For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిభ ఆధారిత..: అతికీలక నిర్ణయం దిశగా ట్రంప్ అడుగు, భారతీయులపై ప్రభావం!

|

వాషింగ్టన్: డిసెంబర్ వరకు హెచ్1బీ, ఆ తరహా వీసాలను నిషేధించిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ తీసుకు వచ్చే అంశంపై దృష్టి సారించారని వైట్ హౌస్ తెలిపింది. ఈ ప్రతిభ ఆధారిత వలస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకు వస్తే నష్టపోయే విదేశీయుల్లో భారతీయ సంతతి పిల్లలు ఎక్కువగా ఉంటారు.

కరోనా నేపథ్యంలో అమెరికా యువతకు ఉద్యోగాలు కల్పించే క్రమంలో ఈ ఏఢాది చివరి వరకు వీసాలను బ్యాన్ చేశారు. గ్రీన్ కార్డుల జారీని నిలిపేశారు. ఇటీవల ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించే యూనివర్సిటీల్లోని విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలని సూచించారు. ఇప్పుడు మరో వలస విధానంపై గురి పెట్టారు.

ట్రంప్ దెబ్బ, ఇండియన్ ఐటీ కంపెనీలకు రూ.1,200 కోట్ల భారం

DACA ప్రోగ్రాంకు స్వస్తీ పలకనుందా?

DACA ప్రోగ్రాంకు స్వస్తీ పలకనుందా?

అంతకుముందు ప్రభుత్వాల వలస విధానాలపై ట్రంప్ మొదటి నుండి వ్యతిరేకతతో ఉన్నారు. వాటిని మార్చివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం (DACA)ను తీసుకు వచ్చింది. దీనికి ట్రంప్ పరిపాలనా విభాగం స్వస్తీ పలకనుంది. ఇందుకు సంబంధించి త్వరలో సమగ్ర వలస విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు శ్వేతసౌధం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్థానికుల ఉపాధి అవకాశాలను కాపాడటం కోసం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతకుముందు పటిష్టమైన, కీలకమైన బిల్లును తీసుకు వస్తున్నామని, ప్రతిభ ఆధారిత వలస విధానం రానుందని, అందులో DACA కూడా భాగం కానుందని, దీంతో ప్రస్తుతం DACAకింద లబ్ధిపొందుతున్న వారికి పౌరసత్వం కల్పించానికి వెసులుబాటు కలుగుతుందని, ఈ బిల్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని వైట్ హౌస్ ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపింది.

పేరెంట్స్‌తో వచ్చిన పిల్లల రక్షణ కోసం..

పేరెంట్స్‌తో వచ్చిన పిల్లల రక్షణ కోసం..

చిన్నతనంలోనే తల్లిదండ్రులతో వచ్చి, చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారికి ప్రభుత్వపరమైన రక్షణ కోసం DACA ఈ పథకాన్ని తీసుకు వచ్చారు. దీనిని రద్దు చేసే కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికే ఈ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేయగా, దీనిని అమెరికా అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. దీంతో ఆయన మరో కొత్త విధానంతో ముందుకు రాబోతున్నారు. ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయనున్నట్లు ట్రంప్ స్వయంగా చెప్పారు. అందులో DACA భాగం కానుందన్నారు. అంతిమంగా ఈ ప్రోగ్రాంకు స్వస్తీ పలకడమే లక్ష్యం.

భారతీయులపై ఎక్కువ ప్రభావం

భారతీయులపై ఎక్కువ ప్రభావం

అమెరికాకు వెళ్లిన విదేశీయులతో పాటు వారి పిల్లలకు ఆ దేశంలో స్వేచ్ఛగా నివసించేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2012లో ఒబామా హయాంలో దీనిని తీసుకు వచ్చారు. ఇప్పుడు దీనిని రద్దు చేయడం ద్వారా ఎక్కువ ప్రభావం భారతీయుల పైన పడనుంది. అలా వెళ్లిన విదేశీయుల్లో ఆరున్నర లక్షల నుండి 7 లక్షల మంది వరకు వరకు ఉంటారు. వీరిని డ్రీమర్స్ అంటారు. ఇందులో ఆసియా దేశాలవారు ఎక్కువ. అందులోను భారతీయులు మరీ ఎక్కువ. కాబట్టి ఆ ప్రభావం మన వారిపై ఎక్కువగా ఉంటుంది.

చర్చకు ట్రంప్ సిద్ధమంటూ..

చర్చకు ట్రంప్ సిద్ధమంటూ..

ఈ అంశంపై చట్టపరమైన పరిష్కారం చూపే దిశగా కాంగ్రెస్ సభ్యులతో సంప్రదింపులకు తాము సిద్ధమని ట్రంప్ ఇదివరకే చెప్పారు. డీఏసీఏతో పాటు సరిహద్దు భద్రత, శాశ్వత ప్రతిభ ఆధారిత వలస విధాన సంస్కరణలపై చర్చించేందుకు ట్రంప్ మొదటి నుండి ఆసక్తిగా ఉన్నారు.

English summary

Trump working on merit based immigration order and DACA

The White House on Friday said President Donald Trump was working on an executive order to establish a merit-based immigration system and offer a path to citizenship to undocumented immigrants brought to the United States as children, without offering them amnesty.
Company Search
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more