మోదీ ఒక్క ఫోన్ చేస్తే చాలు.. ఇరాన్ యుద్దం క్షణాల్లో ఆగిపోతుంది.. యూఏఈ రాయబారి కీలక వ్యాఖ్యలు..
పశ్చిమాసియా భగ్గుమంటోంది. అణుక్షణం మిస్సైల్ దాడులతో వణికిపోతోంది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్దం తీవ్రం కావడంతో ప్రపంచం మొత్తం షేక్ అవుతోంది. దాడులు, ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ అంతటా భయానక వాతావరణం నెలకొంది. ఈ యుద్దం ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనపడటం లేదు.
ఈ యుధ్దం త్వరలో ముగుస్తుందని ట్రంప్ ప్రకటించారు. అయితే దీనికి ఇరాన్ కూడా గట్టిగానే కౌంటర్ విసిరింది. యుద్ధం ఆగిపోవడం మా చేతుల్లో ఉంది నీ చేతుల్లో లేదు అంటే అమెరికాకు ఘాటుగానే రిప్లై ఇచ్చింది. అయితే ఈ యుద్ధాన్ని ఆపాలంటే భారత ప్రధాని మోదీ వల్లే సాధ్యమని యూఏఈ రాయబారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సమస్యను ఒకే ఫోన్ కాల్‌తో ఆపగల వ్యక్తి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జాతీయ వార్తా సంస్థ ఎన్డీ టీవితో మాట్లాడుతూ.. మోదీకి ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల నాయకుల వద్ద కూడా విశ్వసనీయమైన సంబంధాలు ఉన్నాయని.. ఆయన ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధ పరిస్థితి తక్షణమే పరిష్కారమవుతుందని మీర్జా పేర్కొన్నారు.
మోదీ అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ ప్రతినిధులకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. సమస్య తక్షణమే పరిష్కారమవుతుంది. అంతటి గౌరవం ఆయనకు ఉందని ఆయన అన్నారు. అంతేకాదు, గల్ఫ్ దేశాల నేతలలో మాత్రమే కాకుండా..అక్కడి వ్యాపార వర్గాలు, సామాన్య ప్రజల్లో కూడా మోదీకి ఉన్న క్రెడిబిలిటీ ఎంతో బలమైనదని ఆయన గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా.. మోడీ మధ్యప్రాచ్యం శాంతికి కీలక పాత్ర వహించగల స్థితిలో ఉన్నారని ప్రపంచానికి సూచనలొచ్చాయి.
UAE భూభాగాన్ని ఈ యుద్ధానికి వేదికగా వాడుకోవడం గురించి కూడా మీర్జా స్పష్టత ఇచ్చారు. యూఏఈ భూభాగాన్ని ఏ పక్షం కూడా లాంచింగ్ ప్యాడ్‌గా వాడుకోవడానికి మేము అనుమతించమని ఆయన తెలిపారు. UAE, ఇరాన్‌కి పొరుగు దేశంగా ఉండటమే కాక ఇటు అబ్రహం ఒప్పందంద్వారా ఇజ్రాయెల్‌కు భాగస్వామిగా ఉన్న దేశంగా.. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అందుకే, UAE ప్రస్తుత ఘర్షణలో ప్రత్యక్షంగా కలిసికట్టుగా ఉండకుండా.. శాంతిని నెలకొల్పే వైపుకు దృష్టి పెట్టడమే దాని ఉద్దేశ్యమని వివరించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మాదిరిగానే.. మధ్యప్రాచ్యానికి చెందిన దేశాలు, గ్లోబల్ పవర్‌లు కూడా ఈ సమస్యను దృష్టిలో ఉంచి ముందుకు వెళుతున్నాయి. ఇక్కడ భారత ప్రధాని మోదీ వ్యక్తిగతంగా చేయగల సమన్వయ ప్రయత్నం, గ్లోబల్ వేదికపై శాంతిని చాటే అవకాశం కలిగిందని UAE రాయబారి అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఒకే ఫోన్ కాల్‌తో యుద్ధం ఆగిపోవచ్చని UAE రాయబారి వ్యాఖ్యలు, భారతదేశ శాంతి, డిప్లమాటిక్ శక్తిని మళ్లీ ప్రపంచానికి గుర్తుచేస్తున్నాయని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications