For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రంప్‌కు మోడీ దెబ్బకు దెబ్బ, ట్రేడ్ హీట్: ఇండియా దిగుమతులివే.. ఏ దేశం నుంచి ఎంత అంటే?

|

న్యూఢిల్లీ: భారత్ - అమెరికా మధ్య ఇటీవల వాణిజ్య సంబంధాలు హాట్ హాట్‌గా మారాయి. ఇప్పటికే అగ్రరాజ్యం-డ్రాగన్ కంట్రీ చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. భారత్‌కు జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (GSP)ని విత్ డ్రా చేసుకుంది. GSPతో 3,000కు పైగా ఉత్పత్తులను ఉచితంగా మనం ఎగుమతి చేసేవాళ్లు. విత్ డ్రా చేసుకోవడంతో భారత్‌పై భారం పడింది. దీంతో మోడీ ప్రభుత్వం కూడా దెబ్బకు దెబ్బ అనే విధంగా 29 అమెరికన్ ఉత్పత్తులపై అధిక టారిఫ్ విధించింది. ఈ నెల 24వ తేదీన యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టే మైక్ పాంపియో ఇండియాకు రానున్నారు. ఈ సమయంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు కాస్త హాట్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి భారత్ దిగుమతుల గురించి తెలుసుకుందాం...

భారత్‌కు అమెరికా షాక్, GSP ప్రభావం ఉండదని ఇండియాభారత్‌కు అమెరికా షాక్, GSP ప్రభావం ఉండదని ఇండియా

భారత్ ముఖ్యమైన దిగుమతులు

భారత్ ముఖ్యమైన దిగుమతులు

ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ) 2018-19 డేటా ప్రకారం.. భారత్ దిగుమతి చేసుకునే వాటిలో మినరల్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటి దిగుమతుల శాతం 32.6గా ఉంది. క్రూడాయిల్ 18 శాతం, కోల్ బ్రికెట్స్ 4.7 శాతం, పెట్రోలియం గ్యాస్ 2.9 శాతంగా ఉంది. ఆ తర్వాత ప్రీసియస్ మెటల్స్, గోల్డ్, డైమండ్స్ కలిపి 12.5 శాతం మేర దిగుమతి చేసుకుంటున్నాం. ఎలక్ట్రికల్ మెషినరీ అండ్ ఎక్విప్‌మెంట్స్ 10.2 శాతం, టెలిఫోన్స్ 2.7 శాతం, బ్రాడ్‌కాస్టింగ్ పరికరాలు 1.8 శాతం, కంప్యూటర్స్ 1.1 శాతం, సెమీ కండక్టర్ పరికరాలు 1.1 శాతం దిగుమతి చేసుకుంటున్నాం.

దిగుమతుల శాతం ఇలా...

దిగుమతుల శాతం ఇలా...

న్యూక్లియర్ రియాక్టర్స్, బాయిలర్స్ వంటి నాన్ ఎలక్ట్రికల్ మెషినరీ దిగుమతులు, అలాగే ఇతర నాన్ ఎలక్ట్రికల్ పరికరాలు కలిపి 8.52 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. మెటల్ దిగుమతులు 6 శాతంగా ఉన్నాయి. ఇందులో ఐరన్, స్టీల్ దిగుమతులే ఎక్కువ. వీటి దిగుమతులు 2.4 శాతంగా ఉండగా, ఐరన్, స్టీల్ ఆర్టికల్స్ 1 శాతం, కాపర్ 1 శాతం, అల్యూమినియం 1.1 శాతంగా ఉన్నాయి. కెమికల్ దిగుమతులు 5.8 శాతంగా ఉన్నాయి. ప్రధాన కెమికల్ దిగుమతుల్లో సైక్లిక్ హైడ్రోకార్బన్స్, అసైక్లిక్ ఆల్కాహాల్స్, నైట్రోజన్ హెటిరో సైక్లిక్ కాంపౌండ్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్, పాస్పరిక్ యాసిడ్ వంటివి ఉన్నాయి. ఇతర దిగుమతుల విషయానికి వస్తే ప్లాస్టిక్ 3 శాతం, అనిమల్ అండ్ వెజిటేబుల్ ఆయిల్, ఉత్పత్తులు 1.9 శాతం, ఫెర్టిలైజర్స్ 1.3 శాతం, నాన్ రైల్వేస్ వెహికిల్స్ 1.4 శాతం, మెరిటైమ్ ట్రాన్సుపోర్ట్ వెహికిల్స్ 1.1 శాతంగా ఉన్నాయి. ఎడిబుల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, రబ్బర్, పేపర్ వంటివి కూడా దిగుమతి చేసుకుంటున్నాం.

