For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా బ్రాండ్స్.. పాతాళానికి: 200 ఏళ్ల చరిత్ర దిగ్గజం.. కరోనా దెబ్బతో దివాళా పిటిషన్!

|

అమెరికాకు చెందిన దిగ్గజ రిటైల్ సంస్థ లార్డ్ & టేలర్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత వర్జీనియాలోని ఈస్టర్న్ కోర్టులో దివాలా రక్షణకు కంపెనీ దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా వివిధ రంగాలు, పెద్ద ఎత్తున కంపెనీలు దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తెరుచుకుంటున్నప్పటికీ డిమాండ్ లేమి కనిపిస్తోంది.

కరోనా వల్ల చిన్న చిన్న కంపెనీల నుండి పెద్ద సంస్థల వరకు మూతబడటం లేదా మరోరకంగా దెబ్బతినడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ అమెరికన్ రిటైల్ దిగ్గజం కూడా బ్యాంక్రప్టసీ కోసం దరఖాస్తు చేసింది. అమెరికాలో వివిధ బ్రాండ్స్ భారీగా దెబ్బతిన్నాయి.

కుప్పకులిన అమెరికా ఆర్థికవ్యవస్థ, 70% వాటా ఉన్న ఆ ఖర్చులు క్లోజ్!కుప్పకులిన అమెరికా ఆర్థికవ్యవస్థ, 70% వాటా ఉన్న ఆ ఖర్చులు క్లోజ్!

శతాబ్దాల చరిత్ర.. ఈ రెండూ దివాలా పిటిషన్

శతాబ్దాల చరిత్ర.. ఈ రెండూ దివాలా పిటిషన్

కరోనా కారణంగా దివాలా తీసిన పలు రిటైల్ సంస్థల జాబితాలో లార్డ్ అండ్ టేలర్ చేరింది. బ్రూక్స్ బ్రదర్స్, బర్నేస్ న్యూయార్క్ సహా ఎన్నో సంస్థలు దివాళా తీశాయి. 1826 మూలాలు కలిగిన ఈ డిపార్టుమెంటల్ స్టోర్ కరోనాకు ముందు నుండీ ఇబ్బందుల్లో ఉంది. కరోనాతో మరింత కుదేలైంది. దాదాపు రెండు శతాబ్దాల క్రితం మన్‌హటన్ డ్రై గూడ్స్ స్టోర్‌గా లార్డ్ అండ్ టేలర్ ప్రారంభమైంది. గత ఏడాది ఫ్రాన్స్ రెంటల్ క్లాతింగ్ రెంటల్ స్టార్టప్ కంపెనీ లీ-టోటే ఇంక్ ఈ సంస్థను 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ రెండు సంస్థలు వేర్వేరుగా దివాలా పిటిషన్ దాఖలు చేశాయి.

కరోనాకు ముందే కష్టాలు

కరోనాకు ముందే కష్టాలు

ఇప్పుడు లార్డ్ అండ్ టేలర్ కొనుగోలుదారుల కోసం చూస్తోంది. కరోనాకు ముందు న్యూయార్క్ ఫిఫ్త్ అవెన్యూలో కంపెనీ 11 అంతస్తుల భారీ భవనాన్ని కూడా విక్రయించింది. సూట్లకు డిమాండ్ పడిపోవడంతో మెన్స్ వేర్ హౌస్, జోస్ ఎ బ్యాంక్ స్టోర్స్ వంటి బ్రాండ్స్ మాతృసంస్థ టైలర్డ్ బ్రాండ్స్ కష్టాలు మరింతగా పెరిగాయి. దీంతో దివాళాకు దారి తీసింది. దాదాపు అమెరికా అధ్యక్షులందరికీ దుస్తులు అందించిన బ్రూక్స్ అండ్ బ్రదర్స్ కూడా దివాలా పిటిషన్ వేసింది.

పెరిగిన దివాలా పిటిషన్లు

పెరిగిన దివాలా పిటిషన్లు

గత ఏడాది మొత్తం కంటే ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఎక్కువ దివాలా పిటిషన్లు దాఖలయ్యాయి. కరోనా కారణంగా అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలు పూర్తిగా చితికిపోయాయి. కరోనా వల్ల అమెరికాలో పదుల సంఖ్యలో స్టోర్స్ దివాళా తీశాయి. 1826లో మన్‌హటన్ లోయర్ ఈస్ట్ సైడ్‌లో డ్రై గూడ్స్ స్టోర్‌ను ప్రారంభించారు శామ్యూల్ లార్డ్, జార్జ్ వాషింగ్టన్ టేలర్. ఆ తర్వాత 1853లో రెండో స్టోర్, 1860లో మూడో స్టోర్ ప్రారంభించారు. 1914లో న్యూయార్క్ ఫిఫ్త్ అవెన్యూలోని భారీ భవనంలో ఓపెన్ చేశారు.

English summary

అమెరికా బ్రాండ్స్.. పాతాళానికి: 200 ఏళ్ల చరిత్ర దిగ్గజం.. కరోనా దెబ్బతో దివాళా పిటిషన్! | Lord & Taylor files for Bankruptcy as retail collapses pile up

The department store, which traces its roots to 1826, was struggling before the coronavirus hit. Its owner, the clothing rental start-up Le Tote, also filed for bankruptcy.
Story first published: Tuesday, August 4, 2020, 19:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X