For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిబ్రవరిలో ఎగుమతులు, దిగుమతులు ఇలా: పెరిగిన వాణిజ్య లోటు

|

ఢిల్లీ: 2021 ఫిబ్రవరి నెలలో ఎగుమతులు 0.67 శాతం, అదే సమయంలో దిగుమతులు 7 శాతం ఎగిశాయి. దీంతో భారత వాణిజ్యలోటు 12.62 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత నెలలో ఎగుమతులు 0.67 శాతం పెరిగి 2,793 కోట్ల డాలర్లకు, దిగుమతులు 6.96 శాతం పెరిగి 4,054 కోట్ల డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 1,262 కోట్ల డాలర్లకు పెరిగింది. ఎగుమతులు వరుసగా మూడో నెల పురోగతి సాధించాయి. అయితే దిగుమతులు అంతకుమించి పెరిగాయి. కరోనా కాలంలో ఎగుమతులు, దిగుమతులు పడిపోగా, ఇటీవలి కాలంలో క్రమంగా మెరుగు పడుతున్నాయి.

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు, బెస్ట్ హోంలోన్ ఆఫర్, ప్రాసెసింగ్ ఫీజువివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు, బెస్ట్ హోంలోన్ ఆఫర్, ప్రాసెసింగ్ ఫీజు

పెరిగిన వాణిజ్య లోటు

పెరిగిన వాణిజ్య లోటు

2021 ఫిబ్రవరి నెలలో ఎగుమతులు 2020 ఇదే నెలతో పోలిస్తే స్వల్పంగా 0.67 శాతం వృద్ధితో 27.93 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల వ్యాల్యూ కూడా ఇదే నెలలో 6.96 శాతం పెరిగి 40.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్య లోటు 12.62 బిలియన్ డాలర్లుగా నమోదయింది. 2020 ఫిబ్రవరిలో వాణిజ్యలోటు 10.16 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతిదారులకు ట్యాక్స్ రీయింర్సుమెంట్స్ స్కీం ప్రవేశపెట్టడం కలిసివచ్చింది. ఇండియా మర్చంటైజ్డ్ ట్రేడ్ డెఫిసిట్ జనవరి 2021లో 14.54 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

11 నెలల కాలంలో..

11 నెలల కాలంలో..

2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలో ఎగుమతులు 12.23 శాతం క్షీణించి 256.18 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 291.87 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలో దిగుమతులు 23.11 శాతం తగ్గి 340.8 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఫిబ్రవరి నెలలో నూనె దిగుమతులు 16.63 శాతం తగ్గి 8.99 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఏడాది ప్రాతిపదికన 40.18 శాతం తగ్గి 72.08 బిలియన్ డాలర్లుగా ఉంది.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

రంగాలవారీగా చూస్తే ఫిబ్రవరి నెలలో పలు దిగుమతులు తగ్గాయి. పెట్రోలియం ఉత్పత్తులు మైనస్ 27.13 శాతం, లెదర్ మైనస్ 21.62 శాతం, మైనస్ కాజూ 18.6 శాతం, మైనస్ జెమ్స్ అండ్ జ్యువెల్లరీ మైనస్ 11.18 శాతం, ఇంజినీరింగ్ గూడ్స్ మైనస్ 2.56 శాతం, టీ 2.49 శాతం, కాఫీ మైనస్ 0.73 శాతంగా నమోదయ్యాయి. బంగారం దిగుమతులు ఫిబ్రవరి నెలలో 3 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

English summary

ఫిబ్రవరిలో ఎగుమతులు, దిగుమతులు ఇలా: పెరిగిన వాణిజ్య లోటు | India February trade deficit at $12.6 billion as exports contract

India’s merchandise exports growth slowed down steeply in February amid rising coronavirus cases in some parts of the country and delay in implementing a tax reimbursement scheme for exporters.
Story first published: Tuesday, March 16, 2021, 16:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X