భారత్ వాణిజ్య భాగస్వాములు

భారత్ వాణిజ్య భాగస్వాములు

2018-19లో టాప్ 5 భారత వాణిజ్య భాగస్వాముల్లో చైనా (13.6 శాతం), అమెరికా (6.9 శాతం), యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (5.7 శాతం), సౌదీ అరేబియా (5.5 శాతం), ఇరాక్ (4.3 శాతం) ఉన్నాయి. డాలర్ల పరంగా దిగుమతులు చూస్తే వరుసగా చైనా (70.3 బిలియన్ డాలర్లు), అమెరికా (35.5 బిలియన్ డాలర్లు), యూఏఈ (29.7 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (28.4 బిలియన్ డాలర్లు), ఇరాక్ (22.3 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.

టాప్ 20 దేశాలు

టాప్ 20 దేశాలు

అయితే చైనా నుంచి దిగుమతులు 2016-17లో 16.4 శాతం ఉండగా, 2018-19 నాటికి 13.6 శాతానికి తగ్గాయి. వాణిజ్య లోటును బ్యాలెన్స్ చేయాలని భారత్ భావిస్తోంది. MIT ల్యాబ్స్ అబ్జర్వేటరీ ఆఫ్ ఎకనామిక్స్ కాంప్లెక్సిటీ డేటా ప్రకారం 2016-17లో చైనా నుంచి 56 శాతం దిగుమతులు మెషీన్స్‌కు సంబంధించినవే. ఇందులో టెలిఫోన్స్, బ్రాడ్‌కాస్ట్ ఎక్విప్‌మెంట్స్, సెమీ కండక్టర్స్, కంప్యూటర్స్, ఆఫీస్ మెషీన్ పార్ట్స్, వీడియో డిస్‌ప్లేలు, బ్రాడ్ కాస్టింగ్ యాక్సెసరీస్, ఎలక్ట్రికల్ ట్రాన్సాఫార్మర్స్, ఎయిర్ పంప్స్ ఉన్నాయి.

భారత్ వాణిజ్య జాబితాలో అమెరికా రెండో స్థానంలో ఉంది. అగ్రరాజ్యం నుంచి ముఖ్యంగా ఎగుమతి యంత్రాలు, ప్రీసియస్ మెటల్స్, కెమికల్ ఉత్పత్తులు, మినరల్ ఉత్పత్తులు ఉన్నాయి.

ఆ తర్వాత యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్‌లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రధానంగా క్రూడాయిల్ సరఫరా అవుతుంది. దేశానికి అవసరమైన అదనపు క్రూడ్, పెట్రోలియం గ్యాస్ ఇరాన్, ఖతార్ నుంచి దిగుమతి అవుతున్నాయి.

ఈ ఐదు దేశాల నుంచే కాకుండా వివిధ ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. టాప్ 20 దేశాల్లో (విలువపరంగా దిగుమతులు) పై ఐదు దేశాల తర్వాత వరుసగా... స్విట్జర్లాండ్, హాంగ్‌కాంగ్, సౌత్ కొరియా, సింగపూర్, ఇండోనేషియా, జర్మనీ, ఇరాన్, ఆస్ట్రేలియా, జపాన్, నైజీరియా, మలేషియా, ఖతార్, బెల్జియం, యునైటెడ్ కింగ్‌డమ్, థాయ్‌లాండ్ ఉన్నాయి.

English summary

ట్రంప్‌కు మోడీ దెబ్బకు దెబ్బ, ట్రేడ్ హీట్: ఇండియా దిగుమతులివే.. ఏ దేశం నుంచి ఎంత అంటే? | As Trump and Modi governments tussle over trade, a look at what India imports from where

India has now entered a trade skirmish of its own with the US, never mind the latter’s larger ongoing war with China.
Story first published: Wednesday, June 19, 2019, 19:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X