For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతీయులు అవసరంలేదు!: మనోళ్లకు ఇండియన్ ఐటీ కంపెనీల షాక్!!

|

వాషింగ్టన్: అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలు స్థానికులకే ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. అధిక ఖర్చులతో పాటు హెచ్1బీ వీసా కఠిన నిబంధనల నేపథ్యంలో అమెరికన్ల వైపు చూస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికాలోని మన ఐటీ కంపెనీలలో భారతీయులకు అవకాశాలు తగ్గుతూ, అదే సమయంలో అమెరికన్లకు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వచ్చాక హెచ్1బీ వీసాల కఠినతరం, స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలనే ఆయన డిమాండుకు అనుగుణంగా కంపెనీలు ముందుకు సాగుతున్నాయి.

NRIలకు గుడ్‌న్యూస్:ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి,లాభాలుNRIలకు గుడ్‌న్యూస్:ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి,లాభాలు

విప్రో

విప్రో

మరోవైపు విప్రో కూడా జూన్ నెలలో అమెరికాలోని మిన్నేపాలిస్-సెయింట్ పాల్ ప్రాంతంలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. రాబోయే రెండేళ్లలో 100 మంది స్థానికులను నియమించుకోనుంది. విప్రో స్థానిక మిన్నెసోటా టాలెంట్‌కు పదును పెట్టే ప్రక్రియను ప్రారంభిస్తోంది. ఇటీవలి కాలంలో యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్, ఎక్స్‌పర్ట్స్ నైపుణ్యాల్ని పెంపొందించుకునేందుకు ఆసక్తి కలిగిన వారికి అవకాశాలను కల్పిస్తోంది.

కాగ్నిజెంట్

కాగ్నిజెంట్

కాగ్నిజెంట్ కూడా అమెరికన్లను హైర్ చేసుకుంటోంది. 76 శాతం తమ రెవెన్యూ నార్త్ అమెరికా నుంచి వస్తోందని, 49 రాష్ట్రాలలో 60 యూఎస్ ఫెసిలిటీస్, క్లయింట్స్ కలిగి ఉన్నామని, రానున్న 5 ఏళ్ళ కాలంలో 25,000 మంది స్థానిక ఉద్యోగులను నియమించుకోవాలని 2017 సంవత్సరంలో నిర్ణయించుకున్నామని కాగ్నిజెంట్ తెలిపింది.

HCL టెక్నాలజీస్

HCL టెక్నాలజీస్

హెచ్1బీ వీసా కఠిన నిబంధనల నేపథ్యంలో HCL టెక్నాలజీస్ కూడా స్థానికుల వైపు మరింతగా చూస్తోంది. ఈ కంపెనీలో 17,000 మంది ఉద్యోగులు ఉండగా ఇందులో 64.7 శాతం ఉద్యోగులు అమెరికా సిటిజన్లుగా తెలుస్తోంది.

ఇన్ఫోసిస్

ఇన్ఫోసిస్

అరిజోనాలో ఇన్ఫోసిస్ ఇటీవల టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా తాము అమెరికాలో 2023 నాటికి 1,000 మంది స్థానికులను చేర్చుకుంటామని ఇన్ఫోసిస్ సెప్టెంబర్ 13వ తేదీన ప్రకటించింది. 10,000 మంది ఉద్యోగులను చేర్చుకుంటామని గతంలో ప్రకటించింది. దీనిని ఫుల్‌ఫిల్ చేసింది.

టీసీఎస్

టీసీఎస్

అతిపెద్ద ఐటీ సర్వీసెస్ ప్రొవైడర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో (TCS) 30,000 మంది స్థానిక అమెరికా ఉద్యోగులు ఉన్నారు.హెచ్1బీ వీసాల జారీ గత సెప్టెంబర్ - అక్టోబర్ కాలంలో 3,73,400 నుంచి 3,35,000కు తగ్గాయి. 2014 నుంచి 2017 మధ్య ఈ ఐటీ కంపెనీల ఇనిషియల్ ఎంప్లాయిమెంట్ హెచ్1బీ వీసాలు 40 శాతం వరకు పడిపోయాయి.

పెరుగుతున్న వీసా నిరాకరణలు..

పెరుగుతున్న వీసా నిరాకరణలు..

గత కొన్నేళ్లుగా హెచ్1బీ ఉద్యోగుల ఎంప్లాయిమెంట్ అమెరికాలో తగ్గగా, అమెరికాలో పుట్టిన వారికి ఉద్యోగాలు 5-7 శాతం పెరిగాయి. వీసా నిరాకరణ శాతం పెరుగుతోంది.

- USCIS డేటా ప్రకారం... FY19 తొలి క్వార్టర్‌లో విప్రో వీసా నిరాకరణ శాతం అత్యధికంగా 62 శాతంగా ఉంది. ఇది FY15లో 7 శాతం మాత్రమే. ఇన్ఫోసిస్ విసా నిరాకరణ 2018 అక్టోబర్ - డిసెంబర్ మధ్యలో 57 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 43 శాతం, టీసీఎస్ 37 శాతంగా ఉంది.

English summary

భారతీయులు అవసరంలేదు!: మనోళ్లకు ఇండియన్ ఐటీ కంపెనీల షాక్!! | Indian IT companies increase local hiring in US on tight visa norms

Indian IT companies are not ready to pay high and go through the complex process of H1B visa to recruit Indian IT Employees. So Indian IT companies are recruiting american it talents.
Story first published: Friday, September 27, 2019, 15:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X