For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రంప్ లాక్‌డౌన్‌కు ఎందుకు దూరం జరిగారు, రెండు కారణాలివే!

|

కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను చిగురుటాకులా వణికిస్తోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతోంది. పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. అగ్ర రాజ్యం ఆర్థిక వ్యవస్థ కనీవినీ ఎరుగని దిగజారిపోతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత, ధరల పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. అమెరికాలో కరోనా దెబ్బ కారణంగా ఈ ప్రభావం భారత ఐటీ పైన కూడా పడనుంది.

1946 కంటే వేగంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం, కోట్ల ఉద్యోగాల కోత1946 కంటే వేగంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం, కోట్ల ఉద్యోగాల కోత

95 శాతం మంది రోడ్లపైకి రావడం లేదు

95 శాతం మంది రోడ్లపైకి రావడం లేదు

అమెరికా ముందే మేల్కొని ఉంటే పరిస్థితి ఇంతలా ఉండపోయేది. పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైనా, వందల సంఖ్యలో చనిపోయినా అగ్రరాజ్యం లాక్ డౌన్‌ను వద్దనుకుంది. ఇప్పుడు 95 శాతం మంది రోడ్లపైకి రావడం లేదని స్వయంగా ట్రంప్ చెప్పారు. ఇటీవలి వరకు మాత్రం లాక్ డౌన్ చేస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సివిల్ వార్ భయం

సివిల్ వార్ భయం

లాక్ డౌన్‌కు ముందు నుండి వెనుకాడటానికి అమెరికాకు వివిధ కారణాలు ఉన్నాయి. ఇక్కడ గన్ కల్చర్‌. రెండోది ఆర్థిక వ్యవస్థ. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ఉంటే అది సివిల్ వార్ దారి తీయవచ్చునని భయపడింది. అమెరికాలో తుపాకులు, రైఫిల్స్, పిస్టల్స్, రివాల్వర్స్ సహా దాదాపు 27 కోట్ల ఆయుధాలు ప్రజల వద్ద ఉన్నట్టు అంచనా. మరో అంతర్జాతీయ అధ్యయనంలో ఒక మనిషి, మహిళ, పిల్లవాడికి ఒక గన్ చొప్పున ఉన్నాయి. అమెరికా వ్యాప్తంగా ఆయుధాలు ఉన్నాయి. లాక్ డౌన్ చేస్తే నిత్యావసరాలు కరువై ఆయుధాలు చేతబట్టి అసాంఘిక కార్యకలాపాలకు దిగవచ్చుననే ఆందోళనలు నెలకొన్నాయి. సూపర్ మార్కెట్లు, గౌడౌన్స్, ఇళ్ల లూటీలు, కొల్లగొట్టడానికి దారితీసి తద్వారా సివిల్ వార్ జరగొచ్చునని ఆందోళన పడింది.

ఆర్థిక విధ్వంసం

ఆర్థిక విధ్వంసం

లాక్ డౌన్ చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కొన్ని మినహాయించి మాస్క్, శానిటైజర్, వెంటిలెటర్స్ సహా వివిధ వస్తువులను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది అమెరికా. స్థానికంగా ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉంది. కానీ చౌక దిగుమతికి మొగ్గు చూపింది. ఇప్పుడు హఠాత్తుగా ఈ ఉత్పత్తులు చేయలేదు. లాక్ డౌన్ ప్రకటిస్తే ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి, వ్యాపారాలు మూతబడి ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుందని ఆందోళన పడింది.

భారత్ పైన ప్రభావం

భారత్ పైన ప్రభావం

భారత ఐటీ రంగానికి అతిపెద్ద అమెరికా అతిపెద్ద కస్టమర్. ఈ ప్రభావం మన ఐటీ రంగంపై బాగానే చూపనుంది. రిటైల్, ఆర్థిక సేవలు తదితర కీలక రంగాలన్నింటిపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. అమెరికాలో నిరుద్యోగం పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోనున్నాయి. ఐరోపా దేశాల్లోను కరోనా మృత్యుఘంటికలు మోగుతున్నాయి. ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్తపై పడనుంది.

English summary

ట్రంప్ లాక్‌డౌన్‌కు ఎందుకు దూరం జరిగారు, రెండు కారణాలివే! | Coronavirus has capsized the US economy

Coronavirus has capsized the U.S. economy and it’s still sinking to even lower depths.
Story first published: Sunday, April 5, 2020, 13:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X