For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్లను కూల్చిన కరోనా వైరస్: సెన్సెక్స్ 3,000 పాయింట్ల నష్టం, లక్షల కోట్ల సంపద ఆవిరి

|

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. కరోనా వైరస్‌కు అంతర్జాతీయ ముడి చమురు ప్రభావం తోడవడంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో సెన్సెక్స్ దాదాపు 1700 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ ఏకంగా 10,000 మార్క్ కిందకి దిగిపోయింది. మధ్యాహ్నం గం.02.51 సమయానికి సెన్సెక్స్ 2,994 పాయింట్లు నష్టపోయి 32,702 వద్ద, నిఫ్టీ 869 పాయింట్లు నష్టపోయి 9,589 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. అంటే సెన్సెక్స్ ఈ ఒక్కరోజు దాదాపు 3వేల పాయింట్ల వరకు నష్టపోయింది. ఈ ఒక్కరోజు మధ్యాహ్నం 11 గంటల వరకే ఇన్వెస్టర్ల సంపద 11 లక్షల కోట్లు ఆవిరైంది. మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 2,919 పాయింట్లు నష్టపోయి 32,778 వద్ద, నిఫ్టీ 868 పాయింట్లు నష్టపోయి 9,590 వద్ద ముగిసింది.

ప్రారంభంలోనే కుప్పకూలిన మార్కెట్లు

ప్రారంభంలోనే కుప్పకూలిన మార్కెట్లు

ఉదయం గం.09:18 సమయానికి సెన్సెక్స్ 1,672.09 పాయింట్ల నష్టంతో 34,025 పాయింట్ల వద్ద, నిఫ్టీ 490.40 పాయింట్ల నష్టంతో 9,968 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 87 షేర్లు లాభాల్లో, 924 షేర్లు నష్టాల్లో ట్రేడ్ కాగా, 21 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

కరోనా వైరస్ దెబ్బ

కరోనా వైరస్ దెబ్బ

గత రెండు నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగున్నర వేల మంది మృతి చెందారు. లక్ష మందికి పైగా ఈ వైరస్ సోకింది. ఇది మార్కెట్లను దారుణంగా దెబ్బతీస్తోంది. స్వల్ప కాలంలోనే మార్కెట్లు విలవిలలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత దారుణస్థాయికి పడిపోతున్నాయి.

కరోనాకు చమురు దెబ్బ

కరోనాకు చమురు దెబ్బ

ఓ వైపు కరోనా వైరస్ ప్రపంచ మార్కెట్లను వణికిస్తుంటే కొద్ది రోజులుగా రష్యా - సౌదీ అరేబియా ధరల యుద్ధం కొత్తగా తెరపైకి వచ్చింది. దీంతో చమురు రంగాలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. సౌదీ అరేబియా ఉత్పత్తి తగ్గించి, చమురు ధరలను భారీగా తగ్గించింది. దీంతో చమురు రంగం విలవిల్లాడుతోంది.

రూపాయి మారకం..

రూపాయి మారకం..

డాలరుతో రూపాయి మారకం విలువ గురువారం 74 కంటే తగ్గి ట్రేడ్ అయింది. 50 పైసలు పడిపోయి 74.17 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

భారీ నష్టాల్లో అంతర్జాతీయ మార్కెట్లు

భారీ నష్టాల్లో అంతర్జాతీయ మార్కెట్లు

భారత్, ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో మునిగిపోయాయి. జపాన్ నిక్కీ, సౌత్ కొరియా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు కుప్పకూలాయి. దాదాపు 4 శాతం పడిపోయాయి. అమెరికా ఫ్యూచర్స్ (డోజోన్స్) 999 పాయింట్లు తగ్గి 22,576 వద్ద ట్రేడ్ అయింది.

English summary

మార్కెట్లను కూల్చిన కరోనా వైరస్: సెన్సెక్స్ 3,000 పాయింట్ల నష్టం, లక్షల కోట్ల సంపద ఆవిరి | Market: Sensex falls 1,700 points, Nifty below 10,000 points

Benchmark indices Sensex and Nifty crashed in early trade Thursday, tracking overseas quitites that were slammed lower after the World Health Organization declared the new coronavirus a pandemic.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X