వాషింగ్టన్: అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ట్రంప్ ప్రభుత్వంతో ట్రేడ్ వార్ నేపథ్యంలో అగ్రదేశం ఎంత దాకా వెళ్తే బీజింగ్ కూడా అంత దూరం వెళ్లేందుకు సిద్ధంగా ఉందని, ఎక్కడా తగ్గే సమస్య లేదని చైనా స్టేట్ రన్ మీడియా పేర్కొంది. వాణిజ్యంపై చర్చలు జరగాలంటే చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై వాషింగ్టన్ టారిఫ్ తగ్గించాల్సిందేనని ఆ పత్రిక పేర్కొంది. చర్చలు ఇరువైపులా లాభం కలిగేలా ఉండాలని పేర్కొంది.
ట్రంప్ ప్రారంభించిన ట్రేడ్ వార్ అమెరికాకే భారంగా మారిందని చెబుతున్నారు. చైనాకు నుంచి దిగుమతి అయ్యే 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్ విధించింది. దీంతో అమెరికా వినియోగదారులు అదనంగా 12.2 బిలియన్ డాలర్లను వెచ్చించవలసి వస్తోంది. ముఖ్యంగా దుస్తులు, ఫుట్‌వేర్, గృహోపకరణలపై ఈ భారం పడుతోందట.

టారిఫ్స్ వల్ల దుస్తులపై 4.4 బిలియన్ డాలర్లు, ఫుట్‌వేర్‌పై 2.5 బిలియన్ డాలర్లు, బొమ్మలపై 3.7 బిలియన్ డాలర్లు, గృహోపకరణాలపై 1.6 బిలియన్ డాలర్లు అదనంగా చెల్లించవలసి వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మార్కెట్లు ఈ వ్యాపారాలకు అనుకూలంగా ఉండవని, దిగుమతుల కోసం ఇతర దేశాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుందని, కొద్ది రోజులు చైనా సరఫరాదారులనే కొనసాగించి ఆ భారం వినియోగదారులపై మోపుతారని ఆందోళన చెందుతున్నారు. అమెరికా ఫ్యాషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రకారం టారిఫ్ కారణంగా వినియోగదారులపై 4.9 బిలియన్ డాలర్ల అదనపు భారం పడుతోంది.
వాషింగ్టన్ - బీజింగ్ ట్రేడ్ వార్ పైన చైనాలోని కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. మేడిన్ చైనా యుగం ముగిసిందని... ప్రపంచంలోనే అత్యధికంగా సైకిళ్లను తయారు చేసే జెయింట్ మ్యానిఫ్యాక్చరింగ్ కో చైర్మన్ బోన్నీటు ఇటీవల అన్నారు. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారిఫ్ అన్నారో.. అప్పటి నుంచే తాము సీరియస్‌గా దృష్టి సారించామని చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీ అమెరికాకు చెందిన తమ ఆర్డర్ల కోసం తమ ప్రొడక్షన్‌ను తైవాన్‌కు మార్చాలని నిర్ణయించింది.
తాము అధిక టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ గత సెప్టెంబర్‌లో చెప్పినప్పటి నుంచే ఈ సైకిళ్ల తయారీ కంపెనీ ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ట్రంప్ నోరు మూయకముందే తాము వెళ్లేందుకు సిద్ధమయ్యామన్నారు. తద్వారా ట్రంప్ తమపై టారిఫ్ విధించకముందే వెళ్తున్నట్లుగా చెప్పారు. ట్రంప్ టారిఫ్ దెబ్బకు చైనా నుంచి పలు కంపెనీలు వలస పోతున్నాయి. కొన్ని కంపెనీలు అమెరికాకు, మరికొన్ని ఇతర దేశాలకు వెళ్తున్నాయి.
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications