For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన అమెరికా స్టాక్ నిల్వలు, పెరిగిన చమురు ధరలు

|

ఉత్పత్తి తగ్గింపుపై ఓ తేదీన సమావేశమవ్వాలని OPECతో పాటు ఇతర చమురు ఉత్పత్తి దేశాలు అంగీకరించాయి. యూఎస్ క్రూడ్ స్టాక్స్ ఊహించిన దాని కంటే ఎక్కువగా పడిపోయాయి. యూఎస్ క్రూడ్ స్టాక్స్ భారీగా పడికావడంతో చమురు ధరలు గురువారం నాడు ఒక శాతం పెరిగాయి.

HDFC చేతికి అపోలో మునిచ్, పెట్టుబడిపై నాలుగు రెట్ల ప్రతిఫలంHDFC చేతికి అపోలో మునిచ్, పెట్టుబడిపై నాలుగు రెట్ల ప్రతిఫలం

బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ 82 సెంట్లు లేదా 1.3 శాతం పెరిగింది. దీంతో బ్యారెల్ ధర 62.64 డాలర్లకు పెరిగింది. ఇది బుధవారం నాడు 0.5 శాతం పడిపోయింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI)లో క్రూడ్ ఫూచర్స్ 79 సెంట్లు లేదా 1.5 శాతం పెరిగి, బ్యారెల్‌కు 54.55 డాలర్లు అయింది. అంతకుముందు సెషన్‌లో WTI 0.26 శాతం పడిపోయింది.

Oil prices rise as US stockpiles drop, OPEC agrees meeting date

గత రెండేళ్లుగా యూఎస్ క్రూడ్ స్టాక్స్ వరుసగా పెరుగుతున్నాయి. కానీ గత వారం యూఎస్ క్రూడ్ స్టాక్స్ 3.1 మిలియన్ బ్యారెల్స్‌కు పడిపోయాయి. అయితే నిపుణులు మాత్రం 1.1 మిలియన్ బ్యారల్స్ ఊహించగా అంతకుమించి పడిపోయాయి.

ఈ అంశంపై యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ఎనర్జీ మినిస్టర్ స్పందిస్తూ... చమురు ధరలు అస్థిరత ప్రస్తుతం కొనసాగే అవకాశమున్నప్పటికీ, opec దేశాల సమావేశం దీనికి ఓ పరిష్కారం లభించేలా ఉంటుందని, ధరలకు అవసరమైన ఉపశమనం కలుగుతుందని చెప్పారు.

మరోవైపు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇంటరెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశముందని, అలాగే, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చైనా ప్రెసిడెంట్ జీ జింగ్‌పింగ్‌తో వచ్చే వారం సమావేశం కానున్న నేపథ్యం మార్కెట్లకు అనుకూలమని చెబుతున్నారు. గత వారం హార్మూజ్ జలసంధి వద్ద రెండు ట్యాంకర్లపై దాడులు జరగడం మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్‌కు కారణమయ్యాయి. ఆయిల్ ధరలు పెరగడానికి ఇది కూడా ఓ కారణం.

English summary

తగ్గిన అమెరికా స్టాక్ నిల్వలు, పెరిగిన చమురు ధరలు | Oil prices rise as US stockpiles drop, OPEC agrees meeting date

Oil prices rose over one per cent on Thursday as official data showed US crude stocks fell more than expected and as OPEC and other producers finally agreed a date for a meeting to discuss output cuts.
Story first published: Thursday, June 20, 2019, 16:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X