ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు.. హార్ముజ్ జలసంధి రవాణాపై ట్రంప్‌కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..
Strait of Hormuz Tensions: పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా భగ్గముంటోంది. దాడులు, ప్రతిదాడులతో భయానకంగా మారింది. దీంతో అంతర్జాతీయంగా ఆందోళన ఎక్కువవుతోంది. చమురు ధరలు నింగిని తాకుతున్నాయి. గ్యాస్ సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హోర్ముజ్ జలసంధిని నియంత్రిస్తే ఇరాన్ పదం లేకుండా చేస్తామని హెచ్చరించారు. దీనికి ఇరాన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. మీ పిల్ల బెదిరింపులకు ఇరాన్ భయపడే ప్రశ్నేలేదని ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఘాటుగా బదులిచ్చింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
హార్ముజ్ జలసంధిని ఇరాన్ మైనింగ్ చేస్తే తీవ్ర సైనిక పరిణామాల ఎదురవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. జలమార్గాన్ని అడ్డుకోవడాన్ని ఇరాన్ ప్రయత్నిస్తే, అమెరికా దాన్ని స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. వారు ఏదైనా చెడుగా చేస్తే ఇరాన్ అంతం అయినట్టే. ఇకపై ఇరాన్ పేరునే వినబడదని ట్రంప్ అన్నారు. హోర్ముజ్ ద్వారా చమురు రవాణా ంటూ, ఇప్పటికే నష్టపోయినదానికన్నా 20 రెట్లు నష్టం కలిగిస్తాం అని పేర్కొన్నారు.

ఇరాన్ ఈ వార్నింగ్ కు ఘాటుగా రిప్లై ఇచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మాపై కొనసాగితే హోర్ముజ్ ద్వారా ఒక్క లీటర్ చమురును కూడా రవాణాకు అనుమతించమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) స్పష్టం చేసింది. "యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో నిర్ణయించేది మేమే, అమెరికా కాదని ఐఆర్‌జీసీ పేర్కొంది. కొత్త సుప్రీం నాయకులు భయపడరు, అమెరికా బెదిరింపులకు ప్రతిఘటన చూపుతుందని హెచ్చరించింది. మీరు ముందే జాగ్రత్త పడకపోతే, అమెరికా అనుకున్నది సాధ్యం కాదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానిహెచ్చరించారు.
హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ ముడి చమురా సరఫరాలో సుమారు 20 శాతం రవాణా అవుతుంది. ఇరాన్ హెచ్చరికలతో వేల సంఖ్యలో చమురు, కార్గో, ఇతర నౌకలు అక్కడే చిక్కుకున్నాయి. యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో, అమెరికా సెంట్రల్ కమాండ్ ఆ మైన్ లేయింగ్ నౌకలపై దాడి చేసి 16 నౌకలను నాశనం చేసింది. ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తరువాత, ఇరాన్ 300 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పై విసిరిందని IDF వెల్లడించింది, వీటిలో సగం క్లస్టర్ బాంబ్ వార్హెడ్లతో ఉన్నాయి.
హార్ముజ్ పరిసర ప్రాంతంలో GPS సిగ్నల్స్ జామ్ కావడం వల్ల గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో 1,000కి పైగా నౌకలు తాము ఎక్కడ ఉన్నదీ గుర్తించలేకపోతున్నాయి. ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థలు తాత్కాలికంగా లేదా నిరంతరంగా గుర్తించడంలో ఓడిపోతున్నాయి. ఇరాన్ డ్రోన్ల దాడులను తప్పించుకోవడానికి గల్ఫ్ దేశాలు తమ సిస్టమ్‌లను ఉపయోగిస్తే, ఇతర దేశ నౌకలను తప్పుదారి పట్టించేందుకు జీపీఎస్ జామింగ్‌కు ఇరాన్ పాల్పడుతోంది.
చమురు మార్కెట్లపై ఈ యుద్ధ ప్రభావం తీవ్రమైంది. హోర్ముజ్ ద్వారా రవాణా అవుతున్న చమురు నిల్వలు నిలిచిపోవడంతో, బ్రెంట్, WTI క్రూడ్ ధరలు భారీగా ఎగబాకాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ మైనింగ్ హెచ్చరికలు, GPS జామింగ్ అన్నీ ఈ ప్రాంతంలో వ్యూహాత్మక, ఆర్థిక భయాన్ని కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, గ్లోబల్ ఆయిల్ సరఫరా, విమాన ఇంధనం ధరలు, తీరుని వచ్చే దేశాల లోజిస్టిక్స్ పైన తీవ్ర ప్రభావం పడుతోంది.
పశ్చిమాసియా వాతావరణంలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా, హోర్ముజ్ జలసంధి కింద ఉన్న చమురు ట్యాంకర్లు, కార్గో నౌకలు, డ్రోన్ నౌకలు ఇప్పటికే సిగ్నల్ సమస్యలతో ఆగిపోయాయి. నిపుణులు ఈ పరిస్థితి అంతర్జాతీయ లాజిస్టిక్ సంక్షోభంగా పేర్కొన్నారు. జీపీఎస్ జామింగ్ కారణంగా నౌకల స్థానం నిర్ధారణ సమస్యలు ఏర్పడడం, చమురు సరఫరా గొలుసుకు గాయపెట్టింది.
ఏదేమైనా హార్ముజ్ జలసంధి ఇప్పుడు వ్యూహాత్మక ప్రధాన కేంద్రంగా మారింది. ఇరాన్ హెచ్చరికలు, ట్రంప్ సానుకూల దాడులు, మైన్ లేయింగ్, GPS జామింగ్ ఇవన్నీ కలిపి, మధ్యప్రాచ్య భద్రత, గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్యానికి భయంకర పరిణామాలను సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా ఎనర్జీ సరఫరా, దేశాల రక్షణ వ్యూహాలు, నావికేషన్ విధానాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications