For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు, భారత మార్కెట్లపై ప్రభావం

|

వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను తగ్గించింది. అందరూ ఊహించిన విధంగా వడ్డీ రేట్లపై పావు శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం ఇధి వరుసగా రెండోసారి. దీంతో అమెరికాలో ఓవర్ నైట్ లెండింగ్ వడ్డీ రేట్లు 2 - 2.25 శాతం నుంచి 1.75 - 2 శాతానికి తగ్గాయి. గత క్వార్టర్లోను వడ్డీ రేటును తగ్గించారు. 2008 తర్వాత ఇలా వరుసగా రెండుసార్లు వడ్డీ రేటును తగ్గించడం ఇదే మొదటిసారి.

ఈ-సిగరేట్లపై నిషేధం: కేంద్రం కీలక ప్రకటన, జరిమానా ఏమంటేఈ-సిగరేట్లపై నిషేధం: కేంద్రం కీలక ప్రకటన, జరిమానా ఏమంటే

ప్రపంచ దేశాలపై పెడ్ రేటు ప్రభావం ఎందుకు?

ప్రపంచ దేశాలపై పెడ్ రేటు ప్రభావం ఎందుకు?

ఫెడ్ పాలసీ వైపు ప్రపంచ దేశాలు అన్ని ఆసక్తిగా చూస్తాయి. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎన్నో దేశాలకు అవసరం. ఫెడ్ నిర్ణయాల ప్రభావం పలు దేశాలపై ఆధారపడి ఉంటుంది. కరెన్సీ మార్పిడీ రేట్లు, వడ్డీ రేట్లు, అంతర్జాతీయవ్యాప్తంగా పెట్టుబడుల ప్రవాహాల విధానం వంటి ఫైనాన్షియల్ మార్కెట్ పైన ఫెడ్ పాలసీ ప్రభావం చూపుతుంది.

అమెరికా ఎక్స్‌పోర్ట్స్ మార్కెట్ పైన ప్రభావం

అమెరికా ఎక్స్‌పోర్ట్స్ మార్కెట్ పైన ప్రభావం

ఎన్నో దేశాలకు అమెరికా ముఖ్యమైన ఎక్స్‌పోర్ట్ మార్కెట్. ఆర్థిక మాంద్యం ఉంటే ఇతర దేశాల నుంచి వస్తువులను తక్కువగా కొనుగోలు చేస్తుంది. తొలుత ప్రభావం పడేది కెనడా, మెక్సికో వంటి దేశాలపై పడుతుంది. ఈ రెండు దేశాల నుంచి వారి ఎగుమతుల్లో మూడొంతుల కంటే ఎక్కువగా అమెరికాకు వెళ్తాయి.

యూకే పైనా ప్రభావం...

యూకే పైనా ప్రభావం...

ఆ తర్వాత యూకే ఎకానమీపై కూడా ప్రభావం పడుతుంది. కెనడా, మెక్సికో దేశాలపై పడినంత ప్రభావం పడకపోయినా యూకేపై మాత్రం ఎక్కువే ఉంటుంది. యూకే నుంచి అమెరికాకు ఎక్స్‌పోర్ట్ అవుతుంటాయి. ఆ తర్వాత ఈయూ తదితర దేశాలకు వెళ్తాయి. యూకే ఎగుమతుల్లో అమెరికా వాటా 13 శాతం. ఫెడ్ వడ్డీ రేటు ప్రభావం మార్కెట్ల పైన కూడా పడుతుంది.

ఫెడ్ రేట్ మార్పు ప్రభావం ప్రపంచ దేశాలపై...

ఫెడ్ రేట్ మార్పు ప్రభావం ప్రపంచ దేశాలపై...

అమెరికా వంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తన ఫెడ్ రేటును మార్చినప్పుడు ఆ ప్రభావం ఇతర దేశాలపై పడుతుంది. ఫెడ్ రేట్ కట్ చేస్తే ఇది మన కరెన్సీకి ఇబ్బందిని తగ్గిస్తుందని, భారత మార్కెట్లకు ఊరట కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది భారతీయ ఈక్విటీలకు, రుణాల్లోకి మరింత నిధుల ప్రవాహానికి కారణమవుతుందంటున్నారు. అదే సమయంలో ఎఫ్‌పీఐల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే, ఇండియన్ సెంట్రల్ బ్యాంకు రేట్ల నిర్ణయానికి మార్గం చూపిస్తుందని అంటున్నారు. ఫెడ్ రేటు తగ్గింపు కంపోర్ట్‌గా ఉంటుందని చెబుతున్నారు.

భిన్నంగా ఉంటే డాలర్ బలపడి మార్కెట్లకు నిరాశ

భిన్నంగా ఉంటే డాలర్ బలపడి మార్కెట్లకు నిరాశ

ఫెడ్ రేటు కట్ అంచనాలకు భిన్నంగా ఉంటే అంటే ఫెడ్ రేటును కట్ చేయకుంటే పెంచితే డాలర్ మరింత బలపడి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను నిరాశపరుస్తుందని భావించారు. అయితే ఫెడ్ రేట్ కట్ చేసినందువల్ల సానుకూలమేనని అంటున్నారు.

English summary

ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు, భారత మార్కెట్లపై ప్రభావం | US Fed cuts interest rates for second time since 2008

The US Federal Reserve cut interest rates by a quarter of a percentage point for the second time this year on Wednesday in a widely expected move meant to sustain a decade long economic expansion, but gave mixed signals about what may happen next.
Story first published: Thursday, September 19, 2019, 10:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X