For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

7.9 శాతంతో 40 ఏళ్ల గరిష్టానికి అమెరికా ద్రవ్యోల్భణం

|

గ్యాసోలైన్, పుడ్ అండ్ హౌసింగ్ కాస్ట్స్ భారీగా పెరిగిన కారణంగా అమెరికా ద్రవ్యోల్భణం ఫిబ్రవరి నెలలో నలభై ఏళ్ల గరిష్టం 7.9 శాతానికి చేరుకున్నది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత పదిహేను రోజులుగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే చమురు ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి ముందే అంటే ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్భణం నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరింది.

2022 జనవరి నెలలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) జనవరి నెలలో ఏడాది ప్రాతిపదికన 7.5 శాతానికి చేరుకోగా, ఫిబ్రవరి నెలలో 7.9 శాతానికి పెరిగింది. గ్యాసోలైన్, ఫుడ్, షెల్టర్ కాస్ట్స్ పెరగడంతో ద్రవ్యోల్భణం పెరిగింది. అమెరికా ద్రవ్యోల్భణం ఏ ఫిబ్రవరి నెలకు ఇది గరిష్టంగా అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మాస్కో ఇంధన దిగుమతులపై బిడెన్ నిషేధం, చమురు సరఫరాను మరింత కఠినతరం చేసింది.

US inflation hits 40 year high of 7.9% on rising fuel and food costs

ద్రవ్యోల్భణం మరికొన్ని నెలలు తగ్గే అవకాశం లేదని అంటున్నారు. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో, ఆంక్షల ప్రభావం ఏ మేరకు, ఎంతకాలం ఉంటుందో చూడాలని అంటున్నారు. మరోవైపు, అమెరికాలో వీక్లీ జాబ్‌లెస్ క్లెయిమ్స్ కూడా ఇటీవల పెరుగుతున్నాయి. ద్రవ్యోల్భణం పెరుగుతున్నా కొద్ది ఇవి పెరుగుతున్నాయి.

English summary

7.9 శాతంతో 40 ఏళ్ల గరిష్టానికి అమెరికా ద్రవ్యోల్భణం | US inflation hits 40 year high of 7.9% on rising fuel and food costs

U.S. consumer price gains accelerated in February to a fresh 40-year high on rising gasoline, food and housing costs, with inflation poised to rise even further following Russia’s invasion of Ukraine.
Story first published: Friday, March 11, 2022, 15:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X