For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెలికం కంపెనీలకు శుభవార్త: వాయిస్ కాల్, మొబైల్ డేటాకు కనీస ధర

|

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థికమందగమనంలో ఉన్న వివిధ రంగాలకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఉద్దీపన ప్రకటనలు చేసింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉత్తేజం తెచ్చేందుకు ప్యాకేజీని ప్రకటించాయి. టెలికం కంపెనీలు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఆర్థిక మందగమన ప్రభావం కంటే ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం ఎక్కువగా పడింది. భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాపై ఈ భారం మరింత ఎక్కువ పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని, తమను ఆదుకోవాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో టెలికం కంపెనీలకు శుభవార్త రావొచ్చునని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియా వార్త వచ్చింది.

AGR దెబ్బ: టెలికం కంపెనీల ఆందోళన

మొబైల్ కాల్స్, డేటా కనీస ధర

మొబైల్ కాల్స్, డేటా కనీస ధర

చాలాకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెలికం రంగం పునరుజ్జీవ చర్యల్లో భాగంగా సెక్రటరీ కమిటీ (CoS) మొబైల్ కాల్స్, డేటా కనీస ధరను నిర్ణయించనుందని తెలుస్తోందని వార్తలు వచ్చాయి. ఈ మేరకు కమిటీ డిపార్టుమెంట్ ఆఫ్ టెలికం (DoT) నుంచి సిఫార్సులు కోరినట్లుగా తెలుస్తోంది. టెలికం కంపెనీల కోసం అన్ని టారిఫ్‌లకు కనీస ఛార్జీలు నిర్ణయించడం, టెలికం ఆపరేటర్లపై దాని ప్రభావాన్ని అంచనా వేయడంపై కమిటీ సిఫార్సులు కోరిందట.

వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌కు ప్రయోజనం

వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌కు ప్రయోజనం

ఇదే జరిగితే సుప్రీం కోర్టు తీర్పు వల్ల అతి భారంగా మారిన వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్ వంటి వాటికి ప్రయోజనం చేకూరుతుంది. సెప్టెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీల నష్టం రూ.74,000 కోట్ల వరకు కావడం గమనార్హం. ఇందులో AGR భారమే ఎక్కువ. వివిధ టెలికం కంపెనీలు లక్ష కోట్ల వరకు ప్రభుత్వానికి AGR కింద చెల్లించవలసి ఉంది. వీటిపై ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ వంటివి విన్నవించుకుంటున్నాయి.

కనీస ఛార్జ్

కనీస ఛార్జ్

కనీస ధరను సజెస్ట్ చేయాలని డిపార్టుమెంట్ ఆఫ్ టెలికంను కమిటీ కోరినట్లుగా తెలుస్తోంది. త్వరలో వాయిస్, డేటా టారిఫ్ ధరల కనీస ధరలపై సంప్రదింపులు జరిపి ఆ తర్వాత ఖరారు చేస్తుందని అంటున్నారు. టెలికం ఆపరేటర్ల ఆర్థిక ప్రయోజనాలు, హేతుబద్దత వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని కనీస ఛార్జీని నిర్ణయించవచ్చునని చెబుతున్నారు.

English summary

టెలికం కంపెనీలకు శుభవార్త: వాయిస్ కాల్, మొబైల్ డేటాకు కనీస ధర | Relief for telecom likely as government mulls minimum price for calls and data

It is said that, In a move that could launch the revival of India's long suffering telecom sector, the committee of secretaries (CoS) is mulling setting a minimum price for mobile calls and data.
Story first published: Friday, November 15, 2019, 13:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X