For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: కస్టమర్లకు బంగారం ధరల షాక్... నేడు హైదరాబాద్లో పసిడి ధరలిలా!!

కస్టమర్లకు బంగారం, వెండి ధరలు వరుస షాక్ లు ఇస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నైలలో బంగారం ధరలిలా ఉన్నాయి.

|

కస్టమర్లకు బంగారం, వెండి ధరలు వరుస షాక్ లు ఇస్తూనే ఉన్నాయి. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్న కొనుగోలుదారులు విపరీతంగా పెరిగిపోతున్న ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగారం, వెండి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు వాటి రికార్డులను అవే బ్రేక్ చేసుకుంటూ ధరల దూకుడును కొనసాగిస్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1926 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంటే, స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు 23.67 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ లో తాజాగా బంగారం ధరలు ఇలా

హైదరాబాద్ లో తాజాగా బంగారం ధరలు ఇలా

ఇదిలా ఉంటే దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,650 రూపాయలుగా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో 57,440 గా ఉంది. ఇక పది రోజుల క్రితం హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 52,250 కాగా ప్రస్తుతం 52,650 గా ట్రేడ్ అవుతుంది. ఇక జనవరి 21వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57, 060 రూపాయలు కాగా ప్రస్తుతం 57,440 గా ట్రేడ్ అవుతుంది . 2023 సంవత్సరం ప్రారంభం నుండి బంగారం ధరలు దూకుడు కొనసాగుతూనే ఉంది. మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఢిల్లీ, ముంబై, చెన్నై లలో బంగారం ధరలిలా

ఢిల్లీ, ముంబై, చెన్నై లలో బంగారం ధరలిలా

ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,800గా ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 57,590 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,650 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 57,440 ట్రేడ్ అవుతుంది. ఇక బంగారం ధరల్లో అధిక ధరలను నమోదు చేసే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 53,500 ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో 58,370లుగా ట్రేడ్ అవుతుంది.

యూఎస్ ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుకు.. బంగారం ధరలకు లింక్

యూఎస్ ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుకు.. బంగారం ధరలకు లింక్

ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్న ధరలను బట్టి బంగారం ధర త్వరలో 60 వేల రూపాయలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెలలో యూఎస్ ఫెడ్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందేమోనని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా పెట్టు వడ్డీ రేట్లు పెంచితే బంగారం, వెండి ధరలు దిగొచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరి యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపుపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

English summary

Gold price today: కస్టమర్లకు బంగారం ధరల షాక్... నేడు హైదరాబాద్లో పసిడి ధరలిలా!! | Gold price today: Gold price shock for customers; These are the gold prices in Hyderabad and other cities !!

The way gold prices are increasing is a shock to the common man. The latest gold prices, 22 carat 10 gram gold price in Hyderabad is Rs 52,650. And the price of 10 grams of 24 carat gold in Hyderabad is 57,440.
Story first published: Tuesday, January 31, 2023, 10:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X