For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతి కీలక బిజినెస్ డీల్: 'ట్రంప్‌ను ఆహ్వానించేందుకు మోడీ రెడీ

|

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముగిసింది! ఆ రెండు దేశాల మధ్య ఇప్పటికే తొలి దశ ఒప్పందం కుదిరింది. భారత్-అగ్రదేశం మధ్య కూడా వాణిజ్యపరమైన చిక్కులు కొన్ని ఉన్నాయి. టారిఫ్ అంశంపై ట్రంప్ పదేపదే భారత్‌పై విమర్శలు గుప్పించారు. మోడీ ప్రభుత్వం కూడా ధీటుగానే స్పందించింది. త్వరలో అమెరికా అధ్యక్షులు భారత్ రానున్నారు. ఆయన రాకకు ముందే వాణిజ్య ఒప్పందం కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి.

కస్టమర్లకు హెచ్చరిక! దేశవ్యాప్తంగా రెండ్రోజులు బ్యాంకుల సమ్మెకస్టమర్లకు హెచ్చరిక! దేశవ్యాప్తంగా రెండ్రోజులు బ్యాంకుల సమ్మె

అమెరికాతో ట్రేడ్ వార్‌కు నో

అమెరికాతో ట్రేడ్ వార్‌కు నో

ప్రస్తుతం భారత్ తీవ్ర మందగమనంలో ఉంది. ఈ సమయంలో అమెరికాతో వాణిజ్య యుద్ధానికి సిద్ధంగా లేదని చెప్పవచ్చు. అమెరికాతో వాణిజ్య పోరులో చైనా దెబ్బతిన్నదని చెప్పవచ్చు. భారత్ అదే దిశలో వెళ్లే పరిస్థితుల్లేవు. మరోవైపు భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాలకు ఇది ఎంతో ముఖ్యమైన అంశం.

10 బిలియన్ డాలర్ల డీల్

10 బిలియన్ డాలర్ల డీల్

వచ్చే నెలలో అమెరికా వాణిజ్య విభాగం ప్రతినిధి రాబర్ట్ ఢిల్లీ రానున్నారు. ఈ సమయంలో దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువ కలిగిన డీల్‌కు తుది రూపు రానుంది. ఈ డీల్‌కి సంబంధించి న్యాయపరమైన చిక్కులు తొలగించే దిశగా సాగుతున్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా ఈ డీల్‌పై సంతకాలు చేసే అవకాశాలున్నాయి.

ఫిబ్రవరి చివరి వారంలో భారత్‌కు ట్రంప్

ఫిబ్రవరి చివరి వారంలో భారత్‌కు ట్రంప్

అమెరికా - భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అంశాలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పర్యవేక్షిస్తున్నారు. గోయల్ పక్షం రోజుల్లో రాబర్ట్‌తో భేటీ కానున్నారు. వచ్చే నెల 24-25 తేదీల్లో ట్రంప్ భారత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దావోస్‌లో జరిగిన ఎకనమిక్ ఫోరంలో ఇరుదేశాల అధికారులు ఈ అంశంపై చర్చించాయి.

హోదా పునరుద్ధరణ కోసం..

హోదా పునరుద్ధరణ కోసం..

భారత్‌కు జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్స్ హోదాను పునరుద్ధరించాలని మోడీ ప్రభుత్వం కోరనుంది. ఈ హోదా కిందకు వచ్చే వస్తువులు టారిఫ్ లేకుండా అమెరికా మార్కెట్లలో ప్రవేశించవచ్చు. గత ఏడాది ఈ హోదాను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో అమెరికా ఉత్పత్తులపై భారత్ ఆంక్షలు విధించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య టెన్షన్స్ కనిపించాయి.

English summary

అతి కీలక బిజినెస్ డీల్: 'ట్రంప్‌ను ఆహ్వానించేందుకు మోడీ రెడీ | Modi Prepares to Welcome Trump to India

Indian Prime Minister Narendra Modi Prepares to Welcome America president Donald Trump to India.
Story first published: Wednesday, January 29, 2020, 17:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X