. అణు చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి.
ఇదే సమయంలో ఇజ్రాయెల్ చేపట్టిన "రోరింగ్ లయన్" ఆపరేషన్, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను, సీనియర్ కమాండ్ వ్యవస్థను బలహీనపరచడంపై దృష్టి సారించింది. దీనికి ప్రతిగా ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు UAE, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు నిర్వహించింది. దుబాయ్‌లో పేలుళ్లు చోటుచేసుకున్నట్లు నివేదికలు రావడంతో, గల్ఫ్ ప్రాంతమంతా విమాన రాకపోకలు, ప్రయాణాలు అంతరాయానికి గురయ్యాయి.
ఈ సంక్షోభం చైనాకు అత్యంత సున్నితమైన అంశంగా మారడానికి కారణం ఇంధన ఆధారిత వాస్తవాలు. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 80 శాతానికి పైగా చైనా కొనుగోలు చేస్తోంది. 2025 నాటికి ఇది రోజుకు సుమారు 1.38 మిలియన్ బ్యారెళ్లకు చేరింది. ఇది చైనా మొత్తం సముద్ర మార్గ చమురు దిగుమతుల్లో 13 నుంచి 14 శాతం వరకు ఉంటుంది. అయితే China ప్రధాన సరఫరాదారులు రష్యా, సౌదీ అరేబియానే. సంక్షోభం పెరిగిన తర్వాత, చైనా రిఫైనరీలు నిశ్శబ్దంగా ఇరానియన్ కొనుగోళ్లను తగ్గించి, తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ చమురుపై ఆధారాన్ని పెంచుకున్నాయి.
అవెల్లాన్ ఇంటెలిజెన్స్ సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణన్ అభిప్రాయం ప్రకారం.. ఇరాన్ చేపట్టిన ప్రతీకార చర్యలు చారిత్రాత్మక వ్యూహాత్మక తప్పిదంగా తెలిపారు. గల్ఫ్ అరబ్ దేశాల్లోని అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, ఇరాన్ సంభావ్య తటస్థ దేశాలను కూడా దూరం చేసుకుందని ఆయన అంటున్నారు. దీని వల్ల ఇరాన్ దౌత్య స్థలం తగ్గిపోయి, ఈ ప్రాంతంలో చైనా సమతుల్య విధానం మరింత క్లిష్టమైంది.
చైనాకు అత్యంత పెద్ద ప్రమాదం హార్ముజ్ జలసంధి. చైనా చమురు దిగుమతుల్లో దాదాపు 44 శాతం మధ్యప్రాచ్యం నుంచే వస్తున్నాయి. ఈ మార్గంలో తీవ్ర అంతరాయం ఏర్పడితే, చమురు ధరలు బ్యారెల్‌కు 100 నుంచి 130 డాలర్లకు చేరవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చైనా పారిశ్రామిక రంగం, ఆర్థిక వృద్ధిపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇరాన్‌కు చైనా అవసరం ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు దౌత్యపరమైన అండగా కనిపిస్తూనే.. తన సొంత ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలగకుండా రష్యా, ఇతర గల్ఫ్ దేశాల నుండి చమురును పెంచుకుంటూ సమతుల్యతను పాటిస్తోంది.
More From GoodReturns

యుద్దంపై ఇరాన్ కీలక ప్రకటన.. భారీ సైనిక దాడులు చేస్తామంటున్న ట్రంప్.. అసలేం జరుగుతోంది..

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎంతో దూరంలో లేదు.. బ్లాక్‌రాక్ అధినేత సంచలన వ్యాఖ్యలు.. కారణం ఏంటంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications