For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌ను అనుసరించండి: టిక్‌టాక్ సహా చైనీస్ యాప్స్‌కు ట్రంప్ షాక్!!

|

సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో సెక్యూరిటీ రీజన్స్‌తో కేంద్ర ప్రభుత్వం ఇటీవల 59 చైనా యాప్స్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. టిక్ టాక్ సహా భారత్ డ్రాగన్ దేశానికి చెందిన వివిధ కంపెనీల యాప్స్‌ను నిషేధించినట్లు అమెరికా కూడా నిషేధించాలని అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికాన్ కాంగ్రెస్ సభ్యులు కొందరు లేఖ రాశారు.

ప్రపంచానికి, భారత్‌కు సూపర్ న్యూస్! చైనా ఆర్థిక వ్యవస్థ జూమ్... అక్కడే డౌట్ప్రపంచానికి, భారత్‌కు సూపర్ న్యూస్! చైనా ఆర్థిక వ్యవస్థ జూమ్... అక్కడే డౌట్

భారత్ మార్గంలో నడవండి

భారత్ మార్గంలో నడవండి

కఠిన నిర్ణయాలు తీసుకొని భారత్ చూపిన బాటలో నడవాలని ఆ లేఖలో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కోరారు. అమెరికన్ పౌరుల సమాచారం బయటకు వెళ్లకుండా, వారి గోప్యత, భద్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జూలై 15వ తేదీన 24 మంది సభ్యులు ట్రంప్‌కు రాసిన లేఖపై సంతకాలు చేశారు. దేశ భద్రత కోసం టిక్ టాక్ సహా పలు చైనాకు చెందిన సంస్థల యాప్స్ నిషేధించాలని, సామాజిక మాధ్యమాలను కూడా నిషేధించాలని కోరారు.

చైనా యాప్స్, సోషల్ మీడియాను విశ్వసించలేం

చైనా యాప్స్, సోషల్ మీడియాను విశ్వసించలేం

భారత్ యూజర్ల డేటాతో పాటు అనేక దేశాల యూజర్ల సమాచారాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ తస్కరిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. అమెరికా పౌరుల స్వేచ్ఛ, భద్రత, సమాచార గోప్యతను కాపాడేందుకు చైనా అనుబంధ యాప్స్, సోషల్ మీడియాను విశ్వసించకూడదని కోరాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థీకృత గూఢచర్యాన్ని అడ్డుకోవాలని సూచించారు. జాతీయ భద్రతకు విఘాతం కలగకుండా చూసుకోవాలన్నారు. అమెరికా మార్కెట్లో చైనా యాప్స్ నిషేధానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఈ యాప్స్ ఉపయోగిస్తే..

ఈ యాప్స్ ఉపయోగిస్తే..

టిక్ టాక్ వంటి చైనీస్ యాప్స్ ఉపయోగించినప్పుడు మీ ఐపీ అడ్రస్, జియో లొకేషన్ సంబంధిత డేటా, బ్రౌజర్, సెర్చ్ హిస్టరీ వంటి వాటిని తెలుసుకునే వెసులుబాటు ఉందని, ప్రైవసీ పాలసీలోను ఇది ఉందని వెల్లడించారు. చైనా కంపెనీ నిబంధనల ప్రకారం కంపెనీ గోప్యతలు డ్రాగన్ ప్రభుత్వానికి వెల్లడించేలా ఉంటాయని తెలిపారు. కాగా, ఇప్పటికే యూఎస్ నేవీ టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేసింది. చైనా యాప్స్ బ్యాన్ ట్రంప్ ఆలోచన కూడా. ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులే లేఖ రాశారు. కాబట్టి ఆ దిశగా అడుగులు పడుతాయని భావిస్తున్నారు.

English summary

భారత్‌ను అనుసరించండి: టిక్‌టాక్ సహా చైనీస్ యాప్స్‌కు ట్రంప్ షాక్!! | Trump urged to ban TikTok, other Chinese apps

A group of 24 influential Republican Congressmen urged US President Donald Trump on Wednesday to ban TikTok and other Chinese mobile applications, stating that India has taken the extraordinary step of banning 60 Chinese-affiliated apps due to national security concerns.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X