For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు: 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, నిఫ్టీ 72 పాయింట్లు

|

ముంబై: సోమవారం మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతుండటంతో ఉదయం నుంచి ట్రేడింగ్ పుంజుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 42,859 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 12,329 వద్ద క్లోజ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.79 వద్ద ముగిసింది. క్వార్టర్ 3 ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేర్ ట్రేడింగ్ ముగిసే సమయానికి నాలుగు శాతానికి పైగా లాభపడింది.

అంతకుముందు ఉదయం...

అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతుండటంతో మార్కెట్లు మరింత లాభాల బాట పడుతున్నాయి. ఈ వారం మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. సోమవారం ఉదయం గం.9.19 సమయానికి సెన్సెక్స్ 259.02 లేదా 0.62% ఎగబాకి 41858.74 పాయింట్లకు, నిఫ్టీ 69.40 పాయింట్లు లేదా 0.57% పెరిగి 12326.20 వద్ద ట్రేడ్ అయింది. 779 షేర్లు లాభాల్లో, 175 షేర్లు నష్టాల్లో ఉండగా 64 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఉదయం గం.10.05 సమయానికి సెన్సెక్స్ 208.73 (0.50%) పాయింట్లు పెరిగి 41,808.45 వద్ద, నిఫ్టీ 57.95 (0.47%) పాయింట్లు పెరిగి 12,314.75 వద్ద ఉంది.

ఇన్ఫోసిస్ అదుర్స్, క్వార్టర్ 3లో రూ.4,466 కోట్ల నికర లాభం, ఆదాయంలో పెరుగుదలఇన్ఫోసిస్ అదుర్స్, క్వార్టర్ 3లో రూ.4,466 కోట్ల నికర లాభం, ఆదాయంలో పెరుగుదల

టాటా స్టీల్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, అవెన్యూ సూపర్ మార్కెట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. యస్ బ్యాంకు, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇక, డాలరుతో రూపాయి మారకం విలువ 70.84 వద్ద ట్రేడ్ అవుతోంది.

Market Update: Nifty opens at record high, Infosys, Yes Bank in focus

ఇన్ఫోసిస్‌పై ప్రత్యేక దృష్టి
రెండు రోజుల క్రితం ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఈ షేర్లపై అందరి దృష్టి పడింది. ఫలితాల నేపథ్యంలో ఈ టెక్ దిగ్గజం షేర్లు భారీగా రాణిస్తున్నాయి. ఉదయం పది గంటల సమయానికి రూ.29.85 (4.04%) పెరిగి 768.00 వద్ద ట్రేడ్ అయ్యాయి.

12,300 పైకి సెన్సెక్స్
నిఫ్టీ గత వారం పాయింట్ల 11,930-12,311 పాయింట్ల మధ్యన కదలాడి 12,257 వద్ద వారం గరిష్ఠస్థాయికి చేరువలో ముగిసింది. వరుసగా రెండు వారాల నష్టాల అనంతరం గత వారం పాజిటివ్‌గా ముగిసింది. జనవరి 13 నుంచి జనవరి 17 మధ్య బ్రేకౌట్ స్థాయి 12,450 కాగా, బ్రేక్ డౌన్ స్థాయి 12,050. రెసిస్టెన్స్ లెవల్ 12,400, 12,475. సపోర్ట్ లెవల్ 12,100, 12,025.

మార్కెట్ మరోసారి 12,300 స్థాయి వద్ద గట్టి పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉండటంతో స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అప్ ట్రెండ్‌ను కనబరచాలంటే కచ్చితంగా ఇక్కడ బ్రేకౌట్ సాధించాల్సి ఉంటుందని, ఈ స్థాయిని అధిగమిస్తే కొత్త గరిష్టస్థాయికి వెళ్లే ఛాన్స్ ఉందని, ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే స్వల్పకాలిక కరెక్షన్‌లోకి ప్రవేశించవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు: 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, నిఫ్టీ 72 పాయింట్లు | Market Update: Nifty opens at record high, Infosys, Yes Bank in focus

All the sectoral indices are trading higher led by the IT, metal, pharma, bank and auto. Nifty likely to inch towards 12,300 levels, All eyes on Infosys stock.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X