For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో సావన్‌లో తెలుగు మ్యూజిక్, టాప్ నగరాల్లో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు

|

స్థానిక భాషలలో నాణ్యమైన కంటెంట్, జనాదరణ పొందిన సంగీతాన్ని అందించే ప్రయత్నంలో భాగంగా, దేశంలోని అతిపెద్ద సంగీతం, ఆడియో స్ట్రీమింగ్ వేదిక జియోసావన్ ఇటీవల 'వి ఆర్ ఇండియా' ప్రచారాన్ని ప్రారంభించింది. నెలరోజుల ప్రచారంలో భాగంగా మొదటి దశలో సినిమాలు, సినిమాయేతర, ఇండిపెండెంట్ మ్యూజిక్‌ను అన్ని భాషల్లో ప్రారంభించింది.

నవంబర్ 2019 నుండి జూలై 2020 మధ్య ట్రాక్ చేసిన జియోసావన్ సమాచారం ప్రకారం ప్రాంతీయ భాషా సంగీతంలో కొన్ని ముఖ్యమైన స్ట్రీమింగ్ పోకడలు హైలైట్ చేయబడ్డాయి. ఈప్లాట్‌ఫాంలో సంగీతప్రియులు ఎక్కువగా ఆదరించిన తొలి ఐదు ప్రాంతీయ భాషల్లో తెలుగు ఉంది. తెలుగు మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు, చెన్నై, భువనేశ్వర్ నగరాల్లో అత్యధిక తెలుగు సంగీత ప్రియులు ఆదరించారు.

Hyderabad, Vijayawada and Bengaluru among top Indian cities streaming Telugu music on JioSaavn

నవంబర్ 2019 నుండి జూలై 2020 మధ్య ఎక్కువగాస్ట్రీమింగ్ చేయబడిన వాటిలో నీ కన్ను నీలి సముద్రం (18మిలియన్ + స్ట్రీమ్స్), నీలి నీలి ఆకాశం (25 మిలియన్ + స్టీమ్స్), సామజవరగమన (66 మిలియన్ + స్ట్రీమ్స్) ఉన్నాయి. సంగీత కళాకారుల విషయానికి వస్తే ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం, సిద్ శ్రీరామ్, అనురాగ్ కులకర్ణి, కె.ఎస్.చిత్రలు ఈ జాబితాలో ఉన్నారు. లాక్ డౌన్ కాలంలో తెలుగు పోడోకాస్ట్ నాలుగు రెట్ల వృద్ధిని నమోదు చేసింది.

English summary

జియో సావన్‌లో తెలుగు మ్యూజిక్, టాప్ నగరాల్లో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు | Hyderabad, Vijayawada and Bengaluru among top Indian cities streaming Telugu music on JioSaavn

In a bid to celebrate quality content and popular music across local languages, JioSaavn, the country’s largest music, and audio streaming service, recently rolled out the ‘We Are India’ campaign. The first phase of the month-long campaign witnessed curated playlists featuring film, non-film, independent music and podcasts across languages.
Story first published: Thursday, September 3, 2020, 19:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X