For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: మళ్ళీ జెట్ స్పీడ్‌లో బంగారం ధరల దూకుడు; 60వేలకు చేరువలో!!

|

గత మూడు రోజులుగా తగ్గిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా మళ్లీ జెట్ స్పీడ్ లో దూసుకుపోయాయి. బంగారం కొనుగోలు చేయాలని భావించిన వినియోగదారులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. భారతదేశంలో బంగారం అంటే ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తారు. ప్రపంచ మార్కెట్లో బంగారం కొనుగోలులో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అటువంటి భారతదేశంలోని బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

భారత్ లో మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు

భారత్ లో మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు

గత మూడు రోజులు పాటు స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు మళ్ళీ పెరిగాయి. భారతదేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుత 52,350 గా ట్రేడ్ అవుతుంది. అంతకు ముందు 52,000గా ఉన్న బంగారం ధర ఒకసారిగా 350 రూపాయల మేర పెరిగింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 57,110 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.

అంతకుముందు 56 వేల 730 రూపాయలుగా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 380 రూపాయల మేర పెరిగింది. మళ్ళీ ధరల పెరుగుదల దేశ వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చెన్నై, మదురై, కోయంబత్తూరులో బాగా ఎక్కువగా బంగారం ధరలు పెరిగాయి.

హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో నేడు బంగారం ధరలు ఇలా

హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో నేడు బంగారం ధరలు ఇలా

ఇక హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,350 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57 వేల 110 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో హైదరాబాద్ తో పోలిస్తే బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,500గా ఉంది, ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57 వేల 270 రూపాయలుగా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,350 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,110 రూపాయలుగా కొనసాగుతుంది.

చెన్నైలో గణనీయంగా పెరిగిన బంగారం ధర..

చెన్నైలో గణనీయంగా పెరిగిన బంగారం ధర..

ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 52,400గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బెంగళూరులో 57,160 రూపాయలుగా కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 53,250గా కొనసాగుతుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో 58,090 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. కోయంబత్తూరు , మధురైలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది.

60 వేల దిశగా బంగారం పరుగులు

60 వేల దిశగా బంగారం పరుగులు

మొత్తంగా చూస్తే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితులు సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బంగారం కొనుగోలుదారులకు ఊహించని షాక్ ఇస్తున్నాయి. తాజా పరిణామాలను బట్టి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం 60 వేల రూపాయలకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులను నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దూకుడు కొనసాగిస్తున్న బంగారం ధరలు 60 వేలకు చేరువగా వెళుతున్నాయి.

English summary

Gold price today: మళ్ళీ జెట్ స్పీడ్‌లో బంగారం ధరల దూకుడు; 60వేలకు చేరువలో!! | Gold price today: Gold price jumps at jet speed again; Close to 60 thousand!!

The prices of gold, which have fallen in the last three days, have jumped again at jet speed today. Gold prices are shocking to consumers who thought to buy gold. Here are the prices today.
Story first published: Saturday, January 21, 2023, 9:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X