For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: 60వేలకు చేరువగా పసిడి పరుగులు; బాబోయ్ అనిపిస్తున్న బంగారం ధరలు!!

|

పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరల తీరుతో, కొనుగోలుదారులు బంగారాన్ని కొనుగోలు చేయలేము అనే భావనకు వస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి బంగారం ధరలు పెరుగుతున్న తీరు పసిడి ప్రేమికులకు షాక్ అనే చెప్పాలి. 60 వేలకు చేరువగా వెళ్తున్న బంగారం ధరలు కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు

విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు

పండుగలు, పబ్బాలు, వివాహాది శుభకార్యాలు ఏవైనా భారతీయులు అత్యంత ఇష్టంగా కొనుగోలు చేసేది బంగారాన్ని.. అటువంటి బంగారం ఇప్పుడు కొనలేని స్థాయికి చేరుకుంటుంది. కొండెక్కి కూర్చుంటుంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు గణనీయంగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు 1917 డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు 24.36 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తాజా పరిణామాలతో నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో బంగారం ధర 60 వేలకు చేరుతుందని భావిస్తున్నారు.

 నేడు హైదరాబాద్ లో బంగారం ధరల దూకుడు ఇలా

నేడు హైదరాబాద్ లో బంగారం ధరల దూకుడు ఇలా

ఇక ఈరోజు బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల తులం బంగారం ధర 52 వేల 200 రూపాయలుగా ఉంది. నిన్న 52 వేల పది రూపాయలుగా ఉన్న బంగారం ధర నేడు 190 రూపాయలు పెరిగి ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఉంది . ఇక 24 క్యారెట్ల తులం బంగారం ధర నేడు హైదరాబాద్ మార్కెట్లో 56,950 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. నిన్నటికి నిన్న 56,740 ధర ఉండగా నేడు ఏకంగా 210 మేర ధర పెరిగింది. గత పది రోజుల్లో వెయ్యి రూపాయలకు పైగా బంగారం ధర హైదరాబాద్ లో పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. గత నెలతో పోల్చుకుంటే ఇప్పటివరకు ఏకంగా 3450 రూపాయల మేర బంగారం ధర పెరగడం గమనించాల్సిన అంశం.

ఢిల్లీలో బంగారం ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయంటే

ఢిల్లీలో బంగారం ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయంటే

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో నేడు 52 నిన్న 52 రూపాయల 160 వేల 350 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. నిన్నటికి నిన్న 52 వేల 160 రూపాయలుగా ఉన్న బంగారం ధర నేడు 190 రూపాయలు పెరిగి ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే నేడు ఢిల్లీ మార్కెట్లో 57,100గా బంగారం ధర ట్రేడ్ అవుతోంది. నిన్నటికి నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,990 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే 110 రూపాయల మేర ఢిల్లీలో బంగారం ధర పెరిగింది.

 ముంబైలో ధరల దూకుడు ఎంతగా ఉందంటే

ముంబైలో ధరల దూకుడు ఎంతగా ఉందంటే

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే నేడు ముంబై మార్కెట్లో బంగారం ధర ఈ సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52, 200గా ఉంది. ఈ ధర నిన్న 52,010గా ఉంది. నిన్నటికి ఈరోజుకి 190 రూపాయలు మేర బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. ఇక ముంబై మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే 56,950 రూపాయలు నేడు ఈ సమయానికి బంగారం ధర ట్రేడ్ అవుతోంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,740గా ఉంది. 210 రూపాయల మేర బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే అమెరికాలో ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా బంగారం ధరలలో విపరీతమైన మార్పు కనిపిస్తుంది. బంగారం ధరల దూకుడు ముందు ముందు మరింత కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

English summary

Gold price today: 60వేలకు చేరువగా పసిడి పరుగులు; బాబోయ్ అనిపిస్తున్న బంగారం ధరలు!! | Gold price today: gold prices skyy rocketing.. Close to 60k rupees!!

Today's gold prices, the price of 22 carat gold in Hyderabad is 52, 200 rupees And the price of 24 carat Tulam gold is trading at 56,950 rupees in Hyderabad market today. Today the price has increased in all main cities.
Story first published: Tuesday, January 17, 2023, 9:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X