For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: పసిడి ప్రియులకు షాక్.. 10రోజుల్లో బంగారం ధరలు ఎంతగా పెరిగాయంటే!!

|

భారతదేశంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. పండుగలు పబ్బాలు, ఇంట్లో శుభ కార్యాలు ఏమి జరుగుతున్నా సరే బంగారం కొనుగోలు చేయడానికి భారతీయులు ఆసక్తి చూపుతారు. కొంత మంది బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ గా కూడా పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలోప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళన, ఆర్థిక మాంద్య భయాలు పెరిగిపోవడం వల్ల అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. సామాన్యులు కొనుగోలు చేయలేం అన్న విధంగా తారస్థాయికి చేరుకుంటూ ఆందోళన కలిగిస్తున్నాయి.

 అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలిలా

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలిలా

తాజాగా అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరిగిన నేపథ్యంలో, ప్రస్తుతం దేశీయంగానే బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఇక ఈ రోజు అంతర్జాతీయంగా బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1875 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఇదే అత్యధికం కావడం కూడా ప్రధానంగా గమనించాల్సిన అంశం గా ఉంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు 24 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఇక దేశీయంగానే బంగారం ధరల పెరుగుదల కనిపిస్తుంది.

హైదరాబాద్ లో బంగారం నేడు ధరలు ఇలా

హైదరాబాద్ లో బంగారం నేడు ధరలు ఇలా

ఈరోజు దేశీయంగా బంగారం ధరలు విషయానికి వస్తే భారతదేశంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు ఈ సమయానికి 51,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 55,960 రూపాయలు గా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములకు 51 వేల 300 రూపాయలు గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55 వేల 960 రూపాయలుగా ఉంది.

ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు ఇలా

ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు ఇలా

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు ఈ సమయానికి 51 వేల 420 రూపాయలుగా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 56 వేల 110 రూపాయలు గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51 వేల 300 రూపాయలు గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,960 గా ఉంది. కొద్దిపాటి క్షీణత మినహాయించి బంగారం ధరలలో పెద్దగా మార్పు వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

10 రోజుల్లో బంగారం ధరలు ఎంతగా పెరిగాయంటే

10 రోజుల్లో బంగారం ధరలు ఎంతగా పెరిగాయంటే

జనవరి ఒకటవ తేదీ నుండి ఇప్పటివరకు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరలో తొమ్మిది వందల రూపాయల పెరుగుదల కనిపిస్తుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర గత పది రోజుల్లో 1030 పెరుగుదలను నమోదు చేసింది. మొత్తంగా చూస్తే పెరుగుతున్న బంగారం ధరలు బంగారం కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. సామాన్యులకు ఊహించని విధంగా ఝలక్ ఇస్తున్నాయి.

English summary

Gold price today: పసిడి ప్రియులకు షాక్.. 10రోజుల్లో బంగారం ధరలు ఎంతగా పెరిగాయంటే!! | Gold price today: Shock for gold lovers.. How much gold prices have increased in last 10days!!

A shock to the gold buyers.. In 10 days, the price of 22 carat gold has increased by nine hundred rupees and the price of 24 carat gold has increased by 1030 rupees. Apart from Hyderabad, the prices of gold are high in Delhi and Mumbai today.
Story first published: Monday, January 9, 2023, 8:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X