For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్యాభర్తలు ఉద్యోగం వదిలేసి: అమెరికాలోని అత్యంత ధనవంతుల్లో 7గురు భారతీయులు

|

ఫోర్బ్స్ అమెరికా కుబేరుల జాబితాలో భారత సంతతికి చెందిన ఏడుగురికి చోటు దక్కింది. 2020 సంవత్సరానికి గాను అమెరికాలోను అత్యంత ధనవంతులైన 400 మందితో కూడిన జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది. ఇందులో అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. మొత్తంగా Forbes 400 జాబితాలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో నిలిచారు. వరుసగా మూడో ఏడాది మొదటి స్థానం దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ 2.5 బిలియన్ డాలర్లతో 339వ స్థానంలో ఉన్నారు.

అదిరిపోయే ఆఫర్: ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఇది భలే ఛాన్స్.. ఎందుకంటే?అదిరిపోయే ఆఫర్: ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఇది భలే ఛాన్స్.. ఎందుకంటే?

అమెరికాలో టాప్ భారత శ్రీమంతులు వీరే

అమెరికాలో టాప్ భారత శ్రీమంతులు వీరే

ఫోర్బ్స్ 400 జాబితాలోని 7 భారతీయుల విషయానికి వస్తే సైబర్ సెక్యూరిటీ సేవల సంస్థ జెడ్‌‌స్కేలర్ సీఈఓ జైచౌదరి, సింఫనీ టెక్నాలజీస్ గ్రూప్ చైర్మన్ రమేష్ వాద్వానీ, ఆన్‌లైన్ హోంగూడ్స్, రిటైల్ సంస్థ వేఫెయిర్ వ్యవస్థాపకులు, సీఈఓ నీరజ్ షా, ఖోస్లా వెంచర్స్ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా, షేర్‌పా వెంచర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ కవిటర్క్ రామ్ శ్రీరామ్, ఎయిర్ లైన్స్ బిజినెస్‌లోని రాకేష్ గాంగ్వాల్, వర్క్-డే సీఈవో అనిల్ భూశ్రీలకు జాబితాలో చోటు దక్కింది.

జైచౌదరి, జ్యోతి ఉద్యోగాలు వదిలేసి..

జైచౌదరి, జ్యోతి ఉద్యోగాలు వదిలేసి..

- జైచౌదరి Forbes 400 జాబితాలో 6.9 బిలియన్ డాలర్లతో 85వ స్థానంలో నిలిచారు. జెడ్‌‌స్కేలర్‌ను 2008లో ప్రారంభించారు. జైచౌదరి, ఆయన భార్య జ్యోతి 1996లో ఇద్దరూ ఉద్యోగం వదిలేశారు. ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ కంపెనీ సెక్యూర్ఐటీ స్టార్టప్‌ను స్థాపించారు.

- రమేష్ వాద్వానీ ఈ జాబితాలో 238వ స్థానం దక్కించుకున్నారు. అతని నికర ఆస్తి 3.4 బిలియన్ డాలర్లుగా ఉంది. సింపనీ టెక్నాలజీ గ్రూప్ ప్రతి సంవత్సరం 2.5 బిలియన్ డాలర్ల రెవెన్యూ తీసుకు వస్తోంది. 2017లో ఏఐ టెక్నాలజీ నేపథ్యంలో సింఫోనీ ఏఐని స్థాపించారు.

- వెఫెయిర్ వ్యవస్థాపకులు, సీఈవో నీరజ్ షా 2.8 బిలియన్ డాలర్లతో 299వ స్థానం పొందారు. అతను 2002లో మరో బిలియనీర్ స్టీవ్ కొనిన్‌తో కలిసి వ్యాపారం ప్రారంభించారు. వేఫెయిర్ ఇప్పుడు 18 మిలియన్ ఉత్పత్తులు అందిస్తోంది. 2019లో 9.1 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించింది. అంతకుముందు ఏడాది కంటే 35 శాతం లాభపడింది.

ఇక్కడ పుట్టి.. అక్కడ ఎదిగి

ఇక్కడ పుట్టి.. అక్కడ ఎదిగి

- 2.4 బిలియన్ డాలర్లతో వినోద్ ఖోస్లా 353వ స్థానం దక్కించుకున్నారు. ఖోస్లా 1982లో కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ సన్ మైక్రోసిస్టమ్స్ ప్రారంభఇంచారు. 18 ఏళ్ల పాటు వెంచర్ కాపిటల్ కంపెనీ క్లెయినర్ పెర్కిన్స్ కాఫీల్డ్ అండ్ బేయర్స్‌లో ఉన్నారు. అ తర్వాత సొంతగా ఖోస్లా వెంచర్స్ ప్రారంభించారు.

- షేర్‌పా వెంచర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ శ్రీరామ్ 2.3 బిలియన్ డాలర్లతో 359వ స్థానంలో ఉన్నారు. శ్రీరామ్ భారత్‌లో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో చదివారు.

- ఎయిర్ లైన్స్ బిజినెస్‌లో ఉన్న రాకేష్ గాంగ్వాల్ 2.3 బిలియన్ డాలర్లతో 359వ స్థానం దక్కించుకున్నారు. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ద్వారా అతని సంపద పెరిగింది. ఇండిగో సహవ్యవస్థాపకులు కూడా.-

- వర్క్-డే సీఈవో అనిల్ భూశ్రీ 2.3 బిలియన్ డాలర్లతో 359వ స్థానం దక్కించుకున్నారు. 1990లలో భూశ్రీ సాఫ్టువేర్ బిజినెస్ కెరీర్ ప్రారంభించారు. డేవి డఫీల్డ్‌తో కలిసి పీపుల్ సాఫ్ట్ సాఫ్టువేర్ బిజినెస్‌ను స్థాపించారు. దీనికి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. 2008 నుండి ఆరుసార్లు ఫోర్బ్స్ మిడాస్ లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకుంటున్నారు. 2018లో తన సంపదలో ఎక్కువ మొత్తాన్ని దానధర్మాలకు కేటాయించారు.

English summary

భార్యాభర్తలు ఉద్యోగం వదిలేసి: అమెరికాలోని అత్యంత ధనవంతుల్లో 7గురు భారతీయులు | 7 Indian Americans in Forbes list of richest people in US

Seven Indian-Americans have figured in Forbes list of richest Americans, topped by Amazon founder Jeff Bezos for the third year in a row.
Story first published: Wednesday, September 9, 2020, 7:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X