For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌కు అమెరికా గుడ్ న్యూస్: కరెన్సీ మానిటరింగ్ లిస్ట్ నుంచి తొలగింపు

|

వాషింగ్టన్: ప్రధాన వ్యాపార భాగస్వాముల కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత కరెన్సీ రూపాయిని అమెరికా తొలగించింది. అమెరికాకు అనుకూలంగా భారత్ చర్యలు చేపట్టింది. దీంతో అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ లిస్ట్ నుంచి భారత్‌తో పాటు స్విట్జర్లాండ్‌ను కూడా తొలగించారు. గత ఏడాది అక్టోబర్‌లో భారత్, స్విట్జర్లాండ్ సహా చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియాలను ఈ లిస్టులో మరోసారి చేర్చారు. మంగళవారం నాడు భారత్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. భారత్, స్విట్జర్లాండ్ మినహా దేశాలు ఈ లిస్ట్‌లో కొనసాగుతున్నాయి. చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియాలతో పాటు ఇటలీ, ఐర్లాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాంల కరెన్సీలు అలాగే ఉన్నాయి.

ఇండియాను కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి తొలగించారని, మూడు పరిస్థితుల్లో ఈ లిస్ట్‌లో పేరు ఉంటుందని, కానీ భారత్‌కు ఒక్కటి మాత్రమే ఉందని, అది వాణిజ్య మిగులు అని అమెరికా ట్రెజరీ విభాగం తమ సెమీ యాన్యువల్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇలా వరుసగా రెండుసార్లు ఉందని, కాబట్టి భారత్‌ను ఈ జాబితా నుంచి తొలగించినట్లు తెలిపింది.

హెచ్చరిక!: మే 31వ తేదీలోగా మీ అకౌంట్‌లో రూ.12 ఉండాలిహెచ్చరిక!: మే 31వ తేదీలోగా మీ అకౌంట్‌లో రూ.12 ఉండాలి

US takes India off watchlist for curency practices

అమెరికా ప్రధాన వ్యాపార భాగస్వామ్య దేశాలకు సంబంధించి మ్యాక్రోఎకనమిక్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ పాలసీలను రూపొందించింది. ఈ నివేదికను యూఎస్ కాంగ్రెస్‌కు పంపించారు. ఈ నివేదిక ప్రకారం IMF ప్రమాణాలను భారత్ పాటిస్తోంది. 2018లో ఈ రెండు దేశాల విదేశీ మారకద్రవ్యం కొనుగోలు గణనీయంగా తగ్గాయని పేర్కొంది.

2017లో భారత్ విదేశీ మారకద్రవ్యాన్ని పర్చేస్ చేసింది. 2018లో క్రమంగా దీనిని విక్రయించింది. ఇది జీడీపీలో 1.7 శాతంగా ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. భారత్, స్విట్జర్లాండ్‌లు గత ఏడాది విదేశీ మారకద్రవ్యం కొనుగోలు తగ్గిందని పేర్కొంది. ఈ జాబితాలో చేర్చిన తర్వాత భారత్ చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పుడు ఈ లిస్ట్ నుంచి తొలగించారు.

ఈ జాబితాలో భారత్‌ను గత ఏడాది మే నెలలో తొలిసారి చేర్చారు. అదే సమయంలో చైనా, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్ దేశాలను చేర్చారు. అనంతరం అక్టోబర్ (2018)లో మరోసారి పొడిగించినప్పటికీ.. భారత్ మెరుగుపడిందని, వచ్చే నివేదికలో తొలగిస్తామని పేర్కొంది.

English summary

భారత్‌కు అమెరికా గుడ్ న్యూస్: కరెన్సీ మానిటరింగ్ లిస్ట్ నుంచి తొలగింపు | US takes India off watchlist for curency practices

The Donald Trump administration on Tuesday removed India from its currency monitoring list of major trading partners, citing certain developments and steps being taken by New Delhi which address some of its major concerns.
Story first published: Wednesday, May 29, 2019, 14:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X