For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్థిక వ్యవస్థ అద్భుతం.. అమెరికా ఎకానమీని డొనాల్డ్ ట్రంప్ నిలబెట్టారు

|

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ మధ్య హోరాహోరీ కనిపించినప్పటికీ ప్రీ-పోల్ సర్వేలో ఓటర్లు జోబిడెన్ వైపు మొగ్గు చూపినట్లుగా పలు సర్వేలు వెల్లడించాయి. తన గెలుపు ఖాయమని ట్రంప్ చెబుతుండగా, జోబిడెన్ గెలుస్తారని చాలామంది భావిస్తున్నారు. అమెరికా ఓటర్లు తెలివైనవారని, వారు సరైన అభ్యర్థిని ఎంచుకుంటారని రాజకీయ, ఆర్థిక పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ గెలుపును కూడా కొట్టి పారేయలేమని, ఎకానమీ అస్త్రంగా ఆయన గెలుస్తారని ట్రంప్ వర్గం భావిస్తోంది.

నరేంద్రమోడీ వల్లే అవుతుంది: బ్యాంకులపై దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్యనరేంద్రమోడీ వల్లే అవుతుంది: బ్యాంకులపై దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్య

ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందా?

ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందా?

కరోనా కారణంగా అమెరికా సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. దశాబ్దాల చేతికి క్షీణించిన అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు. జాతీయ ఆర్థిక ఉత్పత్తి రేటు ఏడు దశాబ్దాల గరిష్టానికి చేరుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి. స్థూల జాతీయోత్పత్తిలో 33 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 1950లో హారీ ట్రూమన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా ఆర్థిక వృద్ధి దాదాపు 17 శాతంగా ఉంది. అంటే ఏడు దశాబ్దాల కంటే ఇది దాదాపు రెండిందలు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడానికి సంకేతాలుగా భావిస్తున్నారు.

అంచనాలను మించిన వృద్ధి

అంచనాలను మించిన వృద్ధి

ప్రస్తుత అమెరికా వృద్ధిని ఎవరూ ఊహించలేదని చెబుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుత రేటులో సగం వృద్ధిని అంచనా వేసింది. చాలామంది వాల్ స్ట్రీట్ ఆర్థికవేత్తలు కూడా 20 శాతం కంటే తక్కువ వృద్ధిని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ మాసంలో నిరుద్యోగిత రేటు ఎనిమిది శాతానికి క్షీణించింది. ఫెడరల్ రిజర్వ్, కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం నిరుద్యోగం రెట్టింపు అవుతుందని అంచనా వేసింది. మందగమనం, కరోనా నుండి వేగంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ ఖాళీలను కూడా పెద్ద ఎత్తున నింపారు. బరాక్ ఒబామా ఎనిమిదేళ్ల కాలం, జో బిడెన్ పాలసీ కంటే ఇది ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ప్రయివేటు సెక్టార్ నుండి పెట్టుుబడులు 80 శాతం పెరిగాయి. ప్రస్తుతం రికవరీ బిజినెస్, ప్రయివేటు సెక్టార్ వర్క్ ఫోర్స్‌తో నడుస్తోంది.

ఇదే ప్రధాన కారణం...

ఇదే ప్రధాన కారణం...

అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడానికి ప్రధాన కారణంగా 2020 కరోనాకు ముందు అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండటం. 50 ఏళ్లలో అతి తక్కువ నిరుద్యోగిత రేటు, ఆదాయ స్థాయి పెరగడం, అన్ని వర్గాల్లో పేదరికం రికార్డ్ కనిష్టానికి చేరుకోవడం సహా వివిధ కారణాలు ఉన్నాయి. బలహీనమైన ఆర్థిక వ్యవస్థ సమయంలో కరోనా వచ్చి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని, కానీ ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న సమయంలో రావడంతో వేగంగా కోలుకుంటోదని చెబుతున్నారు. తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల గవర్నర్లు ఎక్కువగా రిపబ్లికన్ పార్టీకి చెందినవారు కావడం గమనార్హం.

పుంజుకున్న రియాల్టీ

పుంజుకున్న రియాల్టీ

రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా దశాబ్దాల గరిష్టానికి చేరుకుంది. నగర శివార్లలో కొత్త ఇంటి కొనుగోళ్లు వేగంగా పెరిగాయి. కరోనా తదనంతర పరిణామాలతో చిన్న వ్యాపారాల విశ్వాసం గరిష్టానికి చేరుకుంది. గత పాలన కంటే ఇది మంచి రికార్డ్‌ను నమోదు చేసింది. నిరుద్యోగిత రేటు 50 సంవత్సరాల కంటే తక్కువగా ఉంది.

English summary

ఆర్థిక వ్యవస్థ అద్భుతం.. అమెరికా ఎకానమీని డొనాల్డ్ ట్రంప్ నిలబెట్టారు | Economic policy of Trump administration: Trump wins on the economy

Is this the single greatest and fastest comeback from a recession in our history? A strong case could be made that it is with the recent news that national economic output soared to the highest rate in more than seven decades. The 33 percent increase in gross domestic product was twice the last record set back in 1950 when Harry Truman was president and economic growth was almost 17 percent at the time.
Story first published: Tuesday, November 3, 2020, 16:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X