అమెరికా కలలు కంటున్న వారందరికీ ఇది నిజంగా గుడ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంత తెంపరితనం చూపినా ... ఆ దేశానికి వచ్చే అత్యంత నైపుణ్యం కలిగిన విదేశి నిపుణులు తమ కళల స్వర్గానికి చేరుకొనే సంఖ్య తగ్గటం లేదు. ఎన్ని కఠినతర నిబంధనలు విధించినా... వాటన్నిటినీ దాటుకొని అమెరికా లో కొలువు సంపాదిస్తున్నారు విదేశి నిపుణులు. ఇందులో భారతీయ నిపుణులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. అమెరికాలో ఎక్కువ కాలం పనిచేసేందుకు అనుమతించే హెచ్ 1బి సాధించటం ఆశా మాషీ వ్యవహారం కాదు. ఇది ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఐన తర్వాత మరింత కఠినం అయిపోయింది.
కానీ అగ్ర రాజ్యానికి నిపుణుల కొరత అధికంగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితిలో కఠిన నిబంధనలు విధించి హెచ్ 1 బి వీసాలను జారీ చేస్తున్నారు. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన నిపుణులు ట్రంప్ నిర్ణయాలతో ఆందోళన చెందారు. కానీ అధికారిక గణాంకాల ప్రకారం ... 2019 లో హెచ్ 1 బి వీసాల జారీ ఊహించిన దానికంటే అధికంగా ఉంది. దీంతో మన దేశానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకొంటున్నారు. ఈ మేరకు ది టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఒక కథనం ప్రచురితమైంది.

3.89 లక్షల వీసాలు...
హెచ్ 1 బి వీసాల జారీ ప్రక్రియ 2015 నుంచి కఠినతరం ఐంది. ప్రతి ఏడాది ఎదో ఒక కొత్త నిబంధనతో డోనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ అభ్యర్థులకు చుక్కలు చూపింది. అయినప్పటికీ ... 2019 ఆర్థిక సంవత్సరంలో మంజూరు ఐన హెచ్ 1 బి వీసాల సంఖ్య ఏకంగా 3.89 లక్షలకు పెరిగింది. 2018 ఆర్థిక సంవత్సరం లో అమెరికా 3.35 లక్షల వీసాలు జారీ చేసింది. ట్రంప్ అధ్యక్షుడు ఐన కొత్తలో 2015 లో హెచ్ 1 బి వీసాల సంఖ్య కేవలం 2.88 లక్షలు కావటం గమనార్హం. అంటే, ట్రంప్ ఎంతగా వద్దు అంటున్నా... గత నాలుగేళ్లలో హెచ్ 1 బి వీసాల సంఖ్య ఏకంగా 1 లక్షకు పైగా పెరగటం విశేషం. దీన్ని బట్టి చూస్తే అమెరికాకు పెద్ద సంఖ్యలో నిపుణుల అవసరం ఉంటోందని అర్థం అవుతోంది. కాబట్టి మన నిపుణులు పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదని తేలిపోయింది.

70% భారతీయులే...
హెచ్ 1 బి వీసాల మంజూరు లో భారతీయ నిపుణుల వాటా చాలా అధికం. కొన్నేళ్ల నుంచి మన సాఫ్ట్ వేర్ నిపుణులు మొత్తం మంజూరు అయ్యే వీసాల్లో సింహ భాగం ఆక్రమిస్తున్నారు. గతేడాది జారీ చేసిన హెచ్ 1 బి వీసాల్లో భారతీయుల వాటా 70% కావటం విశేషం. అంటే ప్రతి 100 అనుమతి పొందిన వీసాల్లో 70 వీసాలు భారతీయులకే వస్తున్నాయి. మన తర్వాతి స్థానంలో చైనా వాళ్ళు ఉంటున్నారు. కాగా, 2019 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికా ప్రభుత్వం ఏ దేశ పౌరులకు ఎన్ని వీసాలు మంజూరు చేసిందో వెల్లడించలేదు. కానీ గతంలో సగటున మనవాళ్ళు 70% వాటాతో మిగిలిన వారికి అందనంత దూరంలో ఉంటున్నారు.

స్థానిక కొలువులు...
డోనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత భారత సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. తప్పనిసరిగా స్థానికంగా కొంత మంది నిపుణులకు కొలువులు ఇవ్వాల్సిందేనని అమెరికా హుకుం జారీ చేసింది. దీంతో ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి బడా కంపెనీలు అన్నీ అమెరికన్లకు గతంలో కంటే అధికంగా ఉద్యోగాలు కల్పించాయి. దీంతో 2019 లో ఇండియన్ కంపెనీలు అప్లై చేసిన హెచ్ 1 బి వీసాల సంఖ్య కాస్త తగ్గి ఉండవచ్చు అని ఇమ్మిగ్రేషన్ సేవలు అందించే ఏజెన్సీ లు అభిప్రాయపడుతున్నాయి. అయితే, దీనిపై అమెరికా ప్రభుత్వం గణాంకాలు వెల్లడిస్తే గానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. సహజంగా ఐటీ కంపెనీలకు స్థానికంగా ఎక్కువ మందిని నియమించినా ... మన నిపుణుల అవసరం కూడా అధికంగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అధిక నైపుణ్యం ఉంటేనే...
గతంలో హెచ్ 1 బి వీసాల జారీ కాస్త సులువుగా ఉండేదని చెప్పాలి. అమెరికా గ్రాడ్యుయేషన్ కు సరిపడే డిగ్రీ కలిగిన వారిని ఒక కంపెనీ స్పాన్సర్ చేసి దీనికోసం దరఖాస్తు చేసేది. అప్లికేషన్ రుసుము కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత డిగ్రీతో పాటు సదరు ఉద్యోగి నైపుణ్యం స్థాయి ని కూడా పరిగణన లోకి తీసుకొంటున్నారు. ఆయా రంగంలో సదరు ఉద్యోగి ఏ స్థాయిలో నిపుణుడో, అతన్ని అమెరికాకు రప్పించటం ఎంత వరకు అవసరమో సంబంధిత కంపెనీ వివరించాల్సి ఉంటుంది. అలాగే, హెచ్ 1 బి దరఖాస్తు రుసుములు కూడా బాగా పెరిగాయి. దీంతో, అధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగులను మాత్రమే కంపెనీలు ఇందుకోసం పరిగణిస్తున్నాయి. కేవలం ఒక ఆన్ సైట్ ప్రాజెక్టు లో చూపించేందుకు పంపించే ఉద్యోగులను తగ్గించేశాయి. పెరిగిన దరఖాస్తు రుసుము, తీక్షణ పరిశీలనతో కంపెనీలు పునరాలోచనలో పడిపోయాయి. అంత ఖర్చు చేసి ఒక ఉద్యోగిని అమెరికాకు పంపితే అంతకు రెట్టింపు స్థాయిలో ప్రయోజనం ఉంటేనే కంపెనీలు హెచ్ 1 బి కి దరఖాస్తు చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా... మన వాళ్లకు ఎక్కువ సంఖ్యలో హెచ్ 1 బి వీసాలు వస్తున్నాయి. అదే పది వేలు. మీరేమంటారు?
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications