For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్యాపై అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ కరెన్సీగా రూపాయికి ఛాన్స్

|

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఐరోపా సహా వివిధ దేశాలు మాస్కో పైన ఆంక్షలు విధించాయి. ఐరోపా దేశాలు స్విఫ్ట్ సిస్టం నుండి తొలగించాయి. గతంలోనే రష్యా తన రూబుల్ అంతర్జాతీయీకరణపై దృష్టి సారించింది. ఇప్పుడు ఉక్రెయిన్‌తో పోరు నేపథ్యంలో అమెరికా, ఐరోపా ఆంక్షల కారణంగా రష్యా వివిధ దేశాలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడింది. ఇది భారత్‌కు లాభించనుంది.

పాశ్చాత్య దేశాల ఆంక్షలను అధిగమించేందుకు రూపాయి-రూబుల్ లేదా రూబుల్ యువాన్ వాణిజ్యాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది భారత కరెన్సీ అంతర్జాతీయీకరణకు అవకాశంగా మారుతుందని ఎస్బీఐ నివేదిక తెలిపింది. ఇప్పటికే డాలర్‌కు ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచం అన్వేషిస్తోందని, రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారడానికి ఇది సరైన సమయమని ఈ నివేదిక తెలిపింది.

రూబుల్-రూపాయి, రూబుల్-యువాన్

రూబుల్-రూపాయి, రూబుల్-యువాన్

అంతర్జాతీయీకరణ అంటే ఒక కరెన్సీని రెసిడెంట్, నాన్-రెసిడెంట్స్ ఈజీగా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ప్రపంచ వాణిజ్యం కోసం రిజర్వ్ కరెన్సీగా ఉపయోగించవచ్చు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే అమెరికా కరెన్సీ డాలర్ ఆధిపత్యం మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగవచ్చు. అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలుదేశాలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి.

ప్రస్తుతం రష్యాపై ఆంక్షల నేపథ్యంలో మాస్కో యువాన్ - రూబుల్ లేదా రూపాయి-రూబుల్ కోసం బ్యాక్ డోర్ చర్చలు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంతో చెల్లింపులు చేసే అంశాన్ని కూడా కొంతమంది ప్రతిపాదిస్తున్నట్లు ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు.

మాస్కో ఇబ్బంది.. రూపాయికి అవకాశం

మాస్కో ఇబ్బంది.. రూపాయికి అవకాశం

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు రూపాయి అంతర్జాతీయీకరణ ఆలోచనకు అడుగులు పడేలా చేసిందని ఈ నివేదిక అభిప్రాయపడింది. ప్రత్యామ్నాయ చెల్లింపు, పరిష్కార విధానాలను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని కూడా వెల్లడి చేస్తోందని తెలిపింది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే పట్టుకోవాలని పేర్కొంటూ, ప్రస్తుత పరిస్థితుల్లోను రూపాయి అంతర్జాతీయీకరణపై అడుగు పడాలని అభిప్రాయపడింది.

అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు స్విఫ్ట్ నుండి రష్యాను తొలగించాయి. తద్వారా పలు దేశాలతో మాస్కో వాణిజ్యాన్ని నష్టపరిచే ప్రయత్నం చేశాయి. స్విఫ్ట్ పేమెంట్ సిస్టం నుండి తొలగించడంతో రష్యా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో రష్యా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.

రష్యా ప్రతిపాదన

రష్యా ప్రతిపాదన

రష్యా డిప్యూటీ ప్రధానమంత్రి అలెగ్జాండర్ నొవాక్ గత వారంలో భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మాట్లాడారు. భారత్‌కు ముడిచమురును డిస్కౌంట్ పైన అధికంగా ఇస్తామని ప్రతిపాదించారు. రష్యా చమురు సంస్థలు ఎంతో తక్కువ ధరకు చమురు ఇచ్చేందుకు సిద్ధమన్నారు.

ఇలాంటి కాంట్రాక్ట్స్‌కు డాలర్లలో కాకుండా రూపాయి-రూబుల్ పద్ధతిన చెల్లింపులు చేసే ప్రతిపాదన ఇరుపక్షాల పరిశీలనలో ఉందని తెలుస్తోంది. రష్యాకు ఏఏ వస్తువులు ఎగుమతి చేసే అవకాశం ఉందనే అంశంపై మన దేశం కసరత్తు చేస్తోంది. ఇందులో మందులు, వ్యవసాయ ఉత్పత్తులు, విద్యుత్ రంగ ఉత్పత్తులు ఉంటాయని తెలుస్తోంది.

ట్రాన్సాక్షన్ వ్యయం

ట్రాన్సాక్షన్ వ్యయం

అయితే రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా వినియోగిస్తే ఇబ్బందులు కూడా లేకపోలేదు. ద్రవ్య పరపతి విధానం సంక్లిష్టమవుతుంది. అయితే అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ వ్యయం మాత్రం తగ్గుతుందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రూపాయి మారకం మరింత నష్టపోకుండా ఆర్బీఐ చర్యలు చేపడుతోంది.

English summary

రష్యాపై అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ కరెన్సీగా రూపాయికి ఛాన్స్ | Sanctions on Russia an opportunity to internationalise rupee

Countries proposing rupee-rouble or yuan-rouble trade to bypass Western economic sanctions on Russia for invading Ukraine are an opportunity for the internationalisation of the Indian currency, according to a report by State Bank of India.
Story first published: Tuesday, March 15, 2022, 11:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X