అమెరికాకు 29 ట్రిలియన్ డాలర్ల అప్పులు ఉన్నట్లు ఆ దేశ చట్టసభ్యుడు వెల్లడించారు. ఇందులో భారత్‌కు రుణపడి ఉన్న మొత్తం 216 బిలియన్ డాలర్లుగా వెల్లడించారు. అమెరికా అప్పులు రోజురోజు పెరిగిపోతున్నాయని ఆ దేశ చట్టసభ సభ్యులు అలెక్స్ మూనీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇందులోను అధిక శాతం అప్పులు తమకు (అమెరికా) సవాల్‌గా మారిన చైనా నుండి ఎక్కువగా ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. 2020 నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, అంటే దేశంలో ఒక్కొక్కరిపై 72,309 డాలర్ల అప్పు ఉన్నట్లు తెలిపారు.

స్నేహంగా లేని చైనా, జపాన్‌కు ఎక్కువ
అమెరికా అప్పులు ఎక్కువగా చైనా, ఆ తర్వాత జపాన్ నుండి ఉన్నట్లు మూనీ తెలిపారు. రుణాలు 29 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో అమెరికన్ సిటిజన్ పైన తలసరి భారం భారీగా ఉంటుందని తెలిపారు. మనకు స్నేహంగా మెలగని జపాన్, చైనా.. ఈ రెండు దేశాలకు ఎక్కువగా అప్పులు ఉన్నట్లు అలెక్స్ మూనీ తెలిపారు. అంతర్జాతీయంగా చైనా నుండి మనకు తీవ్రమైన పోటీ నెలకొందని, వారికి అధిక రుణాలు ఉన్నామన్నారు. అ దేశానికి ట్రిలియన్ డాలర్లు, అలాగే జపాన్‌కు మరో 1 ట్రిలియన్ డాలర్ల రుణాలు ఉన్నట్లు తెలిపారు.

భారత్‌కు భారీ రుణం
భారత్‌కు 21,600 కోట్ల డాలర్లు (రూ.15 లక్షల కోట్లకు పైగా) బాకీ పడ్డామని గుర్తు చేశారు. గత ఏడాది కాలంలో తీసుకున్న అప్పును ఒక్కొక్కరికి పంచితే 10,000 డాలర్లు వస్తుందన్నారు. ఈ రుణాలు ఎక్కడికి వెళ్తున్నాయనే అంశానికి సంబంధించి తప్పుడు సమాచారం ఉందన్నారు. అమెరికా మిత్రదేశాలు కానీ చైనా, జపాన్‌కే ఎక్కువ రుణపడి ఉన్నట్లు తెలిపారు. ఈ రిపబ్లికన్ సెనేటర్ వెస్ట్ వర్జీనియా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరోనా ఊరటగా జో బిడెన్ ప్రభుత్వం ప్రకటించిన 1.9 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని వ్యతిరేకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒబామా హయాంలో రెండింతలు
2000లో 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా అప్పు ఒబామా హయాంలో రెండింతలైంది. దీనిని నిత్యం పెంచుతూ పోతున్నామని, దీంతో జీడీపీలో అప్పుల నిష్పత్తి నియంత్రణలో లేకుండా పోతోందన్నారు. ఇలాంటి సమయంలో కొత్త ఉద్దీపన పథకాన్ని ఆమోదించే ముందు వీటిని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఈ పథకంలో చాలా నిధులు కరోనా ఉపశమన పథకాలకు వెళ్లవని అనుమానం వ్యక్తం చేశారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications