For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు కంపెనీలతో 'గ్లోబల్': టిక్‌టాక్‌కు ట్రంప్ మరింత గడువు, ఎందుకంటే?

|

న్యూయార్క్: చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌కు తాత్కాలిక ఊరట. టిక్‌టాక్‌పై అమెరికా విధించిన నిషేధాన్ని వారం రోజుల పాటు వాయిదా వేశారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈ నిషేధం పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. టిక్‌టాక్ కార్యకలాపాలు అమెరికాలో కొనసాగేలా స్థానిక దిగ్గజ కంపెనీలతో కలిసి బైట్ డ్యాన్స్ ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. అంతేకాదు, అలాంటి ఒప్పందానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ కూడా ప్రకటించడం గమనార్హం.

రూ.2,000 నోట్ల ప్రింటింగ్ నిలిపివేత, ప్రభుత్వం క్లారిటీరూ.2,000 నోట్ల ప్రింటింగ్ నిలిపివేత, ప్రభుత్వం క్లారిటీ

అందుకే ట్రంప్ గడువు

అందుకే ట్రంప్ గడువు

టిక్‌టాక్, ఒరాకిల్, వాల్‌మార్ట్ మధ్య ఈ ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమోదముద్ర వేశారు. వీరి మధ్య చర్చల నేపథ్యంలో వారం రోజుల గడువును పొడిగించారు. భద్రతా కారణాలతో టిక్‌టాక్ సహా వందకు పైగా చైనీస్ యాప్స్‌ను భారత్ నిషేధించింది. అమెరికా కూడా ఆ దిశలోనే అడుగు వేసింది. అయితే టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీలు తీసుకుంటే అభ్యంతరం లేదని ట్రంప్ చెప్పారు. ఒరాకిల్, వాల్‌మార్ట్ కంపెనీలు వాటాలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడంతో ట్రంప్ గడువు ఇచ్చారు. ఇప్పటికే టిక్‌టాక్ తమ సాంకేతిక భాగస్వామిగా ఒరాకిల్, వాల్‌మార్ట్‌ను ఎంచుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.

ఒరాకిల్, వాల్‌మార్ట్, బైట్‌డ్యాన్స్ కొత్త సంస్థ టిక్‌టాక్ గ్లోబల్

ఒరాకిల్, వాల్‌మార్ట్, బైట్‌డ్యాన్స్ కొత్త సంస్థ టిక్‌టాక్ గ్లోబల్

టిక్‌టాక్, వీచాట్ యాప్స్ అమెరికా సంస్థల చేతికి రాకుంటే వాటిపై నిషేధం సెప్టెంబర్ 20వ తేదీ నుండి అమల్లోకి రావాల్సింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన ట్రంప్ సంతకాలు కూడా చేశారు. అయితే ఒప్పందం ముందుకు కదలడంతో గడువును ఈరోజు నుండి సెప్టెంబర్ 27వ తేదీ వరకు పెంచారు. టిక్‌టాక్, ఒరాకిల్ మధ్య డీల్‌కు ప్రభుత్వం త్వరలో అధికారిక ఆమోదముద్ర వేయనుంది. ఒరాకిల్ వంటి కంపెనీతో ఒప్పందానికి ట్రంప్ కూడా గతంలోనే సూచన చేశారు. బైట్‌డ్యాన్స్, ఒరాకిల్, వాల్‌మార్ట్ కలిసి అమెరికాలో యాప్ కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. ఈ మూడు కంపెనీలు కలిపి టెక్సాస్ కేంద్రంగా టిక్‌టాక్ గ్లోబల్ అనే కొత్త సంస్థను నెలకొల్పుతున్నారని తెలుస్తోంది.

25వేల ఉద్యోగాలు.. వాటాలు ఎంతంటే

25వేల ఉద్యోగాలు.. వాటాలు ఎంతంటే

టిక్‌టాక్ గ్లోబల్‌తో 25వేల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. పౌరుల సమాచారానికి వంద శాతం భద్రత ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా వినియోగదారుల సమాచారాన్ని పూర్తిగా ఒరాకిల్ నిర్వహిస్తుంది. అమెరికా విదేశీ పెట్టుబడులను పర్యవేక్షించే కమిటీ నుండి అనుమతులు రాగానే టిక్‌టాక్ గ్లోబల్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపాయి. టిక్‌టాక్ గ్లోబల్‌లో 53 శాతం వాటా అమెరికా, 36 శాతం వాటా చైనా ఇన్వెస్టర్లకు ఉంటుంది. ప్రస్తుతం బైట్ డ్యాన్స్‌లో 40 శాతం వాటాలు అమెరికా ఇన్వెస్టర్ల చేతిలో ఉన్నాయి. బోర్డులో అమెరికా డైరెక్టర్లు ఎక్కువ.

English summary

మూడు కంపెనీలతో 'గ్లోబల్': టిక్‌టాక్‌కు ట్రంప్ మరింత గడువు, ఎందుకంటే? | Trump approves Tiktok oracle deal which include walmart

President Donald Trump said Saturday he has approved a deal in principle in which Oracle and Walmart will partner with the viral video-sharing app TikTok in the U.S., allowing the popular app to avoid a shutdown.
Story first published: Sunday, September 20, 2020, 12:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X