For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత ఐటీ రంగంపై చైనా కరోనా వైరస్ ప్రభావం ఎలా?

|

ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు కమ్ముకున్నాయి. చైనాలో ఉత్పత్తులు ఆగిపోవడం, ప్రపంచ జీడీపీలో ఆ దేశానిదే 16 శాతానికి పైగా ఉండటంతో భారీ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లు కుదురుకుంటున్నాయి. భారత్‌లో ఆటో పరిశ్రమ, ఫార్మా పరిశ్రమ, ఎఫ్ఎంసీజీ వంటి వివిధ రంగాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. ఐటీ కంపెనీలలోనూ ఆందోళన కలిగిస్తోంది.

క్రెడిట్ కార్డు తీసుకుంటే ఎప్పుడు లాభం, ఎన్ని ఉండాలి?క్రెడిట్ కార్డు తీసుకుంటే ఎప్పుడు లాభం, ఎన్ని ఉండాలి?

అందుకే మన ఐటీ పరిశ్రమపై ప్రభావం

అందుకే మన ఐటీ పరిశ్రమపై ప్రభావం

కరోనా వైరస్ ప్రభావం భారత సాఫ్టువేర్ కంపెనీలపై పెద్దగా కనిపించడం లేదు. అయితే వచ్చే రెండు మూడు వారాల్లో పరిస్థితి అదుపులోకి రాకుంటే ఈరంగంపై కూడా ప్రభావం చూపనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనాలోని వివిధ తయారీ కంపెనీలు భారత ఐటీ కంపెనీల ఖాతాదారులుగా ఉన్నాయి. అందుకే మన ఐటీ పరిశ్రమపై ప్రభావం ఉండవచ్చునని భావిస్తున్నారు.

చైనాలో సేవలు..

చైనాలో సేవలు..

TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL వంటి ఇండియన్ ఐటీ దిగ్గజాలకు డ్రాగన్ కంట్రీలో యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్ల ద్వారా కంపెనీలు చైనాలోని తయారీ కంపెనీలకు అవసరమైన సేవలు అందిస్తున్నాయి. ఈ కంపెనీల్లో ఎక్కువగా చైనీయులే పని చేస్తున్నారు.

ఖర్చులు పెరిగే ప్రమాదం

ఖర్చులు పెరిగే ప్రమాదం

సేవారంగం కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. కొన్ని కంపెనీలు ఉద్యోగులను వైరస్ ప్రభావం లేని ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇప్పటికే చాలా రోజులుగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇలాగే కొనసాగితే ఖర్చులు పెరిగే ప్రమాదముందని టెక్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.

ఇది ఊరట..

ఇది ఊరట..

ఐటీ సేవల్లో భారత్‌కు చైనా పెద్ద మార్కెట్ కాదు. అమెరికా, ఐరోపాల్లో మార్కెట్ ఉంది. ఆసియా, పసిఫిక్ దేశాల నుంచి వచ్చే ఐటీ ఆదాయాలలో చైనాది కేవలం 7 శాతం లోపే. కరోనా ప్రభావం చైనా జీడీపీపై పడితే, ఆ ప్రభావం అక్కడి ఐటీ పరిశ్రమలపై కూడా పడుతుంది. చైనాలో భారత ఐటీలకు అతి పెద్ద మార్కెట్ లేకపోవడం కొంతలో కొంత ఊరట కలిగించే విషయం. కానీ కరోనా ప్రభావం ఇలాగే కొనసాగితే ఆ రంగం ఇబ్బందులు ఎదుర్కోవచ్చునని చెబుతున్నారు.

నిలిచిన ఎగుమతులు

నిలిచిన ఎగుమతులు

కరోనా మన పొగాకు రైతులను కూడా దెబ్బ కొట్టింది. ఈ ఏడాది చైనా బృందం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించి సాగులోని పొగాకు పంటల్ని పరిశీలించి వెళ్లింది. చైనాకు ఎగుమతులు మెరుగుపడతాయనే ఆశలు కనిపించాయి. కానీ ఇంతలోనే కరోనా కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయి.

English summary

భారత ఐటీ రంగంపై చైనా కరోనా వైరస్ ప్రభావం ఎలా? | coronavirus effect on Indian IT sector

Corona discharge can cause an audible hissing or cracking noise as it ionizes the air around the conductors.
Story first published: Sunday, February 23, 2020, 14:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X