For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిగులు-లోటు: చైనాను అధిగమించి.. భారత్ అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వామిగా అమెరికా

|

భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో అమెరికా... చైనాను వెనక్కి నెట్టింది. కేంద్ర వాణిజ్య శాఖ వివరాల ప్రకారం 2018-19లో అమెరికాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 87.95 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే ఏడాది చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 87.7 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019-20 (ప్రస్తుత) ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు అమెరికా- భారత్ మధ్య 68 బిలియన్ డాలర్లు ఉండగా, భారత్-చైనా మధ్య 64.96 బిలియన్ డాలర్లుగా ఉంది.

ట్రంప్ పర్యటన: అమెరికా-భారత్ వాణిజ్య కథనాలు

వాణిజ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే దిశగా...

వాణిజ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే దిశగా...

అమెరికా-భారత్ తమ వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక ముందు కూడా ఇదే పరిస్థితి ఉుంటుందని నిపుణుల అంచనా. ఒకవేళ అమెరికా-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (FTA) వస్తే అప్పుడు ఇరుదేశాల మధ్య వాణిజ్యం మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అంటున్నారు.

FTAతో ఎవరికి ప్రయోజనం

FTAతో ఎవరికి ప్రయోజనం

మనదేశ వస్తు, సేవలకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో FTA భారత్‌కే ఎక్కువ ప్రయోజనకరమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. 2018-19లో అమెరికాతో మన దేశానికి వాణిజ్య మిగులు 16.85 బిలియన్ డాలర్లు కాగా, చైనాతో 53.56 బిలియన్ డాలర్లుగా ఉంది.

అమెరికాతో వాణిజ్య మిగులు.. చైనాతో లోటు

అమెరికాతో వాణిజ్య మిగులు.. చైనాతో లోటు

అమెరికా-భారత్ మధ్య ఎగుమతులు, దిగుమతులు క్రమంగా పెరుగుతున్నాయని, అదే సమయంలో చైనాతో తగ్గుతున్నాయని అజయ్ సహాయ్ అన్నారు. ట్రేడ్ సర్‌ప్లస్ ఉన్న భారత కొద్ది భాగస్వామ్య దేశాల్లో అమెరికా ఉంది. అదే సమయంలో చైనాతో భారీ వాణిజ్య లోటు కలిగి ఉంది ఇండియా. 2018-19లో భారత్‌కు అమెరికాతో వాణిజ్య మిగులు 16.85 బిలియన్ డాలర్లు కాగా, చైనాతో 53.56 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది.

వాణిజ్యం సందర్భంగా భారత్ జాగ్రత్త...

వాణిజ్యం సందర్భంగా భారత్ జాగ్రత్త...

2013 నుండి 2018 మధ్య చైనా.. భారత అగ్రవాణిజ్య భాగస్వామి. చైనాకు ముందు యూఏఈ ఉంది. టారిఫ్‌తో పాటు అమెరికా-భారత్ మధ్య FTA మరింత కీలకం కానుందని చెబుతున్నారు. వాణిజ్య ఒప్పందం సమయంలో భారత్ కాస్త జాగ్రత్త వహించాలని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (IIFT) ప్రొఫెసర్ రాకేష్ మోహన్ జోషి అన్నారు. వ్యవసాయ, ఫుడ్ ఉత్పత్తులు, మొక్కజొన్న, సోయాబిన్ వంటి వివిధ ఉత్పత్తులకు సంబంధించి అమెరికానే అతిపెద్ద ఉత్పత్తిదారు.

ట్రేడ్ మార్కెట్ సులభతరం

ట్రేడ్ మార్కెట్ సులభతరం

అమెరికా-భారత్ మధ్య ఏ ఒప్పందమైనా తదుపరి టారిఫ్, మార్కెట్ అంశాలను సులభతరం చేసే అవకాశముందని చెబుతున్నారు. గత ఏడాది చైనాకు భారత్ ఉత్పత్తుల ఎగుమతి 25 శాతం పెరిగి 16.7 బిలియన్ డాలర్లు పెరిగాయని, దిగుమతులు 8 శాతం మేర తగ్గి 70.3 బిలియన్ డాలర్లుగా ఉందని కనెక్ట్2ఇంియా ఆన్‌లైన్ ట్రేడ్ ప్లాట్‌ఫామ్ సీఈవో పవన్ గుప్తా అన్నారు.

English summary

మిగులు-లోటు: చైనాను అధిగమించి.. భారత్ అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వామిగా అమెరికా | America replaces China as India's top trading partner

The US has surpassed China to become India's top trading partner, showing greater economic ties between the two countries. According to the data of the commerce ministry, in 2018-19, the bilateral trade between the US and India stood at USD 87.95 billion.
Story first published: Monday, February 24, 2020, 11:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X