For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్నికలు: ట్రంప్‌ను సంతోషింపచేసిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో.. ఎలాగంటే?

|

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ 36 గంటల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన రెండు దేశాల మధ్య వాణిజ్యానికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందనేది అందరి మదిలోని ప్రశ్న. ట్రంప్ పర్యటన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై సానుకూల సంకేతాలులేవు. అయితే ఇప్పుడు కాకపోయినా ముందు ముందు భారీ వాణిజ్య ఒప్పందం తథ్యమని భావిస్తున్నారు. వాణిజ్య ఒప్పందం పక్కన పెడితే... భారత టెక్ కంపెనీలు ఎన్నికలకు ముందు ట్రంప్‌ను సంతోషింప చేశాయి. ఎలాగంటే...

ట్రంప్ పర్యటన: అమెరికా-భారత్ వాణిజ్య కథనాలు

పెరిగిన నిరుద్యోగం

పెరిగిన నిరుద్యోగం

అమెరికాలో ఎన్నికలకు ముందు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి టెక్ సంస్థలు చిన్న పట్టణాల్లో స్థానిక ఇంజినీర్లను నియమించుకుంది. దీంతో భారత ఐటీ పరిశ్రమ వృద్ధి సాధిస్తోందని చెబుతున్నారు. భారత్‌లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్న ట్రంప్.. ఎన్నికల్లో అమెరికన్-ఇండియన్స్ ఓట్ల కోసమే ఈ పర్యటన పెట్టుకున్నారనేది కొందరి అభిప్రాయం. అమెరికన్లకే ఉద్యోగాలు నినాదంతో ఆయన అగ్రరాజ్యం అధ్యక్షుడిగా అయ్యారు. అయితే అమెరికాలో నిరుద్యోగం మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది.

అమెరికాలో పెట్టుబడులు పెరిగాయి..

అమెరికాలో పెట్టుబడులు పెరిగాయి..

ఇండియన్ ఐటీ సేవల దిగ్గజాలకు షార్ట్ టర్మ్ నుండి మీడియం టర్మ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని అమెరికా ఆధారిత ఐటీ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ HFS రీసెర్చ్ సీఈవో ఫిల్ పెర్ష్ట్ వెల్లడించారు. గత కొంతకాలంగా ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి సంస్థలు అమెరికాలో తమ పెట్టుబడులను పెంచుకున్నాయి.

ట్రంప్‌కు అనుగుణంగా చర్యలు

ట్రంప్‌కు అనుగుణంగా చర్యలు

అమెరికన్లకే ఉద్యోగాలు అనేది ట్రంప్ ప్రధాన ఆయుధం. ట్రంప్ మరోసారి ఎన్నికైతే తమకు ఇబ్బందులు వస్తాయని ఇండియన్ ఐటీ కంపెనీలు ఆందోళన చెందాల్సిన అవసరం ప్రస్తుతం లేదని అంటున్నారు. ఎందుకంటే అందుకు తగిన విధంగా కంపెనీలు ముందుకు సాగాయి.

లోకల్ డెలివరీ కేంద్రాలు

లోకల్ డెలివరీ కేంద్రాలు

భారత ఐటీ సంస్థలు అమెరికాలోని ఇంజినీర్లతో లోకల్ డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఈ వ్యూహాలు తమకు అనుకూలంగా ఉన్నాయని టెక్ కంపెనీలు భావిస్తున్నాయి. కనెక్టికట్‌లోని హార్డ్‌ఫోర్డ్‌లో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఇటీవల HCL టెక్నాలజీస్ వెల్లడించింది.

అధిక వేతనాలు..

అధిక వేతనాలు..

ఇటీవలి మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. తమ అమెరికా ఉద్యోగులకు ఇండియన్ ఐటీ సేవల కంపెనీలు.. అమెరికాకు చెందిన ఐటీ కంపెనీల కంటే ఎక్కువ వేతనాలు అందిస్తున్నాయి. ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రకారం ఇండియన్ ఐటీ కంపెనీలు తమ స్టాఫ్‌కు అమెరికా కంపెనీలు ఇచ్చే సగటు వేతనం ఎక్కువగానే ఉందని తేలినట్లుగా వార్తలు వచ్చాయి. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా, లోకల్ డెలివరీ కేంద్రాల ఏర్పాటు ద్వారా, అధిక వేతనాల ద్వారా ఇండియన్ ఐటీ కంపెనీలు ట్రంప్‌కు అనుగుణంగా నడుచుకున్నాయని చెప్పవచ్చు.

English summary

ఎన్నికలు: ట్రంప్‌ను సంతోషింపచేసిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో.. ఎలాగంటే? | TCS, Infosys and Wipro kept Donald Trump happy in election year

In a year when the US is going to the polls, India’s IT services industry will see business grow as it has hired local engineers in small towns to meet requirements of clients whose businesses are getting disrupted by technology, analysts have said.
Story first published: Monday, February 24, 2020, 10:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X