For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధరలు; బీభత్సంగా పెరుగుతున్న ధరలతో షాక్ పక్కా!!

|

బంగారం ప్రియులకు రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. బంగారం పట్ల విపరీతమైన మక్కువ చూపే భారతదేశంలోని మహిళలు మోత మోగుతున్న బంగారం ధరలను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏ చిన్న సందర్భం అయినా బంగారాన్ని కొనుగోలు చేసే భారతీయులు పెరుగుతున్న ధరల దెబ్బకు బంగారం కొనుగోలుపై తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంధ్య పరిస్థితులు బంగారం ధరలను అమాంతం పెంచేసాయి.

జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్న బంగారం ధరలు; పసిడి ప్రియులకు షాక్; నేడు ధరలిలా!!జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్న బంగారం ధరలు; పసిడి ప్రియులకు షాక్; నేడు ధరలిలా!!

రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధరలు

రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధరలు

ఇక తాజాగా ఇండియన్ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 52,700గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 57,490 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నేడు 52,700గా ట్రేడ్ అవుతుంది. నిన్న 52,350 ఉన్న బంగారం ధర నేడు ఒక్కసారిగా 350 రూపాయల మేర పెరిగి గత రికార్డులను బ్రేక్ చేసింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో ప్రస్తుతం 57,490 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. నిన్నటి ధర 57,110 రూపాయలతో పోలిస్తే నేడు ఒక్కసారిగా 380 రూపాయలు మేర ధర పెరిగింది.

 హైదరాబాద్ లో పదిరోజుల్లో బంగారం ధర పెరిగింది ఇంతలా ..

హైదరాబాద్ లో పదిరోజుల్లో బంగారం ధర పెరిగింది ఇంతలా ..

హైదరాబాద్ లో జనవరి 15వ తేదీన 52,010గా ఉన్న బంగారం ధర పది రోజుల్లో 52,700 రూపాయలకు చేరడం గమనార్హం. అంటే మొత్తంగా 690 రూపాయలు మేర పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే జనవరి 15వ తేదీన 56,740 ఉన్న బంగారం ధర, ఈ పది రోజులలో 57,490 రూపాయలకు చేరింది . అంటే 24 క్యారెట్ల బంగారం ధర కేవలం పది రోజుల్లో 750 రూపాయల మేర పెరిగింది.

ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు ఇలా

ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు ఇలా

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 52 వేల 850 రూపాయలుగా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే 350 రూపాయలు మేర బంగారం ధర పెరిగింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే నేడు ఈ సమయానికి 57,650 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. నిన్నటితో పోలిస్తే 380 రూపాయల మేర నేడు ధర పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ముంబైలో 52,700గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,490 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

 రెండు నెలల్లోనే 7 వేల రూపాయలు పెరిగిన బంగారం

రెండు నెలల్లోనే 7 వేల రూపాయలు పెరిగిన బంగారం

ఇక అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు 1938 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, జాతీయంగాను ధరల ప్రభావం కనిపిస్తుంది. గత రెండు నెలల్లో బంగారం దాదాపు 7వేల రూపాయలకు పైగా పెరగడం గమనార్హం. ఇక బంగారం ధరలు దూకుడు ఈ విధంగానే కొనసాగుతుందని, మరింత బంగారం ధర పెరిగే అవకాశం ఉందని తాజా పరిణామాలను బట్టి నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే విషయంలో కొనుగోలు ధరలు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

English summary

రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధరలు; బీభత్సంగా పెరుగుతున్న ధరలతో షాక్ పక్కా!! | Gold price today: Gold prices breaking records; Shocking with alarmingly rising prices!!

The record breaking gold prices are shocking. The skyrocketing prices are becoming troublesome for gold buyers. Gold prices in the country today are as follows.
Story first published: Wednesday, January 25, 2023, 9:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